Wednesday 4 September 2013

nacha mathsthaani bhoothaani

న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగ మైశ్వ రం /

భూత భ్నన్న  చ భూతస్థో మమాత్మా భూత భావనః //5//

అర్జునా!ఒకటి అర్ధం చేసుకో నిదానం గా . ఈ ప్రాణి కోటి అంతా నా యందు స్థిరం గా లేదు . నా యొక్క ఈశ్వర తత్త్వం తో నిండి ఉన్న అనంతమయిన యోగ శక్తిని గమనించు విశదంగా . భూతములను సృష్టించేవాడను నేనే . వాటన్నిటిని పోషించేవాడిని నిజానికి నేనే . ఈ సమస్త భూమండలాన్ని భరించే వాడిని నేనే .

కాని వాస్తవానికి నా ఆత్మ వీటన్నిటిలో స్థితమై వుండదు .
ఇక్కడ భూతములు అంటే దయ్యాలు భూతాలు అనే అర్ధం కాదు . భూతములు అంటే ప్రాణము వున్నవి అర్ధం . 

No comments:

Post a Comment