Friday, 16 October 2026
అవ్యక్తా ద్వ్యక్తయ…Avyakthaa dvyakthaya
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవం త్యహరాగమే।
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే॥18॥8॥
శ్రీమద్భగవద్గీత..।అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ పగలు అంటే ఏంది?రాత్రి అంటే ఏంది?అసలు అప్పుడు ఏమి జరుగుతుంది చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!బ్రహ్మ పగలు రాత్రి అనేవి మనకు వేల యుగాలు అని తెలిసింది కదా,నీకు.బ్రహ్మ పగలులో అవ్యక్త ప్రకృతి నుండి సృష్టి మొదలు అయి,కొనసాగుతుంది.మళ్ళీ రాత్రి అయింది అనుకో సృష్టి మొత్తమూ లయము అవుతుంది.అలా తిరిగి అవ్యక్తములోకి జారుకుంటుంది.
Avyakthaa dvyakthaya ssarvaah prabhavam thyaharaagame/
Raathyaagame praleeyanthe thathraivaavyaktha sanjnake//18//8//
Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu...
Sri Krishna is explaining Arjuna regarding what happens during day time of Brahma and during night time of Brahma.Arjuna!hey Kireeti!I just told you that a single day and night of Brahma make up for thousans of ages for the mankind.Are you interested to learn about what Brahma does during his day and night?I will tell you.During day time creation of universe and life starts from unmanifested primordial nature and prospers.During Brahmas night,all the creation gets destroyed or nullified.Then automatically,it again disintegrates into oblivion and becomes one with unmaifested primordial nature.
Wednesday, 14 October 2026
సహస్ర యుగ పర్యంతం …. Sahasra yuga
సహస్ర యుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః।
రాత్రిం యుగ సహస్రాంతాం తేఽహోరాత్ర విదో జనాః॥17॥8॥
శ్రీమద్భగవద్గీత....అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడిని అన్ని విద్యలలో నిష్ణాతుడిని చేయాలనుకుంటున్నాడు.అందుకే ఓపికగా ప్రతి ఒక్క విషయమూ సమూలాగ్రంగా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ బావా!బ్రహ్మ,బ్రహ్మలోకము అనే పదాలు నేను వాడుతున్నాను కదా!వాటి గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా?ఊహూ?సరే,నేనే చెబుతాను,విను.మనకు పగలు పన్నెండు గంటలు,రాత్రి పన్నెండు గంటలు.రోజుకు ఇరవై నాలుగు గంటలు.అంతేగా?కానీ బ్రహ్మకు మన వేయి యుగాలు ఒక పగలు.అట్లా ఇంకో వేయి యుగాలు ఒక రాత్రి.ఈ సత్యము తెలుసుకున్న నాడు మానవుడు కాలవేత్త అయిపోయినట్లే!అంటే జ్ఞాన సముపార్జనలో ఒక అడుగు ముందుకు వేసినట్లే.
॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥
Sahasra yuga paryantha maharyadbramhano viduh/
Raathrim yugasahasraanthaam theaho raathra vido janaah//17//8//
Sri madbhagavadgeetha....Aksharaparabrahma yogamu....
Sri Krishna is telling Arjuna so many new things.Arjuna!hey brother!do you know that thousand ages(yuga)make a day for Brahma?Similarly,another thousand ages make one night for Brahma?Person who realises this and acknowledges it becomes a saint and a scholar.
Tuesday, 13 October 2026
ఆ బ్రహ్మ భువనా…Aa Brahma bhuvanaa
ఆ బ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తి నోఽర్జున।
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే॥16॥8॥
శ్రీమద్ భగవద్గీత..।।అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి భలే సులభంగా అర్థం అయ్యేటట్లు చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయ!నేను నీకు ఇప్పుడే చెప్పాను కదా!నన్ను నమ్మినవాడు చెడిపోడు.వాడికి పరమపదం దక్కడం తథ్యము అని.ఇంకో విషయం కూడా చెబుతాను,విను.బ్రహ్మలోక పర్యంతమూ జీవకోటికి పునర్జన్మలు ఉన్నాయి.కానీ...నన్నే నమ్ముకుని,నన్ను చేరినవారికి పునర్జన్మ అంటూ ఉండదు.కేవలము కైవల్యమే!
Aa brahmabhuvanaa llokaah punaraavarthi noarjuna/
Maamupethya thu kountheya punarjanma na vidyathe//16//8//
Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu...
Sri Krishna is explaining Arjuna in an understandable way.Arjuna!hey Kountheya!I just told you now that no one suffers any loss once he comes under my protection.Up to the highest celestial realm,Brahmaloka,every living being passes through repeated births and deaths.But...one who comes under My protection and reaches Me with his devotion and dedication need not pass through many births and deaths because he attains Moksha.
Monday, 12 October 2026
మాముపేత్య ….Maamupethya
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్।
నాప్నువంతి మహాత్మాన స్సంసిద్ధిం పరమాం గతాః॥15॥8॥
శ్రీమద్భగవద్గీత ...అక్షర పరబ్రహ్మయోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తనను నమ్ముకుంటే చేకూరే లాభాలు చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నీకు అనిపిస్తుంది కదా!ఈయనను నమ్ముకుంటే ఏంది లాభం అని.అది కూడా చెబుతాను,విను.ఈ లోకము అంతా ఏంది చెప్పు?అంతా దుఃఖ భూయిష్టమే కదా!ఏదీ శాశ్వతము కాదు కదా!అంతా అశాశ్వతమే కదా!నన్ను నమ్ముకున్నవాడు తిరిగి ఈ భూమి పైన జన్మించకుండా మోక్షము దక్కేలా చేస్తాను.
Maamupethya punarjanma duhkhaalaya masaaswatham/
Naapnuvanthi mahaathmaana ssamsiddhim paramaam gathaah//15//8//
Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu...
Sri Krishna is explaining Arjuna,the benefits of believing in Him.Arjuna!hey Kireeti!you might be thinking that what is the use in believng Me.Right?I will tell you.Arjuna!you know that this world is full of misery and hardships.This is just temporary and nothing is permanent here.But I bless my devotee,who has immense faith in Me,not to be born here again.I let him achieve Paramapadam or Salvation.
Sunday, 11 October 2026
అనన్యచేతా…Ananya chethaa
అనన్య చేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః।
తస్యాహం సులభః పార్థ నిత్య యుక్తస్య యోగినః॥14॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను చెప్పిన దాన్ని బట్టి నీకేమి అర్థం అయింది?నన్ను నమ్ముకోవాలి.నేను తప్ప ఇంక వేరే ఇతర ఆలోచనలు ఉండకూడదు బుర్రలో అని కదా!నిత్యం నన్నే స్మరించాలి.అట్లాంటి వారికే నేను సులభంగా దక్కుతాను.
Ananya chethaa ssathatham yo maam smarathi nithyasah/
Thasyaaham sulabhah paardha nithya yukthasya yoginah//14//8//
Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu..
Sri Krishna is explaining Arjuna.Arjuna!hey Pardha!what did you understand and assimilate from my preachings till now?One has to have belief in Me.I should be in his mind all the time.He should keep away all other thoughts except Me.He should give his entire life to Me...thinking,devoting and appealing and believing Me all the time.I am easily accessible to those devotees.
Saturday, 10 October 2026
సర్వద్వారాణి…Sarva dvaaraani
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ।
మూర్థ్న్యాధాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్॥12॥8॥
ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరన్।
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్॥13॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమి చేస్తే పరమ పదాన్ని పొందవచ్చో చెప్పాడు.ఇప్పుడు ఎలా చేయాలి అని పద్ధతి వివరిస్తున్నాడు.అంటే ఏదీ సగం సగంలో ఆపటం లేదు.ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తున్నాడు.ఎందుకంటే అర్జునుడి మనసులో ఎలాంటి అనుమానానికీ తావు ఉండకూడదని.అర్జునా!ఓ సఖా!నేను ఎలా ధ్యానము చేయాలో కూడా చెబుతాను విను.మొదట మనిషి నవద్వారాలనూ బంధించాలి.ఇంద్రియాలను నిగ్రహించాలి.చిత్తవృత్తులు నిరోధించాలి.ప్రాణాన్ని సహస్రార చక్రములో నిలపాలి.బ్రహ్మపరమయిన ఏకాక్షరము ఓం అనే మంత్రాన్ని ధ్యానిస్తూ,నన్నే స్మరించాలి.ఈ స్థితిలో ఏకాగ్ర మనస్కుడు అయి దేహాన్ని త్యజించేవాడు మటుకే పరమ పదాన్ని పొందుతాడు.అంతే కానీ తూ తూ మంత్రాలు చదువుతూ,నలుగురు చూస్తుంటే ఒక రకంగా,ఎవరూ చూడకపోతే ఇంకో రకంగా ధ్యానము చేసేవాడు కాదు.
Sarvadvaaraani samyamya mano hrudi nirudhya cha/
Moordhnyaadhaayaathmanah praana maasdhitho yogadhaaranam//12//8//
Omithye kaaksharam brahma vyaaharan maamanusmaran/
Yah prayaathi thyajan deham sa yaathi paramaam gathim//13//8//
Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu...
Sri Krishna has told Arjuna about what one should do to achieve Moksha.Now,he is explaining the actual procedure involved in doing dhyaana or meditation.He is not leaving any stone unturned in explaining and giving even the minutest details to Arjuna.His intention is that Arjuna should not feel unfulfilled in gaining knowledge.Arjuna!Hey friend!I will explain to you in detail as to how one should do meditation.You have to take grip over your navadwaaraas ie nine outlets in our body.You should gain control over your senses.You should command your mind not to waver or wander. You should take your life or praana and keep it in Sahasraara chakram.Then,you have to start chanting pious OM continuously.Being in that state and with unwavering mind you have to let go your life and leave the body.That devotee only is eligible to attain Moksha and he would definitely achieve his goal.Those who do it without devotion and behave in a certain way when others are watching and behave entirely opposite when no one is observing them do not qualify for achieving this precious goal.
Thursday, 8 October 2026
యదక్షరం వేద…Yadaksharam veda
యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే॥11॥8॥
శ్రీమద్ భగవద్గీత..అక్షర పరబ్రహ్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మపధం,పరమపదము గురించి ఊరించి ఊరించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!వేదవేత్తలు అదే వేదవేదాంగాలు పుక్కిట పట్టిన వాళ్ళు సైతం నాశనం లేనిది అని చెప్పేది దీని గురించే!యతులకు కోరికలు ఉండవు కదా!వారిని నిష్కాములు అంటాము కదా!కానీ వారు కూడా ఈ పరమపథం కాంక్షిస్తూ ఉంటారు. దీని కోసమే కఠినమయిన బ్రహ్మచర్యాది వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు.ఆ దివ్యపదం,దివ్యపథం గురించి టూకీగా చెబుతాను.
Yadaksharam vedavido vadanthi
Visanthi yadyathayo veetharaagaah/
Yadichchhantho brahmacharyam charanthi
Thaththepadam sangrahena pravakshye//11//8//
Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu...
Sri Krishna is luring Arjuna regarding Paramapadam or Moksha.Arjuna!hey Bharathasreshta!do you know what great knowledgeable people tell about the immortal or undestroyable thing in this universe is?You know sages have no wishes or longings.But,even they crave for this Paramapadam.To achieve that,they indulge in strict brahmacharya and other procedures.I will tell about that Divyapadam to you.
Wednesday, 7 October 2026
కవిం పురాణ…Kavim puraana
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః।
సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్॥9॥8॥
ప్రయాణకాలే మనసాఽచలేన
భక్త్యాయుక్తో యోగబలేన చైవ
భృవోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుష ముపైతి దివ్యమ్॥10॥8॥
శ్రీమద్భగవద్గీత..।అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పరమాత్మను ఎలా పొందవచ్చో చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!పరమాత్మను ఎలా పొందవచ్చు,ఎవడు పొందగలడో చెబుతాను,విను.మామూలప్పుడే కాదు,అంత్యకాలంలో కూడా భగవన్నామ స్మరణను వదలి పెట్టుకూడదు.అప్పుడు కూడా యోగబలంతో ప్రాణవాయువును భ్రూమధ్యంలో నిలిపాలి.అలా నిలిపి...కవి,పురాణపురుషుడూ,జగన్నియామకుడూ,అణువు కంటే సూక్ష్మ రూపం కలవాడూ,అఖిల ప్రపంచానికీ ఆధారభూతుడూ,అజ్ఞానేతరుడూ అయిన ఆ పరమాత్మను భక్తిభావంతో ధ్యానించ గలగాలి.అప్పుడే ఆ పరంథాముడి ఆశీస్సులు అతనికి దక్కుతాయి.ఇది ఎప్పుడు సాథ్యం?మనం భావావేశాలకు లోనుకాకుండా స్థిత ప్రజ్ఞత చూపించగలిగినప్పుడే!లేకపోతే మామూలుగా మనం ఏమి చేస్తాము?భయపడతాము.బాథ పడతాము.అతలాకుతలం అవుతాము...ఎట్లా?ఇంకెట్లా?ఇప్పుడెట్లా?అనుకుంటూ.మానవుడు వాటన్నిటినీ వదిలేసికోగలగాలి.
Kavim puraana manusaasithaara manoraneeyaamsa manusmaredyah/
Sarvasya dhaathaara machinthyaroopa maadithya varnam thamasah parasthaath//9//8//
Prayaanakaale manasaaachalena
Bhakthyaa yuktho yogabalena chaiva/
Bhruvormadhye praanamaavesya samyak
Sa tham param purusha mupaithu divyam//10//8//
Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu...
Sri Krishna is explaining Arjuna as how to achieve Nirvaana.Arjuna!hey Kunthiputhra!not only in normal days,but also during the last moments of our life we should be able to pray God sincerely.You should meditate and concentrate in between your eye brows about Kavi(writer),Puraana purushudu(supreme cosmic soul),jaganniyaamakudu(lord of the universe),microscoic and tiniest,supreme supporter and banker of wisdom and knowledge.You should pray with devotion,commitment and surrender yourself to Him conpletely.Then you can achieve salvation ie Nirvaana.
Tuesday, 6 October 2026
అభ్యాస యోగ…Abhyaasa yoga
అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్॥8॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తనను ఎలా పొందవచ్చే కూడా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!పరమాత్మను ఎలా పొందవచ్చో...ఆ కిటుకు కూడా నేనే చెబుతాను.ఇతర విషయాలపైకి మనసు వెంపర్లాడకూడదు అంటే అభ్యాస యోగము చేతనే వీలవుతుంది.ముందర ఇంద్రియాలనూ,మనసును అదుపు ఆజ్ఞలలో పెట్టుకోవటం నేర్చుకోవాలి.అప్పుడు బాసింపట్లు వేసుకుని ఆ పరంథాముడు,పరాత్పరుడు,సర్వాతీతుడు అయిన పరమ పురుషుని ధ్యానం చేయాలి.అట్లా నిమగ్నమయి,నియమ నిష్ఠలతో భగవంతుడి ధ్యానంలో మునిగి తేలేవాడు మటుకే ఆ పరమ పురుషుని పొందుతాడు.
Abhyaasa yogayukthena chethasaa naanyagaaminaa/
Paramam purusham divyam yaathi paardhaanuchinthayan//8//8//
Sri madbhagavadgeetha..,Akshara parabrahma yogamu...
Sri Krishna is revealing the way out to Arjuna,as how to achieve God or attain salvation.Hey Pardha!really it is very difficult to gain control over materialistic cravings.It can only be achieved through strict discipline and meditation.Only after obtaining sdhithaprajnatha or wisdom only,devotee has to sit in lotus pose and meditate for Almighty.Unless you do this with strict procedures,intent and interest and sincerity and dedication,you can not achieve your goal of salvation and blessings of God.
Monday, 5 October 2026
తస్మాత్ సర్వేషు…Thasmaath sarveshu
తస్మా త్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ।
మయ్యర్పిత మనోబుద్ధి ర్మామేవైష్య స్యసంశయః॥7॥8॥
శ్రీమద్భగవద్గీత....అక్షర పరబ్రహ్మ యోగము..
శ్రీకృష్ణుడు అసలు విషయం బయట పెడుతున్నాడు అర్జునుడికి.అర్జునా!ఓ బావా!నేను చెప్పిందంతా విన్నావు కదా!ఏమర్థమయింది నీకు?నేనే ఆ భగవంతుడిని అని కదా!కాబట్టి నీవు నిత్యమూ నన్నే స్మరణ చేయి.అలా చేస్తూనే ఈ యుద్ధం కానివ్వు.నీ బుద్ధినీ,మనసునూ నా యందే నిలుపు.తప్పకుండా నన్నే పొందుతావు.ఇందులో అనుమానించాల్సినది ఇసుమంతైనా లేదు.సరేనా?
Thasmaa thsarveshu kaaleshu maamanusmara yudhya cha/
Mayyarpitha manobuddhi rmaamevaishya syasamsayah//7//8//
Sri madbhagavadgeetha....Akshara para brahma yogamu...
Sri Krishna is telling the final truth to Arjuna.Arjuna!hey brother!you have been hearing me all along.What did you understand?You realised that I am the ultimate,right!So,devote yourself entirely to Me.You do your job,ie participate in this war praying Me all the time.You have to concentrate your entire intelligence and soul on Me.Then,you will definitely reach Me.There is not even a spec of doubt in this matter.
Sunday, 4 October 2026
యం యం వాఽపి…Yam yam vaaapi
యం యం వాఽపి స్మరన్ భావం త్యజ త్యంతే కళేబరమ్।
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః॥6॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సులభంగా అర్థమయ్యే రీతిలో చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నీకు కూడా తెలుసు కదా!మన ప్రవర్తన అనుసరించే ఫలితం ఉంటుంది అని.మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది.అలానే చెడు చేస్తే మనకు చెడు జరుగుతుంది.అంతే కదా మరి!ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంటుంది.అర్జునా!అంత్య కాలము,అదే మనిషి చివరి క్షణాలలో ఏ భావంతో మరణిస్తాడో,వాడు ఆ భావానికి తగినట్లుగానే స్థితిని పొందుతాడు.ఉదాహరణకు చెప్పుకుందాము.పోయే సమయంలో కూడా మోహానికి,తామసానికి,క్రూరత్వానికీ బానిస అయినవాడు నేను స్వర్గానికే పోవాలి అని హఠం చేస్తే కుదురుతుందా?ఎవరు రానిస్తారు?అసలు ఏ అర్హత ఉందని రానిస్తారు?అదే భగవంతుని నామస్మరణలో మునిగి పోయి,ఆఖరి శ్వాస వదిలితే కైవల్యానికి చేరుకుంటాడు కానీ.
Yam yam vaaapi smaran bhaavam thyaja thyanthe kalebaram/
Tham thamevaithi kountheya sadaa thadbhaava bhaavuthaah//6//8//
Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu...
Sri Krishna is explaining Arjuna in simple manner.Arjuna!hey Kountheya!I hope I need not tell you again.You too know pretty well that one reaps what he sows.The way we behave determines the outcome.If one is good ,he will have good life.If we are bad our end will also be bad.Kountheya!I am telling you once and again.During the last phase of ones life,if one is devoted to God and prays Him,he would achieve appropriate afterlife or salvation.If one is unable to come out of ones greed,cruelty and lust even at the time of his last breath,how can he hope to have good afterlife?He would recieve results befitting his actions.There is no compromise in any way.
Saturday, 3 October 2026
అంత కాలే చ…Antha kaale cha
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరమ్।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః॥5॥8॥
శ్రీమద్భగవద్గీత....అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు ఎలా ఉంటే మానవుడు తనను పొందవచ్చో అని.అర్జునా!ఓ పాండవ మధ్యమా!భక్తుడు అనే వాడు ఎలా ఉండాలో చెబుతాను విను.మనసా,వాచా,కర్మణా నన్నే నమ్ముకోవాలి.పొద్దునా?మధ్యహ్నమా?రాత్రా?లేక పోతే సంవత్సరమా?పది ఏళ్ళా?అని కాదు.జీవితకాలం మొత్తమూ నా ధ్యాసలోనే ఉండాలి.ఆఖరుకి మరణ సమయంలో కూడా నన్నే ధ్యానిస్తూ ఊపిరి వదలాలి.అలాంటి వాడు మోక్షానికి యోగ్యుడు.అతనే నన్ను ఖచ్చితంగా పొందుతాడు.
Antha kaale cha maameva smaran mukthvaa kalebaram/
Yah prayaathu sa madbhaavam yaathi naasthyathra samsayah//5//8//
Sri madbhagavadgeetha ...Akshara parabrahma yogamu...
Sri Krishna is telling Arjuna as who is dear to Him and who can have access to Him.Arjuna!hey Paandava madhyamaa!A devotee should always think about Me in whatever state he is in.His thoughts should revolve around Me.His acts should be for Me.He should talk about Me only.It is not just for a day,a month,a year or a decade.He should give his entire life for Me.Even when he is taking his last breath,he should pray Me.Then definitely he can reach me and obtain Moksha or Salvation.
అధిభూతం క్షరో…Adhibhootham ksharo
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధి దైవతమ్।
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర॥4॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పర బ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తను వాడిన ప్రతి పదమూ వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఇప్పుడు నేను నీకు బ్రహ్మము,అధ్యాత్మం,కర్మము గురించి చెప్పాను కదా!ఇంక ఇప్పుడు అధిభూతము,అధిదైవతము,అధియజ్ఞుడు గురించి చెబుతాను.నాశనము అయ్యే పదార్థమును అధిభూతము అని అంటారు. పురుషుడు అంటే చైతన్యము.పురుషుడు అంటే ఆత్మ...శరీరం అనే పురములో ఉండే చైతన్యము లేక ఆత్మ కాబట్టి పురుషుడు అధిదైవతము.ఇంక అధియజ్ఞుడు గురించి మాట్లాడుకుందాము.యావత్ సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహములో అంతర్యమిగా ఉంటాను నేను.కాబట్టి నేనే ఆ అధియజ్ఞుడిని.
Adhibhootham ksharo bhaavah purushaschaadhi daivatham/
Adhiyajnoahamevaathra dehe dehabhruthaam vara//4//8//
Sri madbhagavadgeetha..Akshara parabrahma yogamu..
Sri Krishna is explaining the terms he was using to pacify Arjuna.Arjuna!hey Paardhaa!just now I told you about Brahmamu,Adhyaathmam and Karmamu.Now,I will explain to you about Adhibhootham,Adhidaivatham and Adhiyajnudu.Perishable things are named Adhibhootham.Purushudu means chaithanyamu and Aathma.Chaithanyamu means consciousness,awareness and intelligence.Athma means soul.So,Purushudu is Adhidaivatham.Another meaning is that soul lies in the puram or house of the body,hence named Purushudu.Arjuna!I am residing in every living being as Antharyaami.Antharyaami means indwelling supreme soul.So,I am Adhiyajnudu.
Thursday, 1 October 2026
అక్షరం బ్రహ్మ పరమం…Aksharam Brahma paramam
శ్రీ భగవానువాచ...
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మ ముచ్యతే।
భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః॥3॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము..
శ్రీ కృష్ణుడు అర్జునుడి భయాలు,అనుమానాలూ పోగొట్టేదానికి నడుము బిగించాడు.చిద్విలాసంగా,చిరునవ్వుతో సమాథానం చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను చెప్పేదాంట్లో అర్థం కానిదానికీ,భయపడేదానికీ ఏమీ లేదు.నీకు చిన్నగా వివరిస్తాను,విను.బ్రహ్మము అంటే భయపడేదానికి ఏమీ లేదు.నాశనము లేనిది,అన్నిటికంటే ఉత్కృష్టము అయినది అని అర్థము.అధ్యాత్మం అంటే ఏందో అని తల పట్టుకుని కూర్చున్నావా?ప్రకృతి సంబంధమయిన స్వభావాలనే అధ్యాత్మము అని అంటారు.సృష్టి మొదట్లో పంచభూతాలు ఏర్పడ్డాయి కదా!అలానే సమస్త జీవ సృష్టి కూడా జరిగింది కదా!ఈ భూతోత్పత్తికి అయిన ఘటనమే కర్మము అని అంటాము.అంతకంటే ఇంకేమీ లేదు.సరేనా?
Sri Bhagavaanuvaacha...
Aksharam brahmaparamam swabhaavoadhyaathma muchyathe/
Bhoothabhaavodbhavakaro visargah karma samjnithah//3//8//
Sri madbhagavadgeetha..Akshara parabrahma yogamu...
Sri Krishna listened to Arjunas confusion reagarding His teachings.With pleasant smile on his face,he started replying.Arjuna!hey Kireeti!there is nothing to be stressed out.You need neither be confused nor frightened about the particular words I am using.I am ready to explain them to you in a simpler fashion.Brahmamu is the One which is the best in all fashions and which can not be destroyed.Adhyaathmam means natural instincts and reactions intertwined in human relations.You know the creation of five elements...air,water,sky,fire and earth.And there is this progeny or creation of entire living beings.This is called Bhoothothpaththi.This is called as Karmamu.
Wednesday, 30 September 2026
కిం తద్బ్రహ్మ…Kim thadbrahma
అర్జున ఉవాచ...
కిం తద్బ్రహ్మ కి మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ।
అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే॥1॥8॥
అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్ మధుసూదన।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః॥2॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
అర్జునుడికి తల గిర్రున తిరిగిపోతుంది.ఎందుకంటారా?ఎందుకేమిటి?ఎరక్క క్రిష్ణుడిని సలహా అడిహాడు.తత్తర బిత్తరగా ఉంది.ఏమి చేయమంటావు,అని.అడిగిన పాపానికి శ్రీకృష్ణుడు నీ అనుమానాలు అన్నీ తీరుస్తానని చెప్పి,కొత్త కొత్త అనుమానాలూ,భయాలూ,శంసలూ,శంకలూ తీసుకొస్తున్నాడు.ఇంక ఇది అయ్యే విషయం కాదని అర్జునుడు ధైర్యం చేసుకుని అడుగుతున్నాడు.క్రిష్ణా!హే పురుషోత్తమా!హే మధుసూదనా!క్రొత్త క్రొత్త పదాలు అన్నీ వాడేస్తున్నావు.ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు!ఈ బ్రహ్మము ఏంది?అధ్యాత్మము అంటే ఏంది?ఈ కర్మలు,అధిభూతము...వీటి సంగతి ఏంటి?అధి దైవము ఏంది?ఈ దేహంలో అధియజ్ఞుడు ఉన్నాడంటావు?వాడు ఎవడు?ఎక్కడి నుంచి వచ్చాడు?మనలో ఎందుకు ఉంటాడు?అసలు మనలో ఏ విధంగా ఉంటాడు?మరణ సమయంలో యోగులు నిన్ను తెలుసుకుంటున్నారు అని చెప్పావుగా!ఎలా?
Arjuna uvaacha...
Kim thadbrahma ki madhyaathmam kim karma purushoththama/
Adhibhootham cha kim proktha madhidaivam kimuchyathe//1//8//
Adhiyajnah kadham koathra deheasmin madhusoodana/
Prayaana kaale cha kadham jneyoasi niyathaathmabhih//2//8//
Srimadbhagavadgeetha...Akahara parabrahma yogamu..
Arjuna is utterly confused.He came to Sri Krishna to help him come out of the confused state of mind he was going through.But what did Sri Krishna do?He confused him still more using so many new words,procedures and exhaustive explanations.Arjuna wants to come out of this confusion.So,he took a long breath and started asking questions.
Krishna!hey Purushoththama!hey Madhusoodana!I am unable to follow you.You are telling about so many new things,of which I do not have any prior knowledge.I want you to explain to me everything in detail.For example,what is Brahmam?What is Adhyaathmam?You started talking about Karma,Adhibhoitham Adhidaivam.What about them?You are saying that Adhiyajnudu is within us.Who is he?Why is he within us?What does he do there?You also said that yogi realises and acknowledges your presence at the time of his death?How?I am unable to understand all these.Please,explain.
Tuesday, 29 September 2026
సాధిభూతాధి దైవం…Saadhibhoothaadhi daivam
సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః।
ప్రయాణకాలే పి చ మాం తే విదు ర్యుక్త చేతసః॥30॥7॥
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే విజ్ఞాన యోగో నామ సప్తమోఽధ్యాయః...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అధ్యాయం చివరలో మూడు ముక్కలతో ముక్తాయింపు చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!ఇదంతా ఎందుకు?ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పేస్తాను.నేను అధిభూత,అధిదైవ,అధియజ్ఞములతో కూడిన వాడిని కదా!ఇలా క్షుణ్ణంగా ఎవరు తెలుసుకుంటారో,వాళ్ళు మాత్రమే మరణకాలంలో కూడా మరచిపోకుండా నన్ను గుర్తిస్తారు.
కంటికి కనిపించే భౌతిక సృష్టి మొత్తమూ,ఆ సృష్టి వనుక ఉండే దైవికమయిన శక్తి,సృష్టిలోని ప్రతి జీవకోటి హృదయాంతరాళలో నిమిడి ఉన్న అంతర్యామినీ నేనే!
Saadhi bhoothaadhidaivam maam saadhiyajnam cha ye viduh/
Prayaanakaale pi cha maam the viduryuktha chethasah//30//7//
Om thathsadithi Sree madbhagavadgeethaasu Upanishathsu brahma vidyaayaam yoga saasthre Sree Krishnaarjuna samvaade vijnaanayogonaama sapthamoadhyaayah...
Sri krishna is telling Arjuna the gist of this entire chapter in three words.Arjuna!hey brother!I am comprising of Adhibhootha,Adhidaiva and Adhiyajna.A devotee who learns this fact,definitely would not forget about Me even in his last stage of life,ie death.I will explain to you.Entire physical world you see is nothing but Me.I am the One behind creation of this world.Do you know that I reside in each and every living being on the face of this earth as Antharathma or Conciousness or Antharyaami?Jnaani realises this.
Monday, 28 September 2026
జరామరణ మోక్షాయ…..Jaraamarana mokshaaya
జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలమ్॥29॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పరబ్రహ్మను తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?ఎలా ఉండాలి?చెబుతున్నాడు.అర్జునా!ఓ పాండుపుత్రా!కర్మ తత్త్వాన్నీ,పరబ్రహ్మనీ తెలుసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు.ఎందుకంటావా?చెబుతాను,విను.మనిషిని భయపెట్టేవి,బాథ పెట్టేవి రెండే రెండు.అవే ముసలితనము,మరణము.వాటినే జరామరణములు అని అంటారు.ఎవడైతే ఆ జరామరణాల నుంచి ముక్తికి నా శరణు జొచ్చి,నా ఆశ్రయం పొంది,సాధన చేస్తాడో...వాడు మట్టుకే కర్మతత్త్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.ఇంకొంచెం ముందరికి పోయి పరబ్రహ్మనూ తెలుసుకోగలతాడు.
Jaraamarana mokshaaya maa maasrithya yathanthi ye/
The brahma thadviduh kruthsna madhyaathmam karmachaakhilam//29//7//
Sri madbhagavadgeetha..Vijnaana yogamu...
Sri Krishna is telling Arjuna about who can understand karma thaththva and realise the presence of Almighty.Karma thaththva is nothing but the truth and action which leads to cause and effect.Simply said,you reap what you sow.If you do good you get the best in the end and if you are bad you get the worst.There is no conpromise anywhere.
Arjuna!hey Paanduputhra!two things that man is afraid of are old age and death.Person,who seeks my help to come out of those and does methodical practice of self discipline and ego transcending...would be relieved of those fears.If he is successful in reaching these goals,he would definitely understand and realise the presence of Almighty.
Sunday, 27 September 2026
యేషాం త్వంతగతం….Yeshaam thvanthagatham
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం।
తే ద్వంద్వ మోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః॥28॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు ఎవరు తనను సేవించగలుగుతున్నారు అని.అర్జునా!ఓ పార్థా!నన్ను సేవించే
అవకాశం కొందరికే దక్కుతుంది.వారు పాపరహితులు అయి ఉండాలి.అదే పాపాలు చేయకూడదు.సుఖదుఃఖాలు,వాటి వల్ల వచ్చే మోహాలూ,తాపాలూ,తపనలకు దూరంగా ఉండగలగాలి.అలాంటి పుణ్యాత్ములు మటుకే నన్ను సేవించగలతారు.
Yeshaam thvantha gatham paapam janaanaam punyakarmanaam/
The dvandva mohanirmukthaah bhajanthe maam drudavrathaah/28//7//
Sri madbhagavadgeetha...Vijnaana yogamu..
Sri Krishna is telling Arjuna regarding who has the chance to pray Him and serve Him.Arjuna!hey Paardha!I told you that only certain section of people have the chance to serve me and be devoted to Me.Those people should not do bad acts,be bad natured.Happiness and sorrow are two main factors which distract a man from thinking calmly about Me.Because of these only,man is goaded to get emotional and goes in search of worldly pleasures.The good natured people who avoid all these worldly distractions and concentrate on Me will achieve Me.
ఇచ్ఛాద్వేష సముత్థేన…Ichchaadvesha samuthdhena
ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత।
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప॥27॥7॥
శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి బలహీనతల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ పరంతప!మనము మానవులను తప్పు పట్టేదానికి లేదు కూడా!ఎందుకంటావా?అతను పుట్టుకతో వచ్చి చేరే రాగ ద్వేషాలకు కట్టుబడి పోయి ఉంటాడు.వాటి ద్వారా కలిగే సుఖదుఃఖాల ఆటుపోట్లకు సతమతమవుతుంటాడు.ఆ మోహజాలంలో పడి జీవిస్తూ ఉంటాడు.ఆ సంకెళ్ళనుంచి బయటపడడం అంత సులువు కాదు.
Ichchaa dvesha samuthdhena dvandva mohena bhaaratha/
Sarvabhoothaani sammoham sarge yaanthi paranthapa//27//7//
Sri madbhagavadgeetha...Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna regarding futile nature of common man in reaching up to him.Arjuna!Bharathasreshta!O Paranthapa!humans in general are born with emotions of love and hate by birth.They cannot come out of it.They are being churned with happiness and sorrow caused due to these emotions.They are always attracted towards these bondings,emotions and survival.So,they fail to look beyond their turbulant lives and reach up to Me.
Saturday, 26 September 2026
వేదాహం సమతీతాని…Vedaaham samatheethaani
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన॥26॥7॥
శ్రీమద్ భగవద్గీత..।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!సగటు మనిషి నన్ను తెలుసుకోలేడు అని చెప్పాను కదా!జ్ఞాని కూడా కొంత మటుకు నన్ను అర్థం చేసుకునే ప్రక్రియలో విజయం సాథిస్తాడు.అలా ఎందుకు అంటావా?నేను భూత,భవిష్యత్ వర్తమాన కాలాలలోని సర్వ జీవులను ఎరిగి ఉంటాను.కానీ నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు.అసలు చాలా మంది నా ఉనికినే గుర్తించలేని దీనమయిన స్థితిలో ఉంటారు.
Vedaaham samatheethaani varthamaanaani chaarjuna/
Bhavishyaani cha bhoothaani maam thu veda na kaschana//26//7//
Sri madbhagavadgeetha..,Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna like this.Arjuna!hey Kireeti!I told you that common man is unable to perceive my presence.Even the intellect can understand only to a cetain extent.The reason behind is simple.I know about each and every living being on the face of the earth in the past,present and future too.But no one can know about me so exhaustively.Most of the time,they fail to feel and understand my presence too.
Friday, 25 September 2026
నాహం ప్రకాశ….Naaham prakaasa
నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః।
మూఢోఽయం నాభిజానాతి లోకో మా మజ మవ్యయమ్॥25॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియ పరుస్తున్నాడు తనను మామూలు మనుష్యులు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు అనే విషయాన్ని.అర్జునా!ఓ బావా!నేను యోగమాయతో కూడిన వాడిని.నాకు చావు పుట్టుకలు లేవు.అరిషడ్వర్గాలకు అతీతుడిని.నేను శాశ్వతుడను.ఇవి,ఇలాంటివి మామూలు వాళ్ళ మేథస్సుకు అందని విషయాలు.వాళ్ళు భౌతిక ప్రపంచానికి,విషయాలకే ప్రాథాన్యం ఇస్తారు.అవే అర్థం అవుతాయి.కాబట్టి అజ్ఞానులు నన్ను తెలుసుకోలేరు.
Naaham prakaasa ssarvasya yogamaayaa samaavruthah/
Moodoam naabhijaanaathi loko maa maja mavyayam//25//7//
Sri madbhagavad geetha...Vijnaana yogamu...
Sri Krishna is telling Arjuna as to why common man is unable to understand Him.Arjuna!hey brother!Ajnaani,the ignorant fails to understand me.The main reason behind it is this.I am covered by yogamaaya.I am above birth and death.I am permanent.I am eternal.All these facts and factors are above the imagination of common man.Because he is busy solving his material problems his entire life.He has neither the interest nor the time to think of things or know about Me.
Thursday, 24 September 2026
అవ్యక్తం వ్యక్తి…Avyaktham vyakthi
అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః।
పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్॥24॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మామూలు మనుష్యులు ఎలా ఆలోచిస్తారో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నన్ను జ్ఞానులు తెలుసుకున్నట్లు మామూలు ప్రజానీకం తెలుసుకోలేదు.దీనికి బలమైన కారణం ఉంది.అది ఏంది అంటావా?నేను అవ్యక్తుడను.నేను నిర్వికారుడను,ఉత్కృష్టుడను,సర్వాతీతుడను.ఇలాంటి నా స్వరూపాన్ని అజ్ఞానులు గుర్తించలేకపోతున్నారు.నన్ను ఒక వ్యక్తిగానే పరిగణిస్తున్నారు.
Avyaktham vyakthi maapannam manyanthe maa mabuddhayah/
Param bhaava majaanantho mamaavyaya manuththamam//24//7//
Sri madnhagavadgeetha ...Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna as to why common man is unable to understand him and find him.Arjuna!hey Kireeti!I told you that only the enlightened persons can reach to me and find me.Main reason behind common mana futility in recognising and reaching out to me is this.I am immortal.I am sublime and super.I am omniscient,eternal,omnipotent and omnipresent.Common man looks up to me as another individual.He fails to see me in totality and understand me.
Wednesday, 23 September 2026
అంతవత్తు ఫలం…Anthavaththu phalam
అంతవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్పమేధసామ్।
దేవాన్ దేవ యజో యాంతి మద్భక్తా యాంతి మామపి॥23॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రాప్తం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ సఖా!పిండి కొద్దీ రొట్టె అని అంటారు కదా పెద్దలు.ఇక్కడ కూడా అలానే.స్వల్ప జ్ఞానులు అయిన వాళ్ళు దేవతారాధనకు వాళ్ళ కోరికలను బట్టి ఆయా దేవతలను పూజిస్తారు.కాబట్టి వారికి ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది.అలాగే జ్ఞానులు,జిజ్ఞాసాపరులు నన్ను పూజిస్తారు.వారు నన్ను పొందుతారు.అంతే కదా!
Anthavaththu phalam theshaam thadbhava thyalpamedhasaam/
Devaan deva yajo yaanthi madbhakthaa yaamthi maamapu//23//7//
Sri madbhagavadgeetha....Vijnaana yogamu..
Sri Krishna is telling Arjuna about fate.Arjuna!hey friend!you know that one reaps what he sows.In a way it is like getting what you pay for.Common man,with limited knowledge,seeks the blessings and help from deities,as per his wants or wishes.So,they get those deities blessings.One,who seeks me and learns about me will definitely procure my blessings and my support.
Tuesday, 22 September 2026
స తయా శ్రద్ధయా…Sa thayaa sradhdhayaa
స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే।
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తామ్॥22/7//
శ్రీమద్ భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి తానే కర్త కర్మ క్రియ అనే విషయం ఇంకొక్క సారి చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను నీకు ముందుగానే చెప్పాను కదా నేనే మూల పురుషుడిని అని.అణువణువులోన నేనే ఉంటాను.ప్రతి క్రియ ముందూ వెనకా కూడా నేనే ఉంటాను.దానికి ఇది కూడా ఒక ఉదాహరణే!మామూలు ప్రజలు ఏమనుకుంటారు?మనము ఫలానా దేవుడు లేక దేవతలను పూజిస్తున్నాము.వాళ్ళు మన పూజలకు తృప్తి పడి మన కోరికలు తీరుస్తున్నారు అనే కదా!కానీ నిజానికి ఆ మానవులలో కోరికలు కలిగించేదీ నేనే! ఆయా దేవతల రూపములో నెరవేర్చేది కూడా నేనే.
Sa thayaa sraddhayaa yuktha sthasyaaraadhana meehathe/
Labhathe cha thathah kaamaan mayaiva vihithaan hi thaam//22//7//
Sri madbhagavadgeetha...Vijnaana yogamu...
Sri Krishna is telling once and again to Arjuna that he is centre point for everything that happens in this world.Arjuna!hey friend!what does a common man generally think?He thinks that he is praying particular deity for fulfilling his wants or desires.Concerned deity is pleased and sanctioning boons to him or her.Reality is different.I am the One who instills the desires or wishes in people.I am the One who fulfills their wishes.So,be reminded and remember that I am the central point for every act and its result.
Monday, 21 September 2026
యో యో యాం యాం…Yo yo yaam yaam
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయాఽర్చితు మిచ్ఛతి।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధా మ్యహమ్॥21॥7॥
శ్రీమద్ భగవద్గీత....విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!సగటు మానవుడు తన కోరికలు ఎలా తీరుతాయో అని మదనపడుతుంటాడు.ఆ కోర్కెలు తొందరగా తీరాలనే తపనతో ఆయా దేవతలను పూజిస్తుంటాడు.నేను కూడా అతను ఏ దేవతను ఆరాధించాలనుకుంటే,ఆ దేవత యందే తనకు శ్రద్ధా,విశ్వాసము కలిగేలా చేస్తాను.
Yo yo yaam yaam thanum bhakthah sradhdhayaaarchithu michchathi/
Thasya thasyaachalaam sradhdhaam thaameva vidadhaa myaham//21//7//
Sri madbhagavadgeetha...Vijnaana yogamu....
Sri Krishna is telling Arjuna like this.Arjuna!hey Kireeti!I told you just now that common man is interested in fulfilling his material desires.In persuasion of his wishes,wants and desires he prays concerned deities.I personally see that he has faith and dedication towards that particular deity.
కామైస్తై స్తైః……Kaamesthai sthaih
కామేస్తై స్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్స్వయా॥29॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి ఎలా దేన్ని నమ్ముతాడు,దేన్ని పూజిస్తాడో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!జ్ఞాని నేను ఎవరు,ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని,నా శరణు జొచ్చుతాడు.కానీ మామూలు మనిషి ఆలోచనా విథానము,అతని పరిమితులు ఇలా ఉంటాయి.చెద పురుగులు చేవగల చెక్కని ఏమి చేస్తాయి,చెప్పు?ఎలాంటి కనికరమూ,మొహమాటం లేకుండా తెల్లవారేటప్పటికి పిండి,పిండి చేసేస్తాయి కదా!అట్లాగే కోరికలు అనేవి చెద పురుగులు లాగ.అవి మనిషి మస్తిష్కాన్ని నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టి,గుల్ల చేస్తాయి.అమాయకపు మానవుడు చేసేదానికి ఇంక ఏమి మిగిలి ఉంది?అతని కామనలు,వాంఛలు,కోరికలు ఏ దారిలో ఉంటాయో ఆ దారిలోనే అనేక నియమాలను పాటిస్తూ,పయనం సాగిస్తాడు.ఆ కోరికలు త్వరత్వరగా తీర్చుకోవాలి అనే తపనలో చిన్న చిన్న ఇతర దేవతలను ఉపాసిస్తుంటాడు.
Kaamesthai sthairhrutha jnaanaah prapadyanthe anya devathaah/
Tham tham niyamamaasdhaaya prakruthyaa niyathaa ssvayaa//20//7//
Sri madbhagavad geetha...Vijnaana yogamu....
Sri Krishna is telling Arjuna as how a common man thinks and acts.Arjuna!hey Pardha!just now I told you that Jnaani seeks my blessings.He learns about me fully and decides to serve me and pray.But that is not the case with common man.What do termites do to the strong wood?They make it into useless powder in no time.Desires of common man are termites.They atack your commin sense,propriety and all the good nature you have.Your thought process and your acts thereby become selfish and narrow minded.In their hunger and thirst to fulfill their desires they act as per their wishes without any reason or rhyme.They follow many procedures and seek the help of many other deities to get what they want.
Sunday, 20 September 2026
బహూనాం జన్మ….Bahoonaam janma
బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే।
వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః॥19॥7॥
శ్రీమద్భగవద్గీత.।।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదంతా అంత సులభం కాదు అని చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!జ్ఞాని అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా!అతడు ఆ స్థితికి చేరేదానికి రోజులు,నెలలు,సంవత్సరాలు కాదు...ఏకంగా చాలా జన్మలు ఎత్తాల్సి ఉంటుంది.పండు పక్వానికి వస్తేనే కదా తినాలనిపించేది.అలానే భక్తుడు తన ఆరాథనలో తడిసి ముద్దయి పోవాలి.తన అస్థిత్వాన్నే మరిచి పోయి భగవంతుడే తను,తనే భగవంతుడు అన్నట్లు లీనము,విలీనము అయిపోవాలి.అప్పుడు నా కరుణా కటాక్షాలు తనకు దక్కుతాయి.అతడు వాసు దేవుడే సమస్తమూ అని గ్రహించాలి.అలా తెలుసుకుంటేనే,సతతం నా ధ్యాసలో ఉంటూ నన్నే సేవిస్తూ ఉంటాడు.కానీ అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు.
Bahoonaam janma naamanthe jnaanavaan maam prapadyathe/
Vaasudeva ssarvamithi sa mahaathmaa sudurlabhah//19//7//
Sree madbhagavadgeetha.,VIjnaana yogamu...
Sri Krishna is telling Arjuna how difficult it is to find a jnaani.Arjuna!hey friend!I told you that I like jnaani,the most.The reason is very simple.A devotee takes not just days,months,years but many births to reach that position.You see,we feel like eating only when the fruit is ripe,not when it is raw.Similarly,I like the devotee who is totally immersed in love and devotion towards me.He should learn that I am the Ultimate,everything.Only when he learns that Vaasudeva is all pervading entity,he would believe me.He would totally be my devotee.But,such full fledged devotees are rare to be found.
Saturday, 19 September 2026
ఉదారా స్సర్వ…..udaaraa ssarva
ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవమే మతమ్।
ఆస్థిత స్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్॥18॥9॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి అందరిలోకి జ్ఞాని ఎందుకు ఉత్తముడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీకు అర్థం కావడం లేదు కదా అందరిలోకి నాకు జ్ఞాని అంటే ఎందుకు అంత ఎక్కువ ఇష్టం అని?నిజానికి నేను పైన ఉదహరించిన నాలుగు రకాల మనుష్యులూ మంచి వాళ్ళే.ఉత్తములే.కాదనను.కానీ,జ్ఞాని మాత్రమూ నా ఆత్మ స్వరూపుడు.అన్ని రకాలా,అంటే మనసా వాచా కర్మణా,నన్నే పరాంగతిగా ఎన్నుకున్నాడు.నన్నే ఆశ్రయించాడు.నేను తప్ప తనకు ఇంకెవరూ అఖ్ఖరలేదు.
Vudaaraa ssarva yevaithe jnaanee thvaathmaiva me matham/
Aasdhitha ssa hi yukthaathmaa maamevaanuththamaam gathim//18॥7॥
Sree madbhagavadgeetha....Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna the reason behind special bonding towards jnaani.Arjuna!hey Kireeti!I told you about four types of people who come to me for help and have faith in me.But amongst them all,I lean towards jnaani,wiseman,more.To tell you the truth all the four types are great people.They are my devotees.They pray and have faith in me.But jnaani is my incarnation.For him I am the ultimate goal.He thinks of me all the time,he serves me all the time and talks about me all the time.There is nothing besides Me in his life.
Friday, 18 September 2026
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః——-theshaam jnaanee nithya yukthah
తేషాం జ్ఞానీ నిత్య యుక్తః ఏక భక్తిర్విశిష్యతే।
ప్రియో హి జ్ఞానినో త్యర్థ మహం స చ మమ ప్రియః॥17॥7॥
శ్రీ మద్భగవద్ గీత...విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి తనకు ఎవరు ఎక్కువ ఇష్టమో చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను ఇప్పుడు చెప్పాను కదా నాలుగు రకాల మనుష్యులు నన్ను సేవిస్తారు అని.వాళ్ళు ఆపదలో ఉన్నవారు,జిజ్ఞాసువు,సంపదలు కోరేవాడు మరియు జ్ఞానీ అని తెలుసుకున్నాము కదా!వీళ్ళల్లో నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది నీకు?నేనే చెబుతాను,విను.వీళ్ళందరిలోకి జ్ఞాని నాకు ఎక్కువ ఇష్టము.ఎందుకంటావా?ఎందుకంటే జ్ఞాని అనేవాడు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు.ఎల్లప్పుడూ నాయందే మనసు నిలుపుకుని ఉంటాడు.ధ్యాన యోగముతో నన్ను సేవిస్తాడు.అందరిలోకి అతనే శ్రేష్టుడు.అతను నన్ను ప్రేమిస్తాడు,నాకు అతడు మిక్కిలి ఇష్టుడు.
Theshaam jnaanee nithyayukthah yeka bhakthirvisishyathe/
Priyo hi jnaanino thyardha maham sa cha mama priyah//17///7//
Sri madbhavadgeetha ....Vijnaana yogamu...
Sri Krishna is explaining Arjuna whom he loves among his devotees.Hey Arjuna!hey brother!I told you just now as to who love me.Amongst all my devotees I feel a special bonding and affection towards the wise and knowledgeable person.The reason behind it is simple.Jnaani knows about me fully well.He concentrates on me and thinks about me all the time.He prays and serves me through dhyaanayoga.He is the best,efficient and the most eligible devotee of mine.I too reciprocate his love and affection in the most appropriate manner.
Wednesday, 16 September 2026
చతుర్విధా భజంతే ॥॥॥chathurvidhaa bhajanthe
చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున।
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియపరుస్తున్నాడు.ఏమని?ఎవరెవరు తనను సేవిస్తారు అని.అర్జునా!భరతర్షభ!నన్ను నాలుగు రకాల మనుష్యులు సేవిస్తారు.వాళ్ళు ఎవరో వివరిస్తాను.ఆపదలలో చిక్కుకున్నవాడు అమ్మా!అని అరుస్తాడు.భగవంతుడే తనకు తల్లి,తండ్రి,గురువు,దైవము అని నమ్ముతాడు.ఏదో ఒక రూపంలో చేయూతను ఇస్తానని ఆశిస్తాడు.జ్ఞాని నన్ను సేవిస్తాడు.ఎందుకంటే తన జ్ఞాన నేత్రముతో నన్ను గుర్తిస్తాడు.నేను సర్వాంతర్యామిని,సర్వ వ్యాపకుడను అని తెలుసుకుంటాడు.కావున నాశరణు జొచ్చుతాడు.ఇక పోతే సంపదలు కోరుకునే వాడు నన్ను సేవిస్తాడు.తిట్టినా,పెట్టినా నేనే అనే విషయం వాడికి బాగా క్షుణ్ణంగా తెలుసు.జిజ్ఞాసువు జ్ఞాన పిపాసి.జ్ఞానం పూర్తిగా తెలుసుకోవాలనే అన్వేషణలో నిత్యం ఉంటాడు.జ్ఞాన సముపార్జన కోసం నన్ను సేవిస్తాడు./////
Chathurvidhaa bhajanthe maam janaa ssukruthinoarjuna/
Aartho jijnaasu rardhaardhee jnaanee cha bharatharshabha//16//7//
Sreemadbhagavadgeetha...vijnaana yogamu...
Sree Krishna is telling Arjuna what types of people worship him and want to be protected by Him.Arjuna!hey Bharatharshabha!people who are facing hardships in their lives come to me seeking help.Persons who are in search of knowledge that is profound seek my blessings.peole who want riches and wealth pray to me for fulfilment of their desires.An intelect and knowledgeable person knows and understands that I am the Supreme force behind everything.So,I am always in his prayers.These four categeries of people seek my blessings and proctection.
న మాం దుష్కృతినో మూఢాః///Na maam dushkruthino moodaah
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః।
మాయ యాఽపహృతా జ్ఞానాః ఆసురం భావ మాశ్రితాః॥15॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.ఏమని?ఎవరు పడితే వాళ్ళు తనను ఆశ్రయించలేరని.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇప్పుడే చెప్పాను కదా నన్ను శరణు జొచ్చిన వాళ్ళు మాత్రమే ఈ భవసాగరాన్ని ఈదగలుగుతారు అని.దీనికి ఇంకో మెళకువ కూడా ఉంది.ఎవరు పడితే వారు నన్ను ఆశ్రయించలేరు.వారు ఎవరో చెబుతాను,విను.రాక్షస ప్రవృత్తి,రాక్షస భావజాలము ఉండే వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉండవు.నిజంగా మేథావులు కారు,కానీ ఆ అపోహలో బతుకుతుంటారు ఒక వర్గం వాళ్ళు.వారికి నేనెప్పుడూ దక్కను.ఈ కోవలోకే ఇంకా చాలా మంది వస్తారు.దుష్కృతులు,అంటే తప్పు పనులు చేసేవాళ్ళు.వారి వలన మంచివారు మొత్తమూ బాధలు పడుతుంటారు.మూర్ఖులు ఇంకో తెగ.వీరికి విచక్షణా జ్ఞానము శూన్యము.వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించే రకము.మరి ఇంకో వర్గము నీచులు.వీరు వారు అనుకున్నది సాథించేదానికి ఎంతటి నీచానికైనా ఒడి కడతారు.వారికి ఎలాంటి విలువలు,మంచి చెడు విశ్లేషణ ఉండదు.అర్జునా!పైన పేర్కొన్నవారు ఎవరూ నా దరిదాపుల్లోకి కూడా రాలేరు.నా ఆశ్రయం కోరడమూ,దక్కించుకోవడమూ కల్లే వారికి.
॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥
Na maam dushkruthino moodaah prapadyanthe naraadhamaah/
Maaya yaaapahrutha jnaanaah aasuran bhaava maasrithaah//15//7//
Sree madbhagavadgeetha...Vijnaana yogamu...
Sri Krishna is telling Arjuna like this.Arjuna!hey Kireeti!I told you just now that those who come under my shelter alone can cross the turbulant sea of materialism.But there are ifs and buts to this prospect.Certain types of people can not come to me for shelter or help.I will explain to you about them.Those with cruel and demonish behaviour and thought process are not allowed to come near me.Similarly,there is another section who falsely think they know everything,but in reality they know nothing.There are people who indulge in bad deeds and cause hardships to the good natured people.There is another section who are fools.They do not have the distinction between good and bad.They go to any length to achieve what they want.Then there is another section who have no morals.They do not have any respect towards others or have any self respect.They can stoop down to lowest levels to have their say.
Arjuna!I abhor them and I do not allow them to come nearby.They can never come to me, seek my blessings,shelter or help.
Tuesday, 15 September 2026
దైవీ హ్యేషా గుణమయీ//daivee hyesha gunamayee
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా।
మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే॥14॥7॥
శ్రీమద్భగవద్గీత ....విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతూ,కొన్ని నిష్టుర సత్యాలు కూడా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను సృష్టించిన ఈ మాయ దివ్యమయినది,త్రిగుణాన్వితమూ అయినది.ఈ మాయ దాటడం చిన్న పిల్లల ఆట కాదు.చాలా కష్టమయిన మార్గము అనుసరించాలి.అంత సులభంగా దాటలేరు మానవులు.నన్ను నమ్మి,నా శరణు జొచ్చిన వారు మాత్రమే ఈ మాయను దాటి,తరించగలుగుతారు.
////:///
Daivee hyeshaa gunamayee mama maayaa durathyayaa/
Maameva ye prapadyanthe maayaamethaam tharanthi the//14//7//
Sree madbhagavadgeetha....vijnaana yogamu...
Lord Sree Krishna is telling Arjuna about himself.Hey Arjuna!hey Pardha!I am the One who created Maya.Maya is celestial and is composed of three traits.It is never easy to cross these emotions and get over them.To say the least,it is practically impossible.But,there is always a solution to each and every problem.Is it not?Those who have belief in me and who come to me with trust and prayers can definitely cross this churning and turbulant ocean of misery and hardships.
Monday, 14 September 2026
త్రిభి ర్గుణమయై ర్భావైః
త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్సర్వ మిదం జగత్।
మోహితం నాభి జానాతి మామేభ్యః పర మవ్యయమ్॥13॥7॥
శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు వ్యవహారం చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!త్రిగుణాలు ఉన్నాయి అని చెప్పాను కదా!అవి నా సృజనే అని కూడా చెప్పాను కదా!ప్రపంచం మొత్తమూ ఈ సత్త్వరజస్తమో గుణాల భావాలతో సమ్మోహనము కాబడుతుంది.దాని పర్యవసానం ఎలా ఉంటుంది?ఏమి ఉంటుంది చెప్పు?అంతా గలబా గలబా!గందరగోళం!అంతే కదా!ఈ పరిస్థితులలో సర్వాతీతుడను,శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోవడమే గగనమవుతున్నది.అందరూ దిక్కులు చూస్తున్నారు.ఏ దిక్కు మొక్కాలో తెలియక!
Sunday, 13 September 2026
యే చైవ సాత్త్వికా భావా
యే చైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చయే।
మత్త ఏ వేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి॥12॥7॥
శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను లేనిదే ఈ విశ్వం లేదు అని చెబుతున్నాడు.ఈ విశాల విశ్వంలోని ప్రతి అణువు తనదే,తన యందే ఉంది.ప్రతి చిన్న శ్వాస కానీ,అనుభూతి,భావ పరంపర కూడా అతని సృజనే అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!మనకు తెలుసు కదా గుణాలు ఎన్ని రకాలు అని.అవే సత్త్వ గుణము,రజో గుణము,తమో గుణములు.వాటి వాటి సంబంధించిన భావావేశాలు అన్నీ కూడా నా కల్పనే!అవన్నీ కూడా మానవుడిలో నా వల్లనే కలుగుతాయి.ఆ త్రిగుణాలు నా చెప్పు చేతల్లో ఉంటాయి,సర్వదా.కానీ నేను వాటన్నిటికీ అతీతమై ఉన్నాను.కాబట్టి వాటికి నేను కట్టుబడను,వాటి చేత చిక్కను.
Saturday, 12 September 2026
బలం బలవాతాం చాహం
బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్।
ధర్మా విరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ॥11॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తన్ను ఇంకొన్ని విథాలుగా ప్రస్ఫుటమవుతాడో చెబుతున్నాడు.అర్జునుడిని సంబోథించడంలో కూడా అర్జునుడిపైన తనకున్న మక్కువ,అర్జునుడి గురించి తను ఏమనుకుంటున్నాడో తెలియకనే తెలుస్తుంది.భరత అంటే భరత వంశము.ఋషభ అంటే ఎద్దు.అది శక్తికి,గొప్పతనానికీ ప్రతీక.శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడు భరతవంశంలో ఋషభం లాగ శ్రేష్టుడు,గొప్పవాడు అని పొగుడుతున్నాడు.అర్జునా!ఓ భరతర్షభ!బలవంతులలో ఉండే కామరాగాలు లేని బలాన్ని నేను.ఈ సమస్త సృష్టిలో ఉండే ప్రతి జీవి లోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.అనుభూతి పరంగా నేనే ఉంటాను,అవ్యయ పరంగా నేనే ఉన్నాను.అంటే గర్వము,అహంకారము లేకుండా ధర్మబద్ధమయిన శక్తి సామర్ధ్యాలకు ప్రతీక నేను.అలాగే సృష్టి కార్యంగా భావించి,పవిత్రంగా ఆచరించే కామాన్ని నేను.
Friday, 11 September 2026
బీజం మాం సర్వభూతానాం
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్।
బుద్ధి ర్బుద్ధి మతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్॥10॥7॥
శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్ని ఉదాహరణలు సహేతుకంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను ఇప్పుడే చెప్పాను కదా అగ్నిలోని తేజస్సు నేనే,తాపసులలోని తపస్సు నేనే,ప్రాణులలోని ప్రాణం నేనే ఇని.ఇవే కాకుండా అన్ని ప్రాణులూ ఈ భూమి మీద బతికి బట్ట కట్టేదానికి కావలసిన మూలకారణము,అదే బీజము నేనే!బుద్ధి మంతులలోని బుద్ధి నేనే!ధైర్యవంతులలోని ధైర్యాన్ని నేనే!ఇవన్నీ నీవు తెలుసుకుంటే మంచిది.
Thursday, 10 September 2026
పుణ్యో గంధః పృథివ్యాం చ
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ।
జీవనం సర్వ భూతేషు తపశ్చాస్మి తపస్విషు॥9॥7॥
శ్రీమద్భగవద్గీత..।।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా తను ఎక్కడెక్కడ ప్రస్ఫుటమవుతాడో చెబుతున్నాడు.అర్జునా!ఓ సఖా!నేను సర్వ వ్యాపకుడిని,ఈ సృష్టిలోని అణువణువునా వ్యాపించి ఉన్నాను అని చెప్పాను కదా!ఇంకొన్ని ఉదాహరణలు చెబుతాను.భూమి యందు ఉండే సువాసన నేనే!అగ్ని యందు ఉండే తేజస్సు నేనే!సర్వ జీవ కోటి లో ఉండే ప్రాణము నేనే!తాపసులలో ఉండే తపశ్శక్తి నేనే!నేను ఏంటో చిన్నగా నీకు అర్థం అవుతుంది కదా!
Wednesday, 9 September 2026
రసోఽహమప్సు కౌంతేయ
రసోఽహమప్సు కౌంతేయ ప్రభాఽస్మి శశి సూర్య యోః।
ప్రణవ స్సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు॥8॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను సర్వ వ్యాపకుడు అని సోదాహరణంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను చెప్పాను కదా నీకు...నాలోనే విశ్వం ఉంది.విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నాను,అని.నీళ్ళలోని రుచిని నేనే!సూర్య చంద్రులు వెదజల్లే కాంతి నేనే!వేదాలలోని ఓంకార నాదాన్ని నేనే!ఆకాశం లోని శబ్దం నేనే!మానవులలో ఉండే పౌరుషం నేనే!
Tuesday, 8 September 2026
మత్తః పరతరం నాన్యత్
మత్తః పరతరం నాన్య త్కించిదస్తి ధనంజయ।
మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ॥7॥7॥
శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా సులభంగా పూస గుచ్చినట్లు చెబుతున్నాడు.అర్జునా!బావా!నువ్వు ముందు ఇది తెలుసుకోవాలి.అది ఏందంటే ఈ లోకంలో నాకంటే శ్రేష్టమయినది ఇంకొకటి లేదు.ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి అంతా నా చుట్టే తిరుగుతూ ఉంటుంది.దారానికి కూర్చబడిన పూసలలాగా నాయందే ఈ సమస్తమూ కూర్చబడి ఉంది.నన్ను దాటి,నా కన్ను గప్పి పరమాణువు కూడా కదలలేదు.అంతా నా కనుసన్నలలోనే జరుగుతుంది.
Monday, 7 September 2026
ఏతద్యోనీని భూతాని
ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తథా॥6॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాండము సృష్టి లయలకు తనే మూలాథారము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్ఠా!నీకు తెలుసా?సర్వభూతాలూ కూడా ఈ పరా,అపరా ప్రకృతుల నుంచే పుట్టాయి.ఈ ప్రపంచము,ఈ విశ్వము యొక్క సృష్టి నా చేతుల మీదుగానే జరిగింది.దీనిని లయము చేసేది కూడా నేనే!ఈ రెండిటి మధ్యలో ఉండే స్థితిని కూడా నేనే నడుపుతాను.అంటే ప్రతిదీ,చీమ చిటుక్కుమన్నా కూడా,నా ఆజ్ఞ లేకుండా జరగదు.ఎందుకంటే సర్వస్వానికీ కారణభూతుడను నేనే!
Saturday, 5 September 2026
అపరేయ మితస్త్వన్యాం
అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్।
జీవ భూతాం మహాబాహో య యేదం ధార్యతే జగత్॥5॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పర అపర ప్రకృతుల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!ప్రకృతి రెండు రకాలు.అవే పర మరియు అపర.అపర ప్రకృతి అంటే పంచ భూతాలు మరియు మనసు,బుద్ధి,అహంకారము కలగలిసినది.పర ప్రకృతి అంటే శరీరము తన ప్రాణము తెలుసుకో గలిగిన,నడిపించే సూక్ష్మమయిన శ్రేష్టమయిన,సత్యమయిన,శాశ్వతమయిన చైతన్యము.
మనిషి అపర ప్రకృతి కంటే ఉన్నతమయినది పర ప్రకృతి అని తెలుసుకోవాలి.ఎందుకంటే పర ప్రకృతి ఈ సమస్త విశ్వాన్నీ ధరించింది.నా ప్రకృతినే పరా ప్రకృతి అని అంటారు.
Friday, 4 September 2026
భూమి రాపోఽనలో వాయుః
భూమి రాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా॥4॥7॥
శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి తను సృజించిన ప్రకృతి గురించి వివరణ ఇస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీవు నీ చుట్టూ చూస్తున్న ప్రకృతి ఎక్కడ నుంచి పుట్టింది అనుకుంటున్నావు?ఇదంతా నా సృజనే!నా ఈ ప్రకృతి ఎనిమిది భాగాలుగా విభజింప బడి ఉన్నది.భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనస్సు,బుద్ది మరియు అహంకారాలే ఆ ఎనిమిది విభాగాలు.
Thursday, 3 September 2026
మనుష్యాణాం సహస్రేషు
మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే।
యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥3॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగము,సాథన,జ్ఞానము ఊరికినే సులభంగా సంప్రాప్తించవు.ఖఠినమయిన దీక్ష,సాథన,జిజ్ఞాసలు అవసరము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను చెప్పేది వింటుంటే అంతా చాలా సులభమూ,సునాయాసమూ అనిపిస్తుంది కదా!అంత లేదు.నిజానికి ఏ వేయి మందిలో ఏ ఒక్కడికో మోక్షానికి ప్రయత్నించాలి అని అనిపిస్తుంది.అలాగ నిజంగా ప్రయత్నించే వేయి మంది యతులలో,ఏ ఒక్కడో నన్ను నిజంగా తెలుసుకో గలుగుతున్నాడు.కాబట్టి నిర్దిష్టమయిన ప్రణాళికతో ఇవి సాథన చేయాలి.
Wednesday, 2 September 2026
జ్ఞానం తేఽహం సవిజ్ఞానం
జ్ఞానం తేఽహం సవిజ్ఞాన మిదం వక్ష్యా మ్య శేషతః।
యజ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే॥2॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు.దేనికి?అత్యుత్తమమయిన జ్ఞానము బోథిస్తాను అని.అంతకంటే ఇంకేమి కావాలి,ఎవరికైనా?
అర్జునా!హే పార్థా!సంశయానికి తావు లేకుండా సంపూర్ణంగా నన్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను,అన్నాను కదా!ఆ మాట పైన నిలబడి ఉంటాను.అసలు ఏది తెలుసుకుంటే,ఇంక ఏమీ వేరే తెలుసుకోవాలసిన పని లేదో,ఆ జ్ఞానం నీకు ఉపదేశిస్తాను.అది కూడా ఆషామాషీగా చెప్పాను అంటే చెప్పాను లా కాదు.ఈ లోకములో ఉండే జ్ఞానము అంతా ఔపోసన పట్టినట్లు ఉండే అనుభవ పూర్వకమయిన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను.
Tuesday, 1 September 2026
మయ్యా సక్త మనాః పార్థ
శ్రీమద్భగవద్గీత...
సప్తమోఽధ్యాయః...విజ్ఞాన యోగః...
శ్రీ భగవానువాచ...
మయ్యా సక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు॥1॥
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇందాక చెప్పిన మాటే మళ్ళీ నొక్కి నొక్కి చెబుతున్నాడు.ఈ ప్రయత్నం అంతా తను చెప్పేది బుర్రలోకి గట్టిగా పాతుకు పోవాలనే!అర్జునా!ఓ పార్థా!ఇందాకటి మాటే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను.నా యందే మనస్సు నిలుపు.నన్నే ఆశ్రయించు.యోగరతుడవు కా!అంటే యోగమును ప్రీతితో ఆశ్రయించి,దానిలోనే మునిగి తేలడము.ఇలా చేస్తే నువ్వే కాదు ఎవరైనా సరే సరి అయిన మార్గములోకి వచ్చినట్లు లెక్క.అలాంటివాడు నిశ్శంకగానూ,సంపూర్ణంగానూ నవ్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను విను.
Monday, 31 August 2026
యోగినామపి సర్వేషాం
యోగినా మరి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా।
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమే మతః॥47॥6॥
ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోఽధ్యాయః...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాంటి మానవుడు గొప్పవాడు అని చెప్పబడతాడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నా యందే మనస్సు నిలుపు.శ్రద్ధతో నన్నే సేవించు.ఇది ఎందుకు చెబుతున్నానో తెలుసా?ఎందుకంటే అలా నన్నే శ్రద్ధగా సేవిస్తూ,మనసు నిండా నన్నే నింపుకునేవాడు యోగులందరిలోనూ గొప్పవాడు.ఈ విషయంలో అనుమానాలే అఖ్ఖరలేదు.నీవు నిస్సంశయంగా నమ్మవచ్చు.
ఇట్లు ఉపనిషత్తులు,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీ కృష్ణార్జున సంవాద రూపమయిన శ్రీమద్భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము అను ఆరవ అధ్యాయము సమాప్తము...
Sunday, 30 August 2026
తపస్వి భ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి
తపస్వి భ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః।
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున॥46॥6॥
శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము.....
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాంటి మానవుడు ఉత్తముడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ సఖా!కొంత మంది వేదోక్త కర్మలు అనుసరిస్తారు.ఇంకొందరు లోకములో ఉండే జ్ఞానాన్ని మొత్తమూ ఔపోసన పడతారు.ఇంకొక వర్గము ఘోరమయిన తపస్సులు చేస్తారు.వీళ్ళంతా ఒక ఎత్తు,యోగి ఇంకొక ఎత్తు.ఎందుకంటావా?యోగి అనేవాడు యోగ లేక ధ్యాన మార్గములో మనసును,శరీరాన్నీ తన అదుపులో ఉంచుకుంటాడు.నిస్స్వార్థంగా లోక హితము కోరుకుంటాడు.
క్రమశిక్షణ,సమభావానికి పెద్ద పీట వేస్తాడు.కాబట్టి బావా!నీవు యోగివి కావాలి అని నా అభిలాష.ఎందుకంటే తాపసుల కన్నా,జ్ఞానుల కన్నా,వేదోక్తకర్మకుల కన్నా యోగియే సర్వ శ్రేష్టుడు.
Saturday, 29 August 2026
ప్రయత్నా ద్యతమానస్తు
ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః।
అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్॥45॥శ్రీమద్భగవద్గీత....ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదీ తేలికగా దొరకదు అని చెబుతున్నాడు.
అర్జునా!ఓ కిరీటీ!యోగాభ్యాసము,మోక్షప్రాప్తి...ఇలాంటివి అన్నీ ఆషామాషీ వ్యమహారాలు కాదు.చిటికె వేస్తే అయిపోయే దానికి.ఏళ్ళు పూళ్ళూ గడచిపోతాయి.చాలా సార్లు ఒక జన్న చాలదు.ఆ భక్తి పరాకాష్ఠ సాథించే దానికి ఎన్నో జన్మలు ఎత్త వలసి ఉంటుంది.అందుకే చెబుతున్నాను.మానవుడు ఇలా జన్మ పరంపరాభ్యాసము వలన పాప పుణ్య రహితుడు అవుతాడు.ఆ తరువాత కైవల్యం చవిచూస్తాడు.పూర్వము నుండీ వచ్చే ఆచార వ్యవహారాలు త్రోసిపుచ్చకుండా తరువాత తరానికి మనము సరిగ్గా అంద జేస్తూ ఉండాలి.అప్పుడు సంప్రదాయాలు భ్రష్టు పట్టకుండా కొనసాగుతాయి.ఆ దారిలో పోవాలనుకునేవాళ్ళు సులభంగా ఆకళింపు చేసుకుని,ముందరకు పోతారు.అనుకున్నది సాథిస్తారు.
Friday, 28 August 2026
పూర్వాభ్యాసేన తేనైవ
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో పి సః।
జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే॥44॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!మనకు తీపి ఇష్టమనుకో.ఏమి చేస్తాము?అది ఎక్కడ ఉన్నా కనిపెడతాము.ఒక ముక్క త్రుంచి నోట్లో వేసుకుంటే కానీ ఆ యావ,దుగ్థ తీరదు.ఇక్కడ ఏ కారణం వల్ల నైనా యోగాభ్యాసాన్ని మధ్యలో వదలి పెట్టిన వాడి మనో స్థితి కూడా అలానే ఉంటుంది.జన్మ మారినా ఆశ మారదు.కాబట్టి అతను ఈ జన్మలో కూడా పాత వాసనల ప్రభావం వలన యోగానికే ఆకర్షింప బడతాడు.ఎత్తుకోవడం ఎత్తుకోవడం యుక్త కర్మ ఫలాలను మించి పోతాడు.యోగ సాథనలో ముణిగి పోతాడు.
యుక్త కర్మల వలన లాభాలు చెబుతాను.బంధాలలో చిక్కుకోకుండా ఉండడము.పాప పుణ్యాల బేరీజులతో సంబంథాలు లేకపోవడము.మనశ్శాంతితో మసలుకోవడము.మోక్ష ప్రాప్తి.భగవంతునితో అనుసంథానం కావడం.
Thursday, 27 August 2026
తత్ర తం బుద్ధి సంయోగం
తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికమ్।
యతతే చ తతో భూయ స్సంసిద్ధౌ కురునందన॥43॥6॥శ్రీమద్భగవద్గీత.....ఆత్మ సంయమ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న విషయమూ పూర్వాపరాలతో సహా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!సగంలోనే ముగింపు పలికిన యోగి తరువాత జన్మ సుకృతమయిన కుటుంబంలో,మంచి వారి మధ్య జరుగుతుందని చెప్పాను కదా!దీనికి కారణం ఏందంటే మనం చేసే మంచి ఎక్కడికీ పోదు.మనం కోరుకోక పోయినా దాని మంచి ఫలితాలు మనకు దక్కుతాయి.అతను తరువాతి జన్మలో అసంపూర్తిగా వదిలేసిన యోగాన్ని సంపూర్ణం చేయాలనుకుంటాడు.దానికి అనువుగా ఉండే పరిస్థితులు భగవంతుడే కల్పిస్తాడు,తన వంతు సహాయంగా.లేకపోతే రెడ్డొచ్చె మొదలొచ్చె లాగ మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాలి కదా వ్యవహారం అంతా.ఎంతో కొంత పూర్వ జన్మ వాసనలు ఉంటాయి,పరిసరాలు,మనుష్యులు అనుకూలంగా ఉంటాయి.కాబట్టి రెండో ఆలోచన లేకుండా యోగి రంగంలోకి దిగవచ్చు.తను అనుకున్న కార్యాచరణకు శ్రీకారం చుట్టవచ్చు.ఈ జన్మలోనైనా తను అనుకున్నది సాథించి మోక్షం సంప్రాప్తమయ్యేలా విజయం సాథించవచ్చు.
Wednesday, 26 August 2026
అథవా యోగినా మేవ
అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్॥42॥6॥
శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి దిలాసా ఇస్తున్నాడు కర్మే ఫలి!అని.అర్జునా!ఓ పార్థా!మనము ఫలితం గురించి ఆలోచించకుండా,నిస్వార్థంగా మంచి పనులు చేసామంటే మనకు మంచే జరుగుతుంది.మనము చేపట్టిన కార్యము అసంపూర్తిగా మిగిలిపోయినా,మనం దుఃఖ పడేపని లేదు.దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు మనకు అందజేస్తాడు.ఇప్పుడే చెప్పాను కదా అలాంటి పుణ్యాత్ములు ధనికుల ఇంటిలో కానీ,సదాచారుల ఇంటిలో కానీ పుడతారు.జ్ఞాన యోగుల వంశంలో పుడతారు.అటువంటి జన్మ మామూలు మానవులకు దుర్లభమనే చెప్పవచ్చు.ఎందుకంటే వాళ్ళ యోగ ప్రస్థానానికి నాందీ బీజం వేసినట్లే కదా,జన్మ సరి అయిన కుటుంబంలో జరిగితే!కాబట్టి ఈ విషయంగా నీవు చింతించాల్సిన అవసరము లేదు.
Tuesday, 25 August 2026
ప్రాప్య పుణ్యకృతాం లోకా
ప్రాప్య పుణ్య కృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభి జాయతే॥41॥6॥
శ్రీమద్భగవద్గీత....ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు లాంటి మంచి మిత్రులు అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా!అయినా మనము కూడా అదృష్టవంతులమే!ఎందుకంటారా?శ్రీకృష్ణుడితో పాటూ అర్జునుడు కూడా మనకు మిత్రుడు అయిపోయాడు కదా!మనము అడగవలసిన ప్రశ్నలు అన్నీ మన తరఫున అతనే అడిగేస్తున్నాడు.మనకు ఆ శ్రమ కూడా తప్పించేసాడు.అర్జునుడి ప్రశ్నలకు సమాథానంగా శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ సఖా!మంచి పనులు సగంలో అసంపూర్తిగా మానేస్తే ఎలా అని కదా నీ అనుమానం?ఏమీ దిగులు పడవలసిన పని లేదు.యోగ భ్రష్టుడు కూడా పుణ్యాత్ములు పొందే ఉత్తమ లోకాలు పొందుతాడు.చాలా కాలం అక్కడ నివసిస్తాడు.ఆ తరువాత సదాచారులు అయిన ధనిక కుటుంబంలో జన్మిస్తాడు.అంటే తన దీక్ష పూర్తి కాలేదు కాబట్టి పునర్జన్మ ఉంటుంది.అతను పూర్వ జన్మలో చేసిన పుణ్యకార్యాల కారణంగా మంచి మనుషుల మధ్య పుడతాడు.పూర్వ జన్మ వాసనలు ఉంటాయి కాబట్టి తాను ఎక్కడ వదలి పెట్టాడో పూర్వ జన్మలో.....అక్కడ నుంచి ముందుకు సాగుతాడు.అందుకే కదా పడ్డవాడు ఎప్పుడూ చెడ్జవాడు కాడు అని పెద్దలు అంటారు.వాడికీ ఒక మంచి రోజు వస్తుంది.
Monday, 24 August 2026
పార్థ నై వేహ నాముత్ర
శ్రీ భగవానువాచ...।
పార్థ నై వేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే।
న హి కళ్యాణ కృత్ కశ్చి ద్దుర్గతిం తాత గచ్ఛతి॥40॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడి అనుమానాలు అన్నీ ఓపికగా విన్నాడు.మందహాసంతో జవాబిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీ అనుమానాలు అన్నీ సహేతుకమైనవే.కాదనను.కానీ నేను ఒక విషయం చెబుతాను.శుభకర్మలు,అదే మంచి పనులు చేసేవాడికి ఎప్పుడూ చెడు జరగదు.అయ్యో!ఇంత మంచిగా జీవిత ప్రమాణాలని పాటిస్తున్నాము.ఎందుకు నాకు ఈ దుర్దశ అని చింతించాల్సిన తరుణం ఎదురవదు.అలాంటి వ్యక్తికి ఈ లోకములోనే కాదు,పరలోకంలో కూడా ఎలాంటి వినాశనమూ కలుగదు.సన్మార్గం ఎంచుకని,ఆ దారిలో పయనించడమే మనము చేయాల్సినది.
Sunday, 23 August 2026
ఏతన్మే సంశయం కృష్ణ
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తు మర్హ స్యశేషతః।
త్వదన్య స్సంశయ స్సాస్య ఛేత్తా న హ్యుపపద్యతే॥39॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
అర్జునుడు శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడిపోయినంత పని చేసాడు.బావా!ఓ దేవా!అన్యధా శరణం నాస్తి,త్వమేవ శరణం మమ!అని అన్నాడు.నిజమే కదా!ఆ యుద్ధభూమిలో రెండు సేనల మధ్య ఉన్నారు.ఒక సగం అంతా శతృవర్గము.ఇంకో సగం అంతా తన వాళ్ళే.కానీ ఎవరూ కృష్ణ భగవానుడికంటే ఎక్కువ కాదు.అయినవాడూ!ఆప్తమితృడూనూ!బావా!హే కృష్ణా!నువ్వు ఒక్కడివే నాకు ఇప్పుడు గతి.నాలో పుట్టుకొస్తున్న అనుమానాలూ,భయాలూ తీర్చగల సమర్థుడివి.నీవు కాకపోతే ఇంకెవ్వరూ నా సంశయనివృత్తి చేయలేరు.శరణు జొచ్చుతున్నాను.నీవే నాకు దిక్కు.
Saturday, 22 August 2026
కచ్చిన్నో భయవిభ్రష్ట
కచ్చిన్నో భయవిభ్రష్ట శ్ఛిన్నాభ్రమివ నశ్యతి।
అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి॥38॥6॥శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
అర్జునుడు తనకు వచ్చిన అనుమానాలన్నీ శ్రీకృష్ణుడి ముందర పెడుతున్నాడు.శ్రీకృష్ణా!ఓ సఖా!అందరూ మొదలు బెట్టిన కార్యాన్ని తు చ తప్పక పాటించి,ప్రయోజకులు కాలేరు కదా!అసంపూర్తిగా వదిలే దానికి సవాలక్ష కారణాలు ఉండి ఉండొచ్చు.అలాంటి మానవుడి పరిస్థితి ఏంది?వాడు రెంటికీ చెడ్డ రేవడి లాగ మిగిలి పోతాడు కదా!అసలు ఆ దారిలో నడవాలనే ఆకాంక్షలేనివారు ఆటపట్టించరా!ఏదో చేస్తానని పోయాడు,మన సాంగత్యం వదిలేసి.తీరా సాథించాడా?అంటే అదీ లేదు.చేతులూపుకుంటూ తిరిగి వచ్చాడు అని ఎద్గేవా చేయరా?అలాంటి వ్యక్తి ఇటు లౌకికానికీ,అటు బ్రహ్మజ్ఞానార్జనకూ...రెంటికీ కాకుండా పోడా?రెంటికీ చెడిపోయినవాడు విడిపోయిన మేఘశకలంలాగ నిష్ప్రయోజకుడుగా మిగిలిపోడా?వాడి గతి ఏంది?వాడి భవిష్యత్తు ఎలా తెమిలి,తెల్లవారుతుంది?
Friday, 21 August 2026
అయతి శ్రద్ధయోపేతో
అర్జున ఉవాచ...
అయతి శ్రద్ధయోపేతో యోగా చ్చలితమానసః।
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి॥37॥6॥
శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము...
అర్జునుడికి అసలు సిసలైన అనుమానం వచ్చింది.నిజమే కదా!శ్రీకృష్ణుడు చాలా కష్టం అంటున్నాడు.కానీ సాధించాలంటున్నాడు.నిజంగా ఎంత మంది సాధించగలరు?ఎంత మంది మొదలు పెట్టి,చేయలేక,చేతకాక మధ్యలోనే అస్త్ర సన్న్యాసం చేస్తారు?ఎంత మంది అసలు ఈ కోణంలో ఆలోచించరు?
అదే అడుగుతున్నాడు.కృష్ణా!ఓ బావా!నీవు చెప్పేదంతా చాలా బాగుంది.స్పూర్తిదాయకంగా ఉంది.కానీ బావా!శ్రద్ధ ఉన్నా ప్రయత్నించని వాడు ఏమవుతాడు?మొదలు పెట్టినా,ఏ కారణాల వల్లనైనా మనసు చలించి,సిద్ధి పొందలేని మానవుడి గతి ఏంది?ఇలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంది?
Thursday, 20 August 2026
అసంయతాత్మనా యోగో
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః।
పశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తు ముపాయతః॥36॥6॥శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా చెబుతున్నాడు..।మనిషికి ఏమి కావాలి?అని.అర్జునా!ఓ పార్థా!నేను ఒకటి చెబుతాను,విను.పిల్లవాడు తుంటరిగా ఉంటాడు.చెప్పిన మాట వినడు.తల్లి దండ్రులు వాడు అంతే అని గాలికి వదిలేస్తారా?వదిలెయ్యరు కదా!నయానో,భయానో వాడిని మంచి దారిలో పెడతారు కదా!ఇక్కడ కూడా అంతే!మనసు చంచలమయినది.నిజమే!అందుకని కళ్ళాలు వేయకుండా వదిలేస్తామా?దాని వల్ల నష్టం మనకే అని తెలిసి అదుపూ ఆజ్ఞా లేకుండా గాలికి వదిలేస్తామా?మనసు పై నిగ్రహం ఉంచుకోలేని వాడు యోగసాథన చేయలేడు.దానికి ఎలాంటి దగ్గర మార్గాలు లేవు.మనో నిగ్రహం సాథించామంటే ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది యోగసాథనకూ,అలాగే యోగసిద్ధికీ.
అసంశయం మహాబాహో
శ్రీ భగవానువాచ...
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్।
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే॥35॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...శ్రీకృష్ణుడికి అర్జునుడి అనుమానాలు విని సంతోషం వేసింది.ఎందుకు?ఎందుకంటే ఒక శిష్యుడు మనసు పెట్టి వింటున్నాడు అని అర్థం కనుక.అర్థం చేసుకునేదానికి శాయశక్తులా తపిస్తున్నాడు అని గుర్తు.ఇంక పరవాలేదు బండి దారిలోకి వస్తున్నది అని ఊపిరి తీసుకున్నాడు.చిన్నగా చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నీ అనుమానాలలో తప్పు లేదు.ఎవరైనా అలానే అనుకుంటారు.కానీ నేను ఒక విషయం చెబుతాను.వేప ఎలా ఉంటుంది,చెప్పు?చేదుగా ఉంటుంది కదా!నోట్లో పెట్టుకోని,ఆహా!ఓహో!అంటూ తన్మయత్వంగా ఆస్వాదించగలమా?లేదు కదా!దానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి,కానీ మనకు రుచి కూడా చూడబుద్ధి కాదు.నాలుక కొనకు కూడా తాకించ బుద్ధి కాదు.కానీ చిన్నగా రోజూ కొంచెం కొంచెం తినడం మొదలు పెట్టాము,అనుకో!కొన్ని రోజులకు కష్టం అనిపించదు కదా!బాగా అలవాటు అయేటప్పచికి దాంట్లో కూడా మంచి కనిపిస్తుంది కదా!ఇది కూడా అలాగే!మనసు చంచలమైనదే!నిగ్రహించడము ఇంకా కష్టమే?కానీ..।అభ్యాసము అనే ఒక ప్రక్రియ ఉంది చూసావూ.అది రామబాణంలా పని చేస్తుంది.దానికి తోడు వైరాగ్యం అనే సాథనం యొక్క ఆసరా తీసుకున్నావు అనుకో,అద్భుతాలు సృష్టించవచ్చు.మనశక్తి యుక్తులు మనకు తెలియడం లేదు.సానబెడితేగానీ వజ్రం మెరవదు కదా!మన మస్తిష్కం కూడా అంతే.అర్థమైందా నాన్నా!
Tuesday, 18 August 2026
చంచలం హి మనః కృష్ణ
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్॥34॥6॥శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు తన శంకలూ,అనుమానాలూ,భయాలూ పెడుతున్నాడు.కృష్ణా!ఓ సఖా!నీకేమి?అన్నీ చెబుతావు.ఒకసారి సమదృష్టి అంటావు.ఇంకోసారి మనోనిగ్రహము అంటావు.అవునా!అని అనుకునేలోపల యోగము అని అంటావు.నీకు తెలుసు కదా జీవులు ఉండే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అని.ఇక్కడ మనం గాలిని నిరోథించగలమా?లేదు కదా!మనసు కూడా గాలి లాగే చంచలమయినది,గుప్పిట్లో బంథించలేనిది కదా!ఆంజనేయుడిని వాయుపుత్రుడు అని ఎందుకు అంటారు?గాలి లాగ అంత బలవంతుడు కాబట్టి కదా!మరి నువ్వేమో మనసును కట్టుదిట్టంగా,కను సన్నల్లో పెట్టుకోమంటావు.ఎట్లా కుదురుతుంది,స్వామీ?నాకైతే ఇది అయ్యే వ్యవహారం లా కనిపించడం లేదు.
Monday, 17 August 2026
యోఽయం యోగస్త్వయా ప్రోక్త
అర్జున ఉవాచ...
యోఽయం యోగస్త్వయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరామ్॥33॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
అర్జునుడు ఇందాకటి నుంచి ఉగ్గబట్టి కూర్చుని,శ్రీకృష్ణుడు చెప్పేదంతా వింటున్నాడు.కొంచెం అర్థమవుతూ,కొంచెం గజిబిజిగా అనిపిస్తున్నట్లు ఉంది.మనసులో సంశయాలు పెట్టుకోకూడదు కదా!అందుకని గొంతు సవరించుకుని తన నేస్తాన్ని అడుగుతున్నాడు.కృష్ణా!ఓ బావా!నీవు చెప్పిందంతా శ్రద్ధగా వింటూ ఉన్నాను.నీవు ఇప్పుడు ఏమి చెప్పావు?ముందర మనసును స్థిర పరుచుకోవాలి,సమదృష్టి పెంపొందించుకోవాలి అని చెప్పావు కదా!అట్లా చేస్తే కానీ యోగి కాలేము అని అంటున్నావు కదా!మనసు సహజగుణమే చంచలంగా ఉండడము.మరి అలాంటప్పుడు నీవు చెప్పేదంతా ఎలా ఆచరించగలను?ఆ యోగ స్థితి ఎలా చేజిక్కించుకోగలను?దిక్కుతోచడం లేదు.
Sunday, 16 August 2026
ఆత్మౌపమ్యేన సర్వత్ర
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥32॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి భావజాలము ఏ రీతిలో ఉండాలి అనే విషయము చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నన్ను కొడితే నాకు నొప్పి అనిపిస్తుంది కదా!మరి నిన్ను కొడితే వింజామరలు వీచినట్లు ఉంటుందా?ఉండదు కదా!నీకు కూడా నొప్పే అనిపిస్తుంది కదా!ముందర మనము అది గ్రహించాలి.ప్రతి ప్రాణి స్పందన ఒక విషయానికి ఒకేలాగ ఉంటుంది అని.కాబట్టి ఎదుటి వారి సుఖ దుఃఖాలను మనవి లాగ మనము స్పందించగలగాలి.అందరి కష్టము మన కష్టము,అందరి సుఖము మన సుఖము.ఈ సత్యము మనం తెలుసుకున్న నాడు మనమే యోగులము,యోగిశ్రేష్టులము అవుతాము.ఎందుకంటావా?అందరి నొప్పి మనకు నొప్పి అంటే ఎదుటి వారికి ఆ నొప్పి కలుగకుండా జాగ్రత్త పడతాము.అందరి ఆనందము మన ఆనందము అనుకుంటే సాంఘిక న్యాయము,ప్రశాంతతలకు పాటుపడతాము.
Saturday, 15 August 2026
సర్వభూతస్థితం యో మాం
సర్వభూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే॥31॥6॥
శ్రీమద్భగవద్గీత..।।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సమదృష్టి ఉండడం ఎంత ముఖ్యమయిన ప్రక్రియో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఇందాకటి నుంచీ నీకు చెబుతున్నాను కదా నేను సర్వాంతర్యామిని అని.నేను నీలో ఉంటాను,నీ చుట్టూ ఉంటాను.అలానే సర్వభూతాలలోను ఉపస్థితమై ఉంటాను.ఆ విషయం మనకు అర్థం అయింది అనుకో,అప్పుడు ఎవరినీ చులకన భావంతో చూడము.అందరికీ గౌరవము ఇస్తాము.ఎందుకంటే నేను నేను కాదు,నాలో పరమాత్మ ఉన్నాడు.నీవు నీవు కాదు.ఎందుకంటే నీలోనూ పరమాత్మ ఉన్నాడు.అంటే అర్థం ఏంది?మన ఇద్దరమూ ఒకటే,సమానమే అని కదా అర్థము.అందుకే చెబుతున్నాను మిత్రమా.భేదభావం లేకుండా అన్ని ప్రాణులలో అంతర్హితంగా ఉన్న నన్ను ధ్యానించాలి.అప్పుడు ఆ ధ్యాని ఎవరైనా,ఏ స్థితిలో ఉన్నా నా యందే ఉంటాడు.
Friday, 14 August 2026
యో మాం పశ్యతి సర్వత్ర
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి॥30॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడే చెప్పాడు కదా యోగి తనలో అందరినీ,అందరిలో తనను చూసుకుంటాడు అని.ఆఁ!చూస్తే ఏమవుతుంది?అని కదా మనందరి అనుమానం.దానికి సమాథానం భగవంతుడే చెబుతున్నాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నీకు ఇప్పుడు అసలు రహస్యం చెబుతాను.ఎవడైతే అన్ని ప్రాణుల యందు నన్నూ,నా యందు సమస్త ప్రాణులనూ చూస్తాడో వాడే యోగి.ఎందుకంటే యోగి తనలో ఉన్న దైవాన్నీ,పరమాత్మనీ చూడగలుగుతాడు.అలాగే అన్ని ప్రాణులలోనూ అదే దైవాన్ని చూడగలుగుతాడు.అందుకే అతనికి అందరూ సమానమే అనిపిస్తుంది.అంతే కాదు,సఖా.అలాంటి వాడి యందే నా దృష్టి అన్ని వేళలా ఉంటుంది.వాడి దృష్టీ నా యందే సతతం ఉంటుంది.అంత కంటే మోక్షం,పరమార్థం ఇంక ఏమి ఉంటుంది చెప్పు,మానవుడికి?
Thursday, 13 August 2026
సర్వభూతస్థ మాత్మానం
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని।
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః॥29॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగాభ్యాసము వలన లాభాలు చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!యోగము అభ్యసించడం,మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి,తెలుసా?అతనికి సమతా భావము ఉంటుంది.మళ్ళీ అదేంది అంటావా?అంటే అన్ని ప్రాణులనూ సమదృష్టితో చూడగలుగుతాడు.నీవే నేను,నేనే నీవు లాగ అనుకో!అన్ని జీవాల యందు తనను చూసుకుంటాడు.తన యందు సర్వభూతాలనూ దర్శిస్తాడు.అంతే కదా!మనము ఎవరిని సమ ఉజ్జీలు అనుకుంటాము?మనకు ఉన్న శక్తియుక్తులు ఎదుటి వాడిలో ఉన్నప్పుడే కదా!సర్వ ప్రాణులను సమంగా చూడడమంటే?చిన్న అయినా పెద్ద అయినా,బలవంతుడు అయినా బలహీనుడు అయినా..।అలా ప్రతి ప్రవృత్తిలో మనలను మనం ఎదుటి జీవిలో చూసుకోగలగాలి.
యుంజన్నేవం సదాత్మానం
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః।
సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే॥28॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నేను నీకు చెప్పే ప్రతి విషయమూ ఆచరించడము చాలా కష్టము.కానీ నీవు ఒకటి అర్థం చేసుకో.అది నిజంగా సులభతరమయితే నీవు అసలు నా దగ్గర ఇంత సేపు చెప్పించుకోవు కదా!అది కష్టతరము కానీ అనుభవయోగ్యము కాబట్టి నేను నీకు చెప్పే ప్రయత్నము చేస్తున్నాను,నీవు అర్థం చేసుకోవాలని తాపత్రయ పడుతున్నావు.
బావా!మనము ఎటువంటి దోషభావాలు లేకుండా మనసును యోగమందు నిమగ్నం చేయాలి.అట్లా చేయగలిగితే ఆ యోగి బ్రహ్మ జ్ఞానం పొందగలుగుతాడు.శాశ్వత ఆనందం అదే కైవల్యం పొందుతాడు.ఇందులో ఎలాంటి అనుమానమే లేదు.
Monday, 10 August 2026
ప్రశాంత మనసం హ్యేనం
ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్।
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్॥27॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇందాకటి నుంచీ ఇంద్రియ నిగ్రహము గురించి చెబుతున్నాను కదా!అంతే ముఖ్యమయినది ఇంకొకటి ఉంది.అది ఏందో నువ్వు చెప్పగలతావా?ఆలోచించు.సరే!నేనే చెబుతాను,విను.మనసును నిష్కల్మషంగా,ప్రశాంతంగా పెట్టుకోగలగడం.ఎందుకంటావా?మనము ఏదో సాధించాము అనే భావన వచ్చింది,అనుకో.మనకు తెలియకుండానే గర్వం పొడచూపుతుంది.ఆ విషయం మనకు కూడా తెలియదు.మిగిలిన విషయాలు చాలా తృణప్రాయంగా,లెఖ్ఖలోనికి రానివిగా తీసేస్తాము.ఆ చులకన భావము,ఆ విసుగు,ఆ ఛీదర,ఆ ఛీత్కారము మనము పక్కన పెట్టాలి.ఎదుటి వారి మనసు నొప్పించ కూడదు...తెలిసి గానీ,తెలియక గానీ.ఆ స్పృహ మనకు ఖచ్ఛితంగా ఉండాలి.అది ఉండాలంటే మొదట మన మనసు ప్రశాంతంగా ఉండాలి,ఉంచుకోగలగాలి.మనిషికి తెలివి తేటలు ,జ్ఞానము ఎంత ముఖ్యమో..।మంచి మనసు,సమభావము,దయ,దాక్షిణ్యం కూడా అంతే ముఖ్యము.అలా ఉన్నప్పుడే బ్రహ్మానందానుభూతి తనకు తానై వచ్చి మన ఒడిలో వాలుతుంది.మన కైవసము అవుతుంది.
Sunday, 9 August 2026
యతో యతో నిశ్చరతి
యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్।
తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్॥26॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక విషయం పదే పదే చెబుతున్నాడు.అంటే దాని అర్థం ఏంటి?అది మన జీవిత విథానానికి చాలా ముఖ్యం అని కదా!ఆయనకు ఇంక వేరే పని పాటలు లేక కాదు కదా!అర్జునా!ఓ బావా!మనసు చంచలమయినది అని నాకు తెలుసు,నీకు కూడా తెలుసు.అలాగని అది చెప్పినట్లల్లా మనం ఆడకూడదు.ఒక నియంత్రణ,నియమం అంటూ పెట్టుకోవాలి.లేకుంటే అది మన చేత కథాకళి ఆడిస్తుంది.అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలో నువ్వు చెప్పు?జ్వరం వస్తే మనం ఏమి చేస్తాము?లంఖణాలు ఉంటాము.పత్యం పాటిస్తాము.మందులు వేసుకుంటాము.ఇవన్నీ మనం ఇష్టమయి చేయము కదా!మళ్ళీ బండి మామూలు కావాలి కాబట్టి చేస్తాము.అలానే మనసు చంచలమయినదని అది ఆడించినట్లంతా ఆడకూడదు.విషయాల వైపుకు పోకుండా నిగ్రహించాలి.మనసును ప్రశాంతమయిన ఆత్మ వైపుకు తిప్పుకోవాలి.పరమాత్మ వైపుకు మళ్ళించి,అతని వశంలోకి మనం వెళ్ళాలి.
Saturday, 8 August 2026
శనై శ్శనై రుపరమేత్
శనై శ్శనై రుపరమే ద్బుద్ధ్యా ధృతి గృహీతయా।
ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్॥25॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత వివరంగా,విపులంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!మనం మనసుతో ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవాలి.ఎందుకనంటావా?ఎందుకంటే క్షణికమయిన సుఖాలు ఉన్నాయి చూసావూ?రా!రా!సరసకు చేరా!అంటూ కన్ను గీటుతుంటాయి.ఊరిస్తూ ఉంటాయి.మనమంటే ఇంత ఇష్టమా?అని చొంగ కార్చుకుంటూ వాటి వెనక పరుగులు తీస్తాము.ఇంకేముంది?కాలు జారడాలో?ఊబిలో కూరుకుపోవడాలో?ఇంక అక్కడ నుంచి వెనకకు వచ్చే ప్రసక్తి ఉండదు.అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.మనో నిగ్రహం అత్యంత అవసరము!ధీరుడుగా ఉందాము.ప్రాపంచిక విషయాల నుండి బుద్ధిని దూరంగా ఉంచుకుందాము.మనసును ఆత్మ యందే కుదురుగా ఉండేలా చూసుకుందాము,చేసుకుందాము.మనసు పరి పరి విథాలా పోతానంటుంది.కానీ దానిని అదుపులో పెట్టుకుందాము.కళ్ళాలు వేద్దాము.ఇలా వేరే ఆలోచనలు,చింతలూ లేకుండా జాగరూకతతో ఉందాము.
Friday, 7 August 2026
సంకల్ప ప్రభవాన్ కామాన్
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః।
మనసై వేంద్రియగ్రామం వినియమ్య సమంతతః॥24॥6॥
శ్రీమద్భగవద్గీత.।।ఆత్మ సంయమ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!మనం ఈ భూమి పైన పుట్టాము కదా!కాబట్టి ప్రాపంచిక విషయాల పైన రక్తి,అనురక్తి,మోహము,లాలస,తపన సహజంగా ఉంటాయి.ఆ యా సంకల్పాల వల్ల పుట్టే కోరికలు ఒకటో రెండో ఉండవు.తేనె తుట్టె కదిలిస్తే తేనెటీగలు ఎన్ని మన పైకి దాడి చేస్తాయి,మూకుమ్మడిగా?చెప్పు?అంతకంటే పదింతలు కోరికలు మనల్ని చుట్టుముట్టుతాయి.అనుమానమే లేదు.మనం ఎంత గింజుకున్నా వాటి నుంచి తప్పించుకోలేము,వాటి ముళ్ళ నుంచీ తప్పించుకోలేము.కానీ,ఆ కోరికలను మనము నిగ్రహించగలగాలి.వాటి నుంచి దూరంగా వచ్చేయాలి.విషయాలను ఇంద్రియాలనుంచి మరల్చగలగాలి.అంటే
ఇంద్రియ నిగ్రహము పాటించాలి.ఓ యమ్మో!ఇదంతా మన వల్ల అవుతుందా?అని మొదట్లోనే అస్త్ర సన్న్యాసం చేయకూడదు.
Thursday, 6 August 2026
తం విద్యా ద్దుఃఖ సంయోగ
తం విద్యా ద్దుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితమ్।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణ చేతసా॥23॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా విడెరచి చెబుతున్నాడు.అర్జునా!బావా!మనం ఇప్పుడు యోగం గురించి మాట్లాడుకుంటున్నాము కదా!యోగమనేది ఒక స్థితి.అది ఏమి చేస్తే మనకు దక్కుతుంది?ఎలా ఉంటే మన ఆధీనంలోకి వస్తుంది అనే విషయంగా మల్లగుల్లాలు పడుతున్నాము కదా!మనము ఏ స్థితిలో ఉంటే దుఃఖాలు మన దరికి చేరవో,ఆ స్థితి.అంటే అవి కూడా ఇక్కడ మన పని అయ్యేటట్లు లేదని తోక ముడిచి,పారిపోవాలి.అంటే వాటికి అర్థమయిపోతుంది అన్న మాట.మనం వాడి దగ్గర ఉన్నా,ఆ చెట్టు పుట్ట మీద ఉన్నా ఒకటే.వీడు స్పందించడు.వీడి దగ్గర మన శక్తి యుక్తులు ప్రదర్శించడం వృథా అని.యోగము అంటే ఆ స్థితి రా,బావా!ఆ స్థితిని మనము స్థిర మానస బుద్ధి సాథించి,సహనంతో సమన్వయం చేసుకుని సాథించాలి.మనసా వాచా కర్మణా అదే ధ్యాసలో ఉండాలి.
Wednesday, 5 August 2026
యం లబ్ధ్వా చాపరం లాభం
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే॥22॥6॥ఆత్మ సంయమ యోగము...భగవద్గీత..
భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు మానవుడు అయిన అర్జునుడికి ఆత్మతృప్తి,అత్యంత ఆనందకరమయిన స్థితి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!మనకు ఎప్పుడు ఇంక చాలు అనిపిస్తుంది?ఇంతకంటే గొప్పగా ఇంకొకటి ఉండదు అనినప్పుడు కదా!ఆ సచ్చిదానందము స్థిరమయినప్పుడు మనసు అచంచలమవుతుంది.ఆ స్థితిలో ఎన్ని కష్టసుఖాలు,దుఃఖాలు అయినా తృణప్రాయమవుతుంది.అసలు చలించము.చలించడం వ్యర్థము అనే భావనకు వస్తాము.ఆ అత్యంత ఆకర్షణీయమయిన ఆత్మానందమే మోక్షానికి మొదటి మెట్టు.మనం మనం ఎన్నుకున్న మార్గానికి అర్హులు అయినట్లు లెఖ్ఖ.
Monday, 3 August 2026
సుఖ మాత్యంతికం యత్తద్
సుఖ మాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్య మతీంద్రియమ్।
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః॥21॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగాన్ని ఎలా ఉంటే సాథించుకోగలమో,ఎలా సాథించుకోవాలో మెళకువలు చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!యోగమనేది చాలా విస్తారమయినది.ఒంట బట్టించుకుంటే..ఓస్!ఇంతేనా!అనిపిస్తుంది.కానీ ఆ స్థితికి చేరాలంటే మనకు చాలా విషయాలు అవగతం కావాలి.మనము ఏ స్థితిలోనూ ఆత్మతత్త్వం నుండి కదలకుండా ఉండగలగాలి.ఆత్మ దర్శనంతో తృప్తి చెందగలగాలి.
సచ్చిదానందం అంటే చెబుతాను,విను.ఆత్మ అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు.అలోక్యమయిన,శాశ్వతమయిన ఆనందం,స్వయం ప్రకాశమయిన సారము.సత్ అంటే శాశ్వత ఉనికి అని అర్థము.చిత్ అంటే చైతన్యము.ఆనందము అంటే స్వచ్ఛమయిన సంతోషము,తృప్తి.మన ఆత్మలో ఇవన్నీ మనం కనుగొనగలగాలి.ఎందుకంటే అవి ఎప్పుడూ ఉంటాయి.మనం అజ్ఞానంతో ఎదురుగా ఉండే వాటినే కాలదన్నుతాము.తరువాత భోరుమని ఏడుస్తాము.
Sunday, 2 August 2026
యత్రో పరమతే చిత్తం
యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా।
యత్ర చైవాత్మ నాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి॥20॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు యోగమంటే ఏమిటి?దాని కథా,కమామిషు ఏంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్ఠా!నేను చెప్పేది నీకు అవగతమవుతున్నది కదా!లేక ఊరికినే ఊ!ఊ!అంటున్నావా?నీకు అసలు యోగమంటే ఏంది అని చెబుతాను,విను.ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది.అజ్ఞానుల దరిదాపుల్లో కనిపించదు.వారు గ్రహించలేరు.జ్ఞానము చేతనే దాని ఉనికిని మానవుడు గ్రహించ గలతాడు.అది అనంతమయిన సుఖానుభూతిని ఇస్తుంది.మునులు,యోగులు,సర్వసంగ పరిత్యాగులు నిత్యం దాని అన్వేషణలో ఉంటారు.అది ఏ స్థితిలో కలుగుతుందో చెబుతాను.నీకు ఎరుక పరుస్తాను.
Saturday, 1 August 2026
యథా దీపో నివాతస్థో
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా।
యోగినో యత చిత్తస్య యుంజతో యోగ మాత్మనః॥19॥6॥
శ్రీమద్భగవద్గీత....ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి విషయమూ కూలంకషంగా,ఏ మాత్రమూ అనుమానానికి తావు లేకుండా చేయాలని నడుం బిగించాడు.అందుకే చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను ఏమి చెప్పాను?మనసు పరి పరి విథాలా పోకూడదు అని చెప్పాను కదా!నిశ్చలంగా,నిర్మలంగా ఉండాలని కూడా చెప్పాను కదా!దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను,విను.మనం దీపం వెలిగించుకుంటాము కదా!గాలి వస్తే ఏమవుతుంది.ఆ వత్తి నుంచి వచ్చే వెలుగు గాలి ఏతట్టు వీస్తే ఆ తట్టుకు కదులుతుంది కదా!నిలకడగా ఉండదు కదా!అదే గాలి లేని చోట అయితే క్రమబద్ధంగా,నిలువుగా,నిటరుగా,ఒకే లంబంలో,నిశ్చలంగా వెలుగుతుంది కదా!యోగసాథకుడు కూడా అలాగే ఉండాలి.బయట విషయాలకు స్పందిస్తుంటే,మనసు నిలకడ ఉండదు.అవేవీ లేవు,తనను ఏమీ చేయలేవు,చేయకూడదు అని భీష్మించుకోవాలి.అప్పుడు అతని మనసు గాలి లేని చోట దీపములాగ చలించకుండా నిశ్చలంగా,యోగాభ్యాసానికి అనువుగా ఉంటుంది.
Friday, 31 July 2026
యదా వినియతం చిత్తం
యదా వినియతం చిత్త మాత్మన్యే వావతిష్ఠతే।
నిస్స్పృహ స్సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా॥18॥6॥
శ్రీమద్భగవద్గీత.।..ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మమేకం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!యోగాభ్యాసం ఎలా చేయాలి,ఎలా చేయకూడదు అని చెప్పాను కదా!మనసును అటలంగా పెట్టుకోవాలి.ధ్యాస నాపై నుంచి చెదరకూడదు.నాపై భక్తి శ్రద్ధలతో మమేకం అయిపోవాలి.ఎప్పుడూ మనసును ఆత్మయందే నిలపగలగాలి.కోరికలకు తిలోదకాలు ఇవ్వాలి.అలాంటి స్థితి చేరిన యోగి యోగముక్తిని పొందుతాడు.
Thursday, 30 July 2026
యుక్తాహార విహారస్య
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు।
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా॥17॥6॥
శ్రీ మద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!ఇప్పుడే అనుకున్నాము కదా,అతి వద్దు అని.కాబట్టి ఏమి చేద్దాము?మితంగా ఆహారం తీసుకోవాలి.మట్టసంగా నిద్ర విహారాలు పోవాలి.
అలాగే మితంగా నియత కర్మలు ఆచరించాలి.మితమైన మెలకువ కలిగి ఉండాలి.ఇలా అన్నీ మితంగా చేస్తూ,యోగాభ్యాసం చేసేవాడికి సర్వ దుఃఖాలూ నాశనమవుతాయి.యోగము సిద్ధిస్తుంది.
Wednesday, 29 July 2026
నాత్యశ్నతస్తు యోగోఽస్తి
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చై కాంత మనశ్నతః।
న చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున॥16॥6॥
శ్రీ మద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓపికగా ఏమేమి చేయాలో,ఏమేమి చేయకూడదో చెబుతున్నాడు.అర్జునా!అతి సర్వత్ర వర్జయేత్ అనే నానుడి ఉంది కదా!అది ఇక్కడ కూడా వర్తిస్తుంది.ఏదీ అతిగా చేయకూడదు.ప్రతిదీ మితంగా ఉండాలి.ఎక్కువగా తినకూడదు.తింటే ఏమవుతుంది అంటావా?తొందరగా అరగదు.అజీర్ణం చేస్తుంది.భుక్తాయసంతో మన్ను తిన్న పాములాగ పడి ఉంటాము.చలాకీదనం పోతుంది.భారీకాయం మన సొంతం అవుతుంది.అట్లా అని కటిక ఉపవాసాలు ఉండ కూడదు.లేచి,తిరుగుతూ మన పనులు మనం చేసుకునే శక్తి కూడా ఉండదు.దోగాడాలి.ఎక్కువగా నిద్ర పోకూడదు.పొద్దస్తమానం గురకలు పెట్టి నిద్రలు పోతుంటే పనులు ఎట్లా జరుగుతాయి?అట్లా అని జాగారాలు చేయకూడదు.మనిషికి,బుర్రకు విశ్రాంతి ఇవ్వాలి.అప్పుడే మళ్ళీ నూతనంగా రోజు ప్రారంభమవుతుంది.లేకపోతే అటు నిద్రా పోక,ఇటు మంచిగా మేల్కొనలేక తూగుతూ ఉంటాము.చలాకీదనం శూన్యమవుతుంది.కాబట్టీ ఏదీ అతిగా పోకుండా,మితంగా ఎక్కడ ఆగాలో,ఆపాలో తెలుసుకోవాలి,ఆచరించాలి.
Tuesday, 28 July 2026
యుంజన్నేవం సదాత్మానం
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి॥15॥6॥
శ్రీమద్భగవద్గీత..।।ఆత్మ సంయమ యోగము.
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నేను చెప్పాను కదా ఇప్పుడు.మనసు ప్రశాంతంగా ఉంచుకుని,బ్రహ్మచర్యం పాటిస్తూ,నా ధ్యాసనుంచి పక్కకు మరలకుండా యోగాభ్యాసం చెయ్యాలి అని.ఎంత సేపు అని చెప్పలేదు కదా!మాములుగా అట్లా చెప్పక పోతే మనం ఏమి చేస్తాము?ఓం,ఓం,ఓం అను గట్టిగా ఐదు నిముషాలు అంటాము.తరువాత నుంచి చిన్నగా ఒక కన్ను తెరిచి చుట్టు పక్కల ఏమి జరుగుతుంది గమనిస్తాము.మళ్ళీ కళ్ళు మూసుకుంటాము.ఇంకో ఐదు నిముషాలు ధ్యానం చేస్తాము.ఓ యమ్మో!ఈ రోజుకు చాలానే కష్టపడిపోయాము అని మనకు మనమే దిష్టి పెట్టుకుంటాము.రేపు చూసుకుందాములే అని లేచేస్తాము.కానీ,అర్జునా!అలా కాదు చేయాల్సింది.అనునిత్యమూ మనోనిగ్రహంతో అభ్యాసం చేయాలి.ధ్యానం చేసే సమయం పెంచుకుంటూ పోవాలి.ఒక నిబద్ధత రావాలి.ఒక నిష్ట ఉండాలి.ఒక ధ్యేయం ఉండాలి.చెయ్యమన్నారు కదా అని బలవంతంగా,ముక్కు మూసుకుని చేయటం కాదు.దానివల్ల ఫలితం ఉండదు.మనకు మనమే ప్రేరణ పొందాలి.ఆ యోగాభ్యాస స్థితిలో మనశ్శాంతి,మనోనిర్మలం పొందాలి.అప్పుడు ఆ భక్తుడు నా స్థితిని,నన్నూ,మోక్షాన్నీ పొందగలుగుతాడు.
Monday, 27 July 2026
ప్రశాంతాత్మా విగతభీః
ప్రశాంతాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థితః।
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః॥14॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న వివరము కూడా చెబుతున్నాడు.ఇక్కడ మనము అర్జునుడి గొప్పదనం గురించి కూడా మాట్లాడుకోవాలి.జ్ఞానభిక్ష ఇచ్చేవారు భగవంతుడితో సమానం.అందుకనే మనము గురువును భగవంతుడు కంటే గొప్పగా,ముందర వరుసలో పెడతాము.ఆయనే కదా మనలను భగవంతుడికి చేరువ చేసేది.ఇక్కడ గురువు,భగవంతుడూ ఇద్దరూ ఒకరే!గురువుకి చెప్పాలని ఉన్నా శిష్యుడు ఆ జ్ఞానబోధను స్వీకరించే పరిస్థితిలో ఉండాలి కదా!ఏంది స్వామీ!యుద్ధమూ వద్దూ,నీ సుద్దులూ,బుద్ధులూ వద్దు.అని వెళ్ళిపోలేదు.రణరంగంలో బాసింపట్టు వేయించి,ఈ బలవంతపు ముక్తాయింపులు ఏంది అని విసుక్కోలేదు.ఇవన్నీ కృష్ణుడుతో అనగలిగే చనువు,స్నేహమూ ఉంది.కానీ మంచి ఎవరు చెప్పినా,కొత్త విషయాలు చెప్పినా,మన మంచి కోరి చెప్పినా...వారికి మనం గురువు హోదా ఇవ్వాలి.అది అర్జునుడు కృష్ణుడికి ఇచ్చాడు.అతను చెప్పే ప్రతి ఒక్క అక్షరాన్ని అమృత బిందువులాగా ఆస్వాదించాడు.జుర్రుకున్నాడు.సరైన మార్గంలో ప్రవర్తించాడు.ఇక్కడ శ్రీకృష్ణుడి శ్రమ వృథా కాలేదు.చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వ్యర్థం కాలేదు.అనుకున్న ఫలితం దక్కింది.
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!మనము ముందర మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.భయపడకూడదు.బ్రహ్మచర్యం పాటించాలి.మనసును అదుపులో పెట్టుకోవాలి.ధ్యాస నా పైనే పెట్టాలి.ఆ స్థితిలో యోగాభ్యాసం చేయాలి.
Sunday, 26 July 2026
సమం కాయశిరోగ్రీవం
సమం కాయశిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్॥13॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్దునుడికి యోగాభ్యాసం చేయడానికి ఎలా కూర్చోవాలి,చూపు దేనిపైన నిలపాలి అనే వివరాలు కూడా చెబుతున్నాడు.అంటే ఒక విషయం ఎంచుకుంటే...కూలంకషంగా దాని పూర్వాపరాలు అన్నీ తెలియచేయాలి అన్నమాట.సగం ఇక్కడ,సగం మింగేసి,సగం మనకే తెలియక,ఇంకొంచెం మర్చిపోయి,మరింకొంచెం...ఆ ఇది కూడా మనమే చెప్పాలా?ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా?మనషి అన్నాక!ఇలా ఆలోచించి మనం ఏదీ సంపూర్ణంగా చెప్పము.కానీ దేవదేవుడైనా ఎంత ఓపికగా చెబుతున్నాడు చూడు,అర్జునుడికి.అర్జునుడు ఏమీ అడ్డబాల కాదు.కానీ నేర్పించాలి అనుకున్నప్పుడు సంపూర్ణంగా తెలియచేయాలి.అది ధర్మం!
అర్జునా!కిరీటీ!శుభ్రమయిన ప్రదేశంలో,సముచిత ఆసనం ఏర్పరుచుకుని కూర్చోవాలి అని చెప్పాను కదా!అప్పుడు శరీరం,మెడ,శిరస్సు ఒకే లంబంలో ఉంచాలి.నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే...కొంచెం మంది గూని లాగా ముందరకు వంగుతారు.లేకపోతే జారగిల పడతారు.అసలు పద్మాసనం వేసుకుంటారో,లేదో?కూర్చున్న తరువాత పక్కన ఏముంది?వెనక ఏమి జరుగుతుంది అని యావకు అటూ ఇచూ చూస్తుంటారు.అట్లా అంతా వేషాలు వేయకూడదు.కదలకుండా,చలన రహితంగా ఉండాలి.దిక్కులు చూడకుండా,చూపును ముక్కు కొన...అదే నాసికాగ్రం పైనే కేంద్రీకరించాలి.అర్థమయిందా?
Friday, 24 July 2026
త త్త్రైకాగ్రం మనః కృత్వా
తత్త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః।
ఉప విశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్థయే॥12॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి సముచిత ఆసనం ఎలా తయారు చేసుకోవాలో చెప్పాడు కదా!ఇప్పుడు ఇంక అసలు వ్యవహారం గురించి చెబుతున్నాడు.అర్జునా!బావా!ఇప్పుడు నీకు యోగము చేసుకునేదానికి ఆసనం ఎలా ఉండాలి అని వివరించాను కదా!ఇప్పుడు అసలు కథ లోకి వస్తాము.యోగాసక్తుడు ఆ ఆసనం మీద స్థిరంగా కూర్చోవాలి.ఇంద్రియ కర్మలను నిరోథించాలి.మనసును ఏకాగ్ర చిత్తంతో నిలపాలి.అంటే భగవంతుడు తప్ప ఇంకో ధ్యాస ఉండకూడదు.చిత్తవృత్తి నిరోధాసక్తడు కావాలి.అంటే ఏమీ లేదు బావా!మనం గమ్మున కూర్చుని ఉంటే ఏమి చేస్తాము?ఇప్పుడేదైనా మంచిగా తింటే బాగుండు.లేక పోతే బాగా మంచి నిద్ర వేస్తాము.అదీ లేకపోతే ప్రక్కన వాళ్ళతో పనికిరాని మాటలు,యవ్వారాలు చేద్దాము అనిపిస్తుంది కదా!అట్లా మనసు చంచలం కాకుండా,ఏ కర్మల జోలికి పోకుండా ఉండాలి.ఒకరకంగా చెప్పాలంటే నిర్వికారంగా ఉండడం అభ్యాసం చేసుకోవాలి.అప్పుడు ఇంక యోగాభ్యాసానికి ఓంకారాలు,శ్రీకారాలు చుట్టాలి.
Thursday, 23 July 2026
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిర మాసన మాత్మనః।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్॥11॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చిన్న చిన్న మెళకువలు,పాటించాల్సిన విషయాలు కూడా ఓపికగా,విసుగు లేకుండా చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను నీకు యోగాభ్యాసం చేయాలి అని చెప్పాను కదా!దానికి ఎలా అన్నీ సరి చూసుకోవాలో కూడా చెబుతాను,విను.మంచి శుభ్రమయిన ప్రదేశం ఎంచుకోవాలి.మరీ అంత ఎత్తు,మరీ అంత కురచగా లేని పీఠం ఎన్నుకోవాలి.దాని పైన దర్భలు వేయాలి.ఆ పైన జింక లేక పులి చర్మము పరవాలి.దాని పైన శుభ్రమయిన వస్త్రము పరవాలి.ఆసనమును ఇలా ఏర్పరుచుకోవాలి.
Tuesday, 21 July 2026
యోగీ యుంజీత సతతం
యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః।
ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః॥10॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగాభ్యాసం అనేది ఎలా చేయాలో చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!యోగాభ్యాసం అనేది ఎలా చేయాలో చెబుతాను,విను. కళ్ళకు ఇంపుగా కనిపించిందంతా ఇంటికి తెచ్చేసుకుందాము అనిపిస్తుంది కదా!ముందర అది వదులుకోవాలి.ఆశలను వదులుకోవాలి.ఇంద్రియాలను,మనస్సునూ మన స్వాథీనంలో ఉంచుకోవాలి.అవి చెప్పిన వాటికంతా గంగిరెద్దులాగ తల ఊపి,ముందూ వెనకా చూసుకోకుండా దూకడం కాదు.మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి.మనం పది మందిలో కూర్చుంటే ఏమవుతుంది?లోకాభిరామాయణం వినాల్సి వస్తుంది.మనసు చంచలం కదా!వాటన్నిటి పైకి మరలుతుంటుంది.ఈ ఝంఝాటకం అంతా లేకుండా,ఏకాంత వాసంలో యోగాభ్యాసం చెయ్యాలి.అప్పుడు మనసు ప్రలోభాలకు దూరంగా ఉండి,మనం అనుకున్న మార్గంలో పయనించగలతాము.
Monday, 20 July 2026
సుహృన్మిత్రా ర్యుదాసీన
సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే॥9॥6॥
శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సమతుల్యము,సమదృష్టి,సమబుద్ధి యొక్క ప్రాముఖ్యత మళ్ళీ,మళ్ళీ చెబుతున్నాడు.మన జీవిత విథానంలో దాని అవసరము నొక్కి వక్కాణిస్తున్నాడు.అర్జునా!ఓ కుంతీ పుత్రా!ఏంది?మా బావ ఊరికినే ఊదర గొడుతున్నాడు ఒకే విషయాన్ని అని అనుకోకు.మనిషి జీవితంలో సమతుల్యత,సమదృష్టి,సమబుద్ధి అనేవి లేకపోతే ఎంత ప్రమాదకరమో నీకు అర్థం కావాలని నా తపన.అవి లేక పోతే మన జీవితాలు అతలాకుతలం అవుతాయి.దుఃఖభాజనాలు అవుతాయి.మనిషిని మనిషిగానే చూద్దాము.వాడు శత్రువా,మిత్రుడా,రెంటికీ చెందని వాడా?ఎప్పుడూ ఉదాసీనంగా,దేనికీ స్పందించని రకమా?సహృదయంతో మనలను అర్థం చేసుకునేవాడా?బంధువా?సాథువా?లేక దుర్మార్గుడా?దుష్టుడా?ధూర్తుడా?ఎదుటి వాడు ఎవరైనా ఒకేరకంగా చూద్దాము.చూడడం నేర్చుకుందాము.అలా అందరి యందూ సమబుద్ధి గలవాడే యోగిశ్రేష్టుడు అనబడతాడు.శ్లాఘింపబడతాడు.
Sunday, 19 July 2026
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః॥8॥7॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి శ్రేష్ఠుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!ఇప్పుడే నీకు పరమత్మానుభవము అనేది ఎలా పొందవచ్చో చెప్పాను కదా!ఇప్పుడు మనం యోగి శ్రేష్ఠుడు ఎలా ఉండాలో చెప్పుకుందాము.అందరినీ,అంతటినీ సమాన దృష్టి తో చూసేవాడు,చూడగలవాడే యోగి అని నా అభిప్రాయము.ఉదాహరణకు కొన్ని చెప్పుకుందాము.మనము మాములుగా ఏమి చేస్తాము?మనకు తెలిసిన వాళ్ళు,మనకు ఇష్టమయిన వాళ్ళు,మనమంటే ఇష్షమయిన వాళ్ళు కనిపిస్తే?ఎగిరి గంతేసి,వాళ్ళ చంకన ఎక్కినంత పని చేస్తాము.అదే మనకు శత్రువులు,మనమంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు,మనకు ఎవళ్ళని చూస్తే కోపం,విసుగు,చీదర నషాళం అంటుతుందో..అలాంటి వాళ్ళు ఎదురైతే ఏమి చేస్తాడు?పొద్దున లేయగానే ఎవరి మొఖం చూసామో...ఈ చండాలం అంతా ఎదురుపడుతుంది అని అనుకుంటాము కదా!ఇక్కడే మనకు,యోగికి తేడా కొట్టొచ్చినట్లు కనపడేది.యోగి శత్రువు,మిత్రుడు,తటస్థంగా ఉండేవాళ్ళు,ఉదాసీనంగా ఉండేవారు,మంచి మనసు ఉండేవారు,బంధువులు,సాథువులు,దుర్మార్గులు,దుష్టులు...ఇలా ఎవరైనా సరే...అందరి విషయంలోనూ ఒకేరకమైన భావముతో ఉంటారు.అతి ప్రేమలు,అతి శత్రుత్వాలు మనసుకు అనుకోరు,స్పందించరు.అలాంటి వారినే శ్రేష్ఠమయిన యోగి అని అంటారు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము.జ్ఞానము,విజ్ఞానము యొక్క సహాయముతో మనిషి యోగి కావాలి.మట్టిని అయినా,రాయిని అయినా,బంగారాన్ని అయినా సమదృష్టితో చూడగలగాలి.స్థిరంగా అనగా కూటస్థంగా ఉండాలి.ఇంద్రియాలను జయించి,భగవద్భక్తిలో తరించిన వాడిని యుక్తుడు అని అంటారు.
Saturday, 18 July 2026
జితాత్మనః ప్రశాంతస్య
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః।
శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావ మానయోః॥7॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను నిగ్రహము అని చెప్పాను కదా!నిగ్రహము అంటే ఏమనుకుంటున్నావు?ఉదాహరణగా కొన్ని చెబుతాను,విను.అబ్బ చలి!అబ్బో ఎండ!అబ్బబ్బో ఉక్క!అనుకోకూడదు.బయట పరిస్థితి ఎలా ఉన్నా సహించడము నేర్చుకోవాలి.విసుకులు,అలకలు మానాలి.సుఖాలు వస్తే ఎగిరెగిరి పడడం..।అదే దుఃఖాలు,కష్టాలు వస్తే మూలన కూర్చొని కుమిలి కుమిలి ఏడవడం మానేయాలి.గుండెను దిటవు పరుచుకుని,ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనగలగాలి.ఎవరైనా మనలను ఆహా!ఓహో!అంటూ అందలం ఎక్కించితే ఆకాశపుటంచులను తాకడం,అదే ఎవరి చేత అయినా అవమాన పరంపరలు ఎదురైతే అథఃపాతాళానికి కూరుకు పోవడం మానాలి.ఇదంతా ఎప్పుడు జరుగుతుందో చెప్పేదా?మన పైన ,మన నడవడిక పైన,మన నిగ్రహం పైన మనకు నమ్మకం ఉన్నప్పుడు జరుగుతుంది.మనము ప్రతిఫలాపేక్ష లేకుండా,లోక హితము కోసరము ఉంటే ఇవేవీ పట్టించుకోము.
ఈ బాహ్యపరమయిన విషయాలకు చలించకుండా మనిషి ఉండగలగాలి.ఆత్మ నిగ్రహము అలవరుచుకోవాలి.శాంత చిత్తముతో ఉండాలి.అప్పుడు మానవుడు పరమాత్మానుభవము పొందగలుగుతాడు.
Friday, 17 July 2026
బంధురాత్మాఽఽత్మనస్తస్య
బంధురాత్మాఽఽత్మనస్తస్య యే నాత్మై వాత్మనా జితః।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాఽఽత్మైవ శత్రువత్॥6॥6॥
శ్రీమద్భగవద్గీత....ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ వ్యవహారము గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఏదైనా అర్థం చేసుకునే తపన ఉంటే సులభంగా అర్థం అవుతుంది.రెండు ఒకట్ల రెండు,రెండు రెళ్ళ నాలుగు అవుతుంది కదా?కానీ దీంట్లో ఏందో మతలబు ఉంది అని ఏమేమో ఆలోచించామనుకో,లెఖ్ఖ తప్పుతుంది.ఇక్కడ కూడా అంతే!నిగ్రహపరులకు,సన్మార్గంలో నడచేవారికి ఆత్మ ఆత్మ బంధువు అవుతుంది.నిగ్రహం లేని వారికి,ఒక దారీ తెన్నూ లేకుండా,ఎటు పడితే అటు పోయేవాడికి..।ఇదే ఆత్మ శత్రువు అవుతుంది.కాబట్టి మన ఆత్మ మనకు మంచి మిత్రువా,శత్రువా అనేది మనమే తేల్చుకోవాలి.
Thursday, 16 July 2026
ఉద్ధరేదాత్మనాఽఽత్మానం
ఉద్ధరేదాత్మనాఽఽత్మానం నాత్మాన మవసాదయేత్।
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః॥5॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు విషయం చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నీవు ఎప్పుడూ ఈ భ్రమలో ఉండొద్దు.ఎవరో వస్తారు,మనకు ఏదో చేస్తారు.మనలను ఉద్ధరిస్తారు.గట్టున పడేస్తారు అని.ఎందుకంటే మార్పు అనేది మనలో నుంచి రావాలి.చలనం మనలో కలగాలి.ఎంత సేపూ ఎవ్వడూ చో...చో...అంటూ మనలను ముందుకు నెట్టడు.ఎవరైనా గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకెళ్ళగలరు కానీ దాని చేత నీరు త్రాగించలేరు కదా!కబట్టి ఈ సంసారం నుంచి ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి.ఊరికినే కూర్చుని రా..।రా..।అంటే ఏదీ రాదు.పతనం కాకుండా ఉండాలంటే మన వంతు ప్రయత్నం కూడా ఉండాలి కదా!ఆత్మకు ఆత్మనే బంథువు.మనం నియంత్రణలో పెట్టుకోకపోతే అదే మనకు శత్రువు అవుతుంది.
Wednesday, 15 July 2026
యదా హి నేంద్రియార్థేషు
యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే।
సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్త దోచ్యతే॥4॥6॥
శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు...ఫలాపేక్ష వీడకుండా యోగములో మనము ముందుకు పోలేము.నిజానికి అదే మొదటి మెట్టు.అర్జునా!ఓ పార్థా!సంకల్పము అంటే ఒక పని చేయాలనే బలమయిన కోరిక.ముందర ఆ తపన మనము వదల గొట్టుకోవాలి.ఇంద్రియ విషయాలకు సంబంథించి మోహము పనికిరాదు.వాటి పరమయిన కర్మలను చేయాలి అనే ఆవేశము విడనాడాలి.అలా అన్ని కోరికలనూ,సంకల్పాలను వదిలి వేయగలిగిన నాడే మనము యోగారూఢులము అని చెప్పబడతాము.
ఆరురుక్షో ర్మునే ర్యోగం
ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే।
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే॥3॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...
శ్రీ కృష్ణుడు అర్జునుడికి యోగంలో మెళకువలు చెబుతున్నాడు. అర్జునా!మనము ఇప్పుడే యోగము,సన్న్యాసము గురించి మాట్లాడుకున్నాము కదా!మనము యోగాభ్యాసము చేయాలని ముందర సంకల్పించుకోవాలి.మొదట్లో,మొదట్లో...అదే ప్రాథమిక దశలో కర్మయే సాథనమవుతుంది.కొంచెం బండి ముందరకు వెళితే,ఆ తరువాత శమము సాథనమవుతుంది.శమము అంటే ఏంది అని తత్తర బిత్తర కానక్కరలేదు.శమము అంచే నివృత్తి.అంటే యోగాసక్తి ఉన్నవారు ముందర ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించడం అలవాటు చేసుకోవాలి.అలా ఆ అలవాటు జీవన విథానము అయి,మనసు పరిశుద్థం అవుతుంది.అప్పుడు జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకుని,ప్రశాంతంగా ధ్యానము లోకి వెళ్ళవచ్చు.ముందర ఆ సాథన లేక పోతే అభాసుపాలు అవుతాము.కళ్ళు,ముక్కు మూసుకుని ధ్యాన ముద్రలో కూర్చోవడానికి ఏమి?హాయిగా కూర్చుంటాము.కళ్ళు మూసుకున్నా,మన కోరికలు,ఆశలు తూనీగల్లాగ మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి.మనిషిని,మనసును ప్రశాంతంగా ఏ పనీ చేసుకోనివ్వవు.
Tuesday, 14 July 2026
యం సన్న్యాస మితి ప్రాహుః
యం సన్న్యాస మితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ।
న హ్య సన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన॥2॥6॥
శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము....
శ్రీకృృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్దునా!ఓ పాండవా!సన్న్యాసి అన్నా,యోగి అన్నా ఒకటే!సన్న్యాసము,యోగము అంటే దీక్ష అనే కదా!ఒక ప్రక్క లోకంలో ఉండేవన్నీ మనకే కావాలనుకుంటాము...ఇంకో ప్రక్క సన్న్యాసులలో కలసిపోతాము,యోగీశ్వరులము అయిపోతాము అని డంబాలు చెబుతే ఎట్లా కుదురుతుంది,చెప్పు?సంకల్పాలను వదలలేనివాడు,సన్న్యసించలేని వాడు ఎప్పటికీ యోగి కాలేడు,కానేరడు.
Sunday, 12 July 2026
అనాశ్రితః కర్మఫలం
శ్రీ భగవానువాచ...
అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చా క్రియః॥1॥6।
ఆత్మ సంయమ యోగము...షష్ఠోఽధ్యాయః...
భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!పార్థా!సన్న్యాసి అంటే ఎలా ఉంటాడో చెబుతాను,విను.నిజమయిన సన్న్యాసి కర్మ ఫలాన్ని ఎప్పుడూ కోరడు.కానీ అట్లా అని కర్మలు చేయడం ఆపడు.తను ధర్మబద్ధంగా చేయవలసిన కర్మలు అన్నిటినీ ఆచరిస్తాడు. అతడే యోగి.కర్మలు త్యజించినంత మాత్రాన ఎవరూ సన్న్యాసి అవడు.అగ్నిహోత్రాది కర్మలు వదిలి పెట్టడం ఒక్కటే చాలదు.ప్రతిఫలాపేక్ష లేకుండా మనగలగాలి.
భోక్తారం యజ్ఞతపసామ్
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్।
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి॥29॥
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్న్యాస యోగో నామ పంఞ్చమోధ్యాయః...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు రహస్యం చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను నిన్ను ఇంతలా కార్యోన్ముఖుడిని చేసేదానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానో అర్థమవుతుందా?నిజంగా అసలు నేను ఎవరో,ఏందో చెప్పాలనే చిన్న ఆశ.విను.తపస్సులకు,యాగాలకు నేనే భోక్తని.సర్వలోకాలకూ నేనే అథిపతిని.దైవాన్నీ నేనే!సర్వభూతహితుడనూ నేనే!నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు.
ఇట్లు ఉపనిషత్తులు,బ్రహ్మ విద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జునుల సంవాద రూపమయిన భగవద్గీతలోని కర్మ సన్న్యాస యోగము అను ఐదవ అధ్యాయము సమాప్తము...
Friday, 10 July 2026
స్పర్శాన్ కృత్వా
స్పర్శాన్ కృత్వా బహి ర్బాహ్యాం శ్తక్షుశ్చైవాంతరే భ్రువోః।
ప్రాణా పానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ॥27॥
యతేంద్రియ మనోబుద్ధి ర్మునిర్మోక్ష పరాయణః।
విగతేచ్ఛా భయక్రోధో య స్సదా ముక్త ఏవ సః॥28॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి నిత్యముక్తుడు ఎలా ఉంటాడు,ఎప్పుడు అవుతాడు అనేది వివరిస్తున్నాడు.అర్జునా!కౌంతేయా!మోక్షము కావాలంటే మనం ఏమి చేయాలి చెప్పు?మనం నిత్య ముక్తులం ఎప్పుడు అవుతాము?జ్ఞాన మార్గంలో గమ్యం ఎలా,ఎప్పుడు చేరతాము?వీటన్నిటికీ సమాథానం చెబుతా, విను.మొదట ప్రపంచిక విషయాల పైన మోజు వదిలెయ్యాలి.వాటి జోలికి పోకూడదు.వాటి ఊసే వదిలెయ్యాలి.మన దృష్టిని భ్రూమధ్యమందు ఏకాగ్రం చేసి,కేంద్రీకరించాలి.అటు పైన ముక్కున సంచరించే ప్రాణాపానాది వాయువులను సమబద్దీకరణ చేయాలి.ఇప్పుడు ఇంక అసలు కథ మొదలవుతుంది.కనుబొమల మధ్యన దృష్టి సారించడం,ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు క్రమబద్ధీకరించడం ఒక ఎత్తు.మనసును,బుద్ధిని,ఇంద్రియాలను మన పట్టులో పెట్టుకోవాలి.స్వాథీన పరుచుకోవాలి,మన నియంత్రణలో పెట్టుకోవాలి.కనిపించిందంతా కావాలి అనే కోరికలను,భయం,కోపం,తాపం,తామసం లాంటి వాటిని అన్నిటినీ విడిచి పెట్టి,నిర్మలంగా తయారు కావాలి.అట్లా మోక్షాసక్తుడు అయిన జ్ఞాని నిత్యముక్తుడు అవుతాడు.అర్థమయిందా,అర్జునా!
Wednesday, 8 July 2026
కామక్రోధ వియుక్తానాం
కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్।
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్॥26॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ,తిప్పి తిప్పి ఒకటే చెబుతున్నాడు.అదే ఆత్మ జ్ఞానం ఎలా సంపాదించాలి అనే విషయం!
అర్జునా!ఓ బావా!ఆత్మ జ్ఞానులు అయిన యతులు సర్వత్రా బ్రహ్మానందాన్నే పొందుతారు.ఎందుకంటావు?నేనే చెబుతాను,విను.వాళ్ళు కామక్రోధాలను వదలి పెడతారు.అదే విసర్జిస్తారు.మనసును చంచలంగా కాకుండా,అదుపులో పెట్టుకుని,నిగ్రహించుకుంటారు.భగవంతునికే సర్వం అర్పిస్తారు.అందుకనే వాళ్ళకు ఏదైనా సాధ్యమవుతుంది.మోక్షానికి చేరువవుతూ వస్తారు.
Tuesday, 7 July 2026
లభంతే బ్రహ్మ నిర్వాణం
లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయః క్షీణకల్మషాః।
ఛిన్నద్వైధా యతాత్మాన స్సర్వభూతహితే రతాః॥25॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మతత్త్వము అనేది ఆషామాషీ వ్యవహారము కాదు అని చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను రెండు ముక్కల్లో చెబుతుంటే నీకు అంతా సునాయాసంగా అనిపిస్తున్నది కదా!ఎంత మాత్రం కాదు,అర్జునా!మనిషి ముందర పాపాలను నశింప చేసుకోవాలి.దీనినే క్షీణ కల్మషాః అని అంటారు.నిస్సందేహీ,జితేంద్రియుడూ కావాలి.ద్వంద్వాలకు తావు ఇవ్వకూడదు.అదే సుఖదుఃఖాలు,ఎత్తుపల్లాలు,లాభ నష్టాలు,సందేహాలు.మనిషి భ్రమలలో,భ్రాంతులలో బతుకకూడదు.నిత్యాన్ని,సత్యాన్ని స్వీకరించగలగాలి.దీనినే ఛిన్నద్వైధా అని అంటారు.ఎల్లప్పుడూ లోక హితమూ,లోక కళ్యాణమూ కోరుకోవాలి.అనంత జీవకోటినీ ప్రేమించి,అక్కున చేర్చుకోవాలి.చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకునే సంకుచితం నుంచి బయట పడాలి.అలాంటి వాడికి బ్రహ్మతత్వం,మోక్షము లభిస్తుంది.
Monday, 6 July 2026
యోన్త స్సుఖోఽంతరారామ
యోన్తస్సుఖోఽంతరారామ స్తథాంతర్జ్యోతి రేవ యః।
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోఽధి గచ్ఛతి॥24॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ తత్త్వం పొందగలిగే మార్గం చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!మనము బాహ్య ప్రపంచం,బాహ్య సుఖాలకు అతీతంగా ఉండగలగాలి.ఆత్మ యందే సుఖించాలి.అంతరారామః అంటే ఆత్మ యందే రమించడం,అంటే విలీనమయిపోగలగాలి.అంతర్జ్యోతి అనగా స్వచ్ఛంగా మన మనసులను ఉంచుకోగలిగినపుడు ఆత్మ జ్ఞానంతో స్వయంప్రకాశం చెందుతుంది.అలాంటి యోగము సాథన చేసిన యోగి బ్రహ్మకు ప్రియుడు అవుతాడు.అలాగే బ్రహ్మ తత్త్వాన్ని,మోక్షాన్ని పొందుతున్నాడు.
శక్నోతీహైవ యస్సోఢుం
శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్।
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః॥23॥5॥
శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!పండితుడు కావడం,బ్రహ్మవేత్త కావడం అనేది అనుకోగానే అయిపోము.చిటికేస్తే అయిపోము.దానికి నిరంతర సాథన కావాలి.ప్రణాళిక కావాలి.నిబద్ధత కావాలి.చాలా సార్లు ఆ పయనంలో ఒక జన్మ సరిపోదు.దీక్ష,దక్షత,సమత్త్వం,అకుంఠిత సాథన అవసరము.కాబట్టి నేను నీకు చెబుతున్నాను.ఎవడైతే తన నిర్యాణం ఆసన్నం అయ్యేలోపల కామక్రోథాలను పగ్గాలు వేసి నియంత్రణలో పెట్టుకుంటాడో వాడే యోగి.మనఃచాంచల్యాన్ని అరికట్టగలవాడే అసలు సిసలైన యోగి.అతనే ఆత్మానందంతో సర్వసుఖాలూ పొందుతాడు.ఆత్మజ్ఞానము,ఆత్మతృప్తి మోక్షానికి మొదటి మెట్లు.
Sunday, 5 July 2026
యే హి సంస్పర్శజా
యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః॥22॥5॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!అజ్ఞాని అంటే ఎవడు చెప్పు?జ్ఞానము లేని వాడు కదా!జ్ఞానము అంటే ఏంది?జ్ఞానము అంటే ముందు వెనక తెలిసి ఉండడము.పూర్వాపరాలు ఎరిగి ఉండము.తొందరపాటు లేకుండా ఉండడము.స్థిత ప్రజ్ఞత కలిగి ఉండడము.బాహ్య సుఖాలకు కాక ఆత్మ సంతృప్తికి పెద్దపీట వేయగలగడము.
ఇంద్రియ సుఖాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే మబ్బులు లాంటివి.మన జీవితం లోకి వచ్చి,అలానే కలకాలం తిష్ఠ వేసుకుని కూర్చోవు.ఉన్నప్పుడు ఎగిరెగిరి పడడం మామూలే!అవి లేనప్పుడు కుమిలి కుమిలి ఏడవడం ఇంకా మామూలే!దీని అర్థం ఏమిటి?ఇంద్రియ సుఖాలు తాత్కాలికమయినవి.చివరకు వచ్చేటప్పటికి దుఃఖ కారకాలుగా పరివర్తన చెందుతాయి.కాబట్టి జ్ఞాని అనేవాడు ఏమి చేస్తాడు?ఈ ఒడిదుడుకులు,ఎత్తుపల్లాలు నాకు అఖ్ఖరలేదు అనే నిర్ణయానికి వస్తాడు.ఈ చంచలమయిన సుఖాలూ వద్దు..।తదుపరి వెన్నంటి వచ్చే దుఃఖాలూ వద్దనే వద్దు అనుకుంటాడు.నిజమే కదా!
Saturday, 4 July 2026
బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా
బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా విందత్యాత్మని య స్సుఖమ్।
స బ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే॥21॥5॥
శ్రీమద్భగవద్గీత..।కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మతృప్తి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇప్పుడే మనము బ్రహ్మవేత్త,పండితుడు గురించి తెలుసుకున్నాము కదా!అలాంటివాడికి బాహ్య ప్రపంచంతో సంబంథం లేదు.ప్రతిదీ ఆత్మ సాక్షిగానే స్వీకరిస్తాడు.అతను అలౌకికమయిన ఆనందాన్ని,బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శిస్తాడు.మోక్షము అంటే దుఃఖానికి తావు లేనిది.అదే కదా ఆనంద నిలయం అంటే.ఇలాంటి బ్రహ్మవేత్తలు శాశ్వత ఆనందాన్ని,బాహ్య ప్రపంచంతో సంబంథం లేకుండా పొందగలతారు.ఆస్వాదించగలతారు.
న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య
న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియమ్।
స్థిరబుద్థి రసమ్మూఢో బ్రహ్మవి ద్బ్రహ్మణి స్థితః॥20॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!పండితుడు అనేవాడు అన్నింటినీ సమదృష్టితో చూస్తాడు అని చెప్పాను కదా,ఇప్పుడే!ఇప్పుడు బ్రహ్మవేత్త,బ్రాహ్మణుడు గురించి చెబుతాను.సుఖాలకు ఎగిరెగిరి పడడం మన ఆనవాయితీ కదా!అదే కష్టం వస్తే..నాకే ఎందుకు ఇలా అంటూ విల విల లాడి పోవడం మన పోకడ,నైజం.కానీ స్థిర బుద్ధి కలవాడు ఎలా ఉంటాడో చెబుతాను ,విను.అతను సుఖమయినా,దుఃఖమయినా ఒకేలాగ స్పందిస్తాడు.ఒక మాటలో చెప్పాలంటే నిర్వికారంగా ఉంటాడు.అంటే గండ పెండేరం తొడిగినా ఒకేలాగ ఉంటాడు.గంజి నీళ్ళు ముఖాన కొట్టినా అలాగే ఉంటాడు.అంటే అతిశయమయినా,అవమానమయినా,ఆనందమయినా..ఆవేదన అయినా ఒకేలాగ స్వీకరిస్తాడు.అంతా భగవంతుడి ప్రసాదమే అనుకుంటాడు.అతడినే బ్రహ్మవేత్త..బ్రాహ్మణుడు అని అంటారు.
Tuesday, 30 June 2026
ఇహైవ తైర్జిత స్సర్గో
ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః॥19॥5॥
శ్రీమద్భగవద్గీత...।కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు పండితుడు అనే వాడు ఎలా ఉండాలి అని చెప్పాను?పండితుడు అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు,ఇలా ఎంత తారతమ్యము ఉన్న ప్రాణి అయినా...అన్నిటి యందు,అందరినీ సమదృష్టితో చూస్తాడు,ప్రవర్తిస్తాడు అని కదా!
అలాంటి పండితుడు ఈ జన్మలోనే సంసరాన్ని జయించిన వాడు అవుతాడు.అందరినీ,అంతటినీ సమంగా చూసేవాడు ఖచ్చితంగా సర్వ సమమయిన పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు.అంటే కైవల్యం పొందుతాడు.ఇంతకంటే ఇంకేమి కావాలి,ఈ మానవ జన్మకు?
Monday, 29 June 2026
విద్యా వినయ సంపన్నే
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని।
శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః॥18॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి సమానత్వం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!చీమనైనా,దోమనైనా..।మనిషినైనా,మృగాన్ని అయినా సృష్టించేది ఆ పరమాత్మే కదా!మనష్యులలో తేడాలు ఆయన కల్పించిన మాయ ద్వారానే కదా!అలాంటప్పుడు అందరూ సమానమే కదా!అమ్మ మనస్తత్త్వం ఎలా ఉంటుంది?పది మంది పిల్లలు ఉంటే అందరూ ఒకేలాగ ఉండరు కదా!కానీ అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది కదా!ఒకడికి చీమిడి ముక్కులు కారుతున్నాయి అని అసహ్యించుకోదు.తన పమిటతోనే తుడుస్తుంది దగ్గరకు తీసుకుని.మెతకగా ఉండే బిడ్డకు ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తుంది.తులవగా ఉండే బిడ్డను గదమాయించి,ఆపుతుంది.ఏ బిడ్డకు,ఎప్పుడు ఏమి కావాలో,ఏమి ఇవ్వాలో అమ్మకు తెలుసు.
ఎక్కడో ఉండే దేముడు,ఇక్కడే ఉండే అమ్మ బిడ్డలను సమానంగా చూస్తున్నారు కదా!మనకేమి అంత బాథ అందరినీ సమానంగా చూసేదానికి?
అలా అందరినీ,అంతటినీ సమానంగా చూడగలిగే వాడే పండితుడు.అర్జునా!ఉదాహరణకు చెబుతున్నాను.విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు...ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవినీ సమదృష్టితో చూస్తాడు పండితుడు.మనమూ అలా ఎందుకు ఉండకూడదు?
Sunday, 28 June 2026
తద్బుద్ధయ స్తదాత్మానః
తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః।
గచ్ఛ న్త్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి దిశానిర్దేశం యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాడు.అర్జునా!బావా!మనము మన జీవితంలో నిర్దిష్టమయిన ప్రణాలికలు పెట్టుకోవాలి.వాటి ఆచరణ కోసరం మనసా,వాచా,కర్మణా పాటు పడాలి.అప్పుడే మనం గమ్యము చేరుకోగలతాము.లేక పోతే చిల్లర గాలికి కూడా పుల్లాకు ఎలా ఎగిరిపోతుంది?ఒక గమ్యం లేకుండా,ఒక దిశా నిర్దేశం లేకుండా!ఎక్కడ,ఎలా పడుతుందో దానికే తెలియదు.అట్లా అయిపోతాయి మన బ్రతుకులు.
కాబట్టి ఓ పార్థా!ముందర బ్రహ్మ జ్ఞానము పైన ఆసక్తి పెంచుకుందాము.అలా అయితే మనం మన బుద్ధినీ,మనసునీ పరమాత్మ యందే నిలపగలతాము.చిన్నగా పాపపుణ్యాలను మన వశంలో పెట్టుకోగలగాలి.అంటే చెడు చేయకుండా నియంత్రించు కోవడము,మంచిని స్పూర్తితో చేయగలగడము.అప్పుడే జన్మరహితమయిన మోక్షాన్ని పొందగలము.
Saturday, 27 June 2026
జ్ఞానేన తు తదజ్ఞానం
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః।
తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్॥16॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!జీవులు స్వతహాగా ఏమీ చేయరు.కానీ వారి వారి జ్ఞానాన్ని అజ్ఞానం అనే నల్ల దుప్పటి కప్పేస్తుంది.దానిలోనుంచి చూస్తే ఏమవుతుంది?జ్ఞానమనే స్వచ్ఛమయిన తెల్లటి వెలుగు అంతా నల్లనల్లగా,అస్పష్టంగా బూజర బూజరగా కనిపిస్తుంది.అమాయకుడైన ప్రాణి అదే నిత్యమూ,సత్యమూ అనుకుంటాడు.కానీ ఆ దుప్పటి పక్కకి తీసి చూద్దాము అనే స్పృహ ఉండదు.
కానీ ఆత్మజ్ఞానము పొందాలంటే ముందర అజ్ఞానము పటాపంచలు కావాలి.పూర్తిగా నాశనము కావాలి.అప్పుడు మాత్రమే మానవుడికి సూర్యసదృశమూ,అనంతకోటి వెలుగుల సమాహారము అయిన పరమాత్మ దర్శనం లభ్యమవుతుంది.
Friday, 26 June 2026
నా దత్తే కస్య చి త్పాపం
నా దత్తే కస్య చిత్పాపం న చైవ సుకృతం విభుః।
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జంతవః॥15॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.
శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుమానాలకు తావు లేకుండా ఉండేదానికోసరం శత విథాలా ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటా!ఇప్పుడే నీకు చెప్పాను కదా!కర్మ,కర్తృత్వం,తత్ఫలం అనేవి ఆత్మ ప్రేరేపణలు కావని.వాటినన్నిటినీ మాయ చేయిస్తుందని.
ఇది నేను ఎందుకు చెప్పానో,ఆలోచించు.ఎందుకంటే ఆత్మ నిర్వికారమయినది.నిర్మోహం కలది.దానికి ఎలాంటి పాపాలతో కానీ,ఇంకెలాంటి పుణ్యాలతో కానీ సంబంధం ఉండదు.మరి మెలిక ఎక్కడ వస్తుందో చెబుతాను,చూడు.జీవులు యొక్క మస్తిష్కం జ్ఞానం,అజ్ఞానం అనే మాయలో కప్పబడి ఉంటాయి.కాబట్టి వారు భ్రమలో,భ్రమలలో బతుకులు సాగదీస్తుంటారు.మన పూర్వ జన్మల వాసనలు బట్టి మన ఆలోచనలు,ఆచరణలు ఉంటాయి.మనము మంచి దారిలో ముందుకు పోవాలంటే ఆ దిశగా కష్టపడాలి.చెడిపోవాలంటే ఒక్క క్షణం కూడా పట్టదు.జారుడు బండల పైన కాలు పెట్టినట్లే!చాలా సులువు.
Thursday, 25 June 2026
న కర్తృత్వం న కర్మాణి
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః।
న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే॥14॥
శ్రీమద్భగవద్గీత..కర్మ సన్న్యాస యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!చీటికీ,మాటికీ ఆ భగవంతుడు కారణం అని నింద తగదు.అయిన దానికీ,కాని దానికీ,చిన్న విషయానికి,పెద్ద విషయానికీ మాములుగా మనుష్యులు ఆ దేవుడు మీద తప్పంతా వేస్తుంటారు.కానీ అన్ని సమయాలలో అది సత్యం కాదు.ఎందుకంటావా?చెబుతాను,విను.
మనము కర్మ,కర్తృత్వం,కర్మఫలం అనే మాటలు చెప్పుకున్నాము కదా ఇందాకటి దాకా.అవి అన్నీ పరమాత్మ ప్రమేయంతో జరగడం లేదు.అవన్నీ జీవుల స్వభావము,ప్రకృతి గుణాల వలన జరుగుతుంటాయి.అంటే ప్రధానంగా మాయయే ఆ పని చేస్తుంటుంది.ఉదాహరణకు సాత్త్వికుడు సాత్త్వికంగా ఆలోచించి,మంచి పనులు చేస్తాడు.అలానే రజోగుణము,తామస ప్రవృత్తి గలిగిన వారు వారి వారి స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు.ఈ మాయ సృష్టి కర్త ఆ భగవంతుడే!కానీ అతను వాటన్నిటికీ దూరంగా,అంటనట్లు ఉంటాడు.
Wednesday, 24 June 2026
సర్వ కర్మాణి మనసా
సర్వ కర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ।
నవ ద్వారే పురే దేహే నైవ కుర్వ న్న కారయన్॥13॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్కాస యోగము.
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కదా!చెప్పు చూద్దాం!నేనే చెబుతాలే,విను.అవి రెండు కళ్ళు,రెండు చెవులు,రెండు ముక్కు రంధ్రాలు,నోరు,మల,మూత్ర విసర్జన ద్వారాలు.సరేనా!మన శరీరమే ఒక నగరం అనుకో!అప్పుడు తనను తాను మానసికంగా నిగ్రహించుకున్న యోగి ఆ నగరంలోనే సుఖ శాంతులతో జీవనం గడుపుతాడు.శ్రీరామా అంటూ తాను ఏ కర్మల జోలికీ పోడు.వేరే వాళ్ళనీ పొమ్మని చెప్పడు.ఇలాంటి క్రియలకు అంతా ఆత్మనిష్ఠ,నియమము,నియంత్రణ,నిగ్రహము కావాలి.
Tuesday, 23 June 2026
యుక్తః కర్మఫలం త్యక్త్వా
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్।
అయిక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే॥12॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి కొత్త కొత్త పదాలు ఆవిష్కరిస్తున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు ఇప్పుడు నైష్ఠికుడు గురించి చెబుతాను.ఒక మనిషి అచంచల దీక్ష,నియమము,నిబద్ధతతో తను పెట్టుకున్న వ్రతాలు,సిద్థాంతాలు,నియమాలు ఆచరించాలి.ఎక్కడా తడబడకూడదు.వేరేవాటిపైన దృష్టి పెట్టకూడదు.ధర్మశాస్త్రాలు,ఆశ్రమ ధర్మాలు తూచా తప్పకుండా ఆచరించాలి.అలాంటివారిని నైష్ఠికులు అని అంటారు.
నైష్ఠికులు ఫలాపేక్ష లేకుండా కఠినమయిన నియమ నిబద్థతలతో,జీవిత ప్రామాణాలతో జీవనం కొనసాగిస్తారు.అలాంటి మానసిక,శారీరిక పట్టుదలతో కర్మలను ఆచరిస్తారు.కాబట్టే శాంతి పొందుతారు.అదే ఎక్కడ మోహం,కోపం,తాపం,తామసం కూడుతాయో,అక్కడ మానవుడు ఫలాపేక్షకు బందీ అవుతాడు.ఇంకేమి ఉంది?గానుగకు కట్టిన ఎద్దులాగ అక్కడక్కడే తనుచేసే కర్మలకు,కర్మఫలాలకు బద్ధుడు అవుతాడు.సంసార బంథాలకు బానిస అవుతాడు,బాథితుడు అవుతాడు,తనను తానే బంథించుకుంటాడు.
Monday, 22 June 2026
కాయేన మనసా బుద్ధ్వా
కాయేన మనసా బుద్ధ్వా కేవలై రింద్రియైరపి।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా త్మశుద్ధయే॥11॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.బావా!అర్జునా!నేను చెప్పాను కదా యోగి అనేవాడు సంసారములో ఉన్నా చిత్తశుద్ధికోసమే కర్మలు చేస్తాడు అని.చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అన్నట్లు ఉండడు అని.మళ్ళీ మళ్ళీ అదే చెబుతున్నాను.యోగులు ఫలాపేక్షను వదలి పెడతారు.కర్తృత్వాహంకారాన్ని దరిదాపులకు కూడా రానివ్వరు.వారి మనసు,బుద్ధి,ఇంద్రియాల నన్నిటినీ మనసు పవిత్రంగా,నిర్మలంగా,సంతృప్తిగా ఉండడం కోసరమే కర్మలు చేస్తారు.
Sunday, 21 June 2026
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా॥10॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉదాహరణలు కూడా చెబుతున్నాడు...బాగా అర్థం కావాలని.ఆయన తపనకు జోహార్లు!అర్జునా!నాకు ఏమీ వద్దు,నాకేమీ అఖ్ఖర లేదు అనే స్థితికి మనము ఎప్పుడు వస్తాము?మనము సంతృప్తిగా ఉన్నప్పుడే కదా!ఆ సంతృప్తి మనకు ఇంద్రియ లాలస ఉన్నంత కాలము దక్కదు.మనము ప్రక్కవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తాము?వారికి మన దగ్గర ఉండేది ఎప్పుడు పంచుతాము?మన దగ్గర మనకు కావాలసిన దానికంటే ఎక్కువ ఉంటేనే కదా!మనకు అసలు ఏమీ అఖ్ఖర లేదు అంటే మనకున్నదంతా సంఘానికే కదా!
మనకై మనమే మనకున్నది ఇచ్చేస్తే,పంచేస్తే...మనము వాటి పైన మోహము వదులు కున్న వారము అవుతాము.ఎదుటి వారు అడగ కుండానే ఇస్తున్నాము కాబట్టి మనమేదో గొప్పవారము,ఏదేదో సహాయము చేస్తున్నాము అనే అపోహలకు,భావనలకు దూరం అవుతాము.మనస్పూర్తిగా,ప్రతి ఫలాపేక్ష లేకుండా చేస్తాము కాబట్టి సంతృప్తిగా ఉంటాము.వారు తిరిగి మనకు సహాయం చెయ్యాలని ఆశించము,ఆరాటపడము.
కాబట్టి ఓ పార్థా!అప్పుడు మనము తామరాకు పైన నీటి బొట్టులాగ అంటీ అంటనట్లు ఉంటాము.మనలను ఏ కర్మలూ బంథించలేవు.ప్రతిదీ ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నాము అనుకుంటూ చేస్తూ పోతే ఏ పాపాలూ మనకు దరి చేరవు.
Subscribe to:
Posts (Atom)