Friday, 31 July 2026

యదా వినియతం చిత్తం

యదా వినియతం చిత్త మాత్మన్యే వావతిష్ఠతే। నిస్స్పృహ స్సర్వ కామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా॥18॥6॥ శ్రీమద్భగవద్గీత.।..ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మమేకం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరత శ్రేష్ఠా!యోగాభ్యాసం ఎలా చేయాలి,ఎలా చేయకూడదు అని చెప్పాను కదా!మనసును అటలంగా పెట్టుకోవాలి.ధ్యాస నాపై నుంచి చెదరకూడదు.నాపై భక్తి శ్రద్ధలతో మమేకం అయిపోవాలి.ఎప్పుడూ మనసును ఆత్మయందే నిలపగలగాలి.కోరికలకు తిలోదకాలు ఇవ్వాలి.అలాంటి స్థితి చేరిన యోగి యోగముక్తిని పొందుతాడు.

No comments:

Post a Comment