Sunday, 12 July 2026

భోక్తారం యజ్ఞతపసామ్

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్। సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి॥29॥ ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్న్యాస యోగో నామ పంఞ్చమోధ్యాయః... శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు రహస్యం చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను నిన్ను ఇంతలా కార్యోన్ముఖుడిని చేసేదానికి ఎందుకు ప్రయత్నిస్తున్నానో అర్థమవుతుందా?నిజంగా అసలు నేను ఎవరో,ఏందో చెప్పాలనే చిన్న ఆశ.విను.తపస్సులకు,యాగాలకు నేనే భోక్తని.సర్వలోకాలకూ నేనే అథిపతిని.దైవాన్నీ నేనే!సర్వభూతహితుడనూ నేనే!నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు. ఇట్లు ఉపనిషత్తులు,బ్రహ్మ విద్య,యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జునుల సంవాద రూపమయిన భగవద్గీతలోని కర్మ సన్న్యాస యోగము అను ఐదవ అధ్యాయము సమాప్తము...

No comments:

Post a Comment