Sunday, 18 October 2026

పరస్తస్మాత్తు భావో…Parasthasmaaththu bhaavo

పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యకోఽవ్యక్తా త్సనాతనః। యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి॥20॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రకృతి,పరబ్రహ్మల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!బ్రహ్మ తనకు పగటి పూట సృష్టికి శ్రీకారము చుడతాడు,రాత్రికి విలయము సృష్టిస్తాడు అని చెప్పాను కదా!నీకు తెలుసా?ఈ ప్రకృతి అంటే అబ్బురంగా చూస్తాము కదా!కానీ దీనికంటే గొప్పది,మహిమాన్వితము అయినది ఇంకొకటి ఉంది.అదేందో చెప్పుకో,చూద్దాము?స్వామీ!తబ్బిబ్బు అవొద్దు.నేనే చెబుతాను.ప్రకృతి కంటే గొప్పదీ,పరమయినదీ,శాశ్వతమయిదీ ఇంకొకటి ఉంది.అదే పరబ్రహ్మ.బ్రహ్మకు రాత్రి అయితే సర్వభూతాలూ నశిస్తాయీ,తుడిచి పెట్టుకు పోతాయి అని చెప్పాను కదా!కానీ ఈ పరబ్రహ్మకు చీమ చిటుక్కు మన్నట్లు కూడా ఉండదు.ఎందుకంటే?చెప్పాను కదా!ఈ పరబ్రహ్మ నిత్యమూ,సత్యమూ,శాశ్వతమూ అని. Parasthasmaaththu bhaavoanyoavyakthoavyakthaa thsanaathanah/ Yassa sarveshu bhootheshu nasyathsu na vinasyathi//20//8// Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu... Sri Krishna is explaining Arjuna the difference between Nature ie Prakruthi and Parabrahma or Almighty.Arjuna!hey my dear friend!just few seconds back I told you that during day time of Brahma,Prakruthi ie nature is created and is in full boom and during his night time everything on this earth vanishes in a single sweep.Arjuna!do you know that there is a greater,mightier and everlasting thing in this universe?That is Parabrahma or the Omniscient.Even when the entire life is washed out,scraped and vanished,its presence is there.The only reason behind it is that it is undestroyable,nonperishable,everlasting and eternal.It has no birth,no death.It is the Prime.That is why it is called Parabrahma ie superior to Brahma and his creation.

Saturday, 17 October 2026

భూతగ్రామస్స….Bhoothagraamassa

భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే। రత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవ త్యహరాగమే॥19॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సృష్టిలయల గురించి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఇప్పుడే చెప్పాను కదా బ్రహ్మ పగలులో సృష్టి జరుగుతుంది,రాత్రికి ఆ సృష్టి మొత్తమూ వినాశనము అవుతుంది అని.సృష్టి అంటే తెలుసు కదా భూతసమూహము అని.అంటే జీవము పుట్టేది బ్రహ్మ పగలులో.బ్రహ్మకు రాత్రి అయ్యేటప్పటికి అంతా లీనము,విలీనము అయిపోతుంది.మొత్తము జీవమూ తుడిచి పెట్టుకుని పోతుంది.అంతా చీకటే!అంతా అంథకారమే!మళ్ళా బ్రహ్మకు రెండో రోజు మొదలు కాగానే మళ్ళీ జీవము నేనున్నాను అంటూ పురుడు పోసుకుంటుంది. Bhoothagraamassa yevaayam bhoothvaa bhoothvaa praleeyathe/ Raathryaagame avasah paardha prabhavathyaharaagame//19//8// Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu. Sri Krishna is explaining Arjuna about creation and destruction in more simpler manner.Arjuna!hey Pardha!I told you just now that creation is carried on during day time of Brahma and it undergoes destruction during his night time.Creation of What?I mean to say that it is creation of life.Entire life disintegrates and disrupts and dissolves into oblivion during Brahmas night time.Again,next day creation goes on uninterrupted showing its face that it is there thriving and full of spirit!

Friday, 16 October 2026

అవ్యక్తా ద్వ్యక్తయ…Avyakthaa dvyakthaya

అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవం త్యహరాగమే। రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే॥18॥8॥ శ్రీమద్భగవద్గీత..।అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మ పగలు అంటే ఏంది?రాత్రి అంటే ఏంది?అసలు అప్పుడు ఏమి జరుగుతుంది చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!బ్రహ్మ పగలు రాత్రి అనేవి మనకు వేల యుగాలు అని తెలిసింది కదా,నీకు.బ్రహ్మ పగలులో అవ్యక్త ప్రకృతి నుండి సృష్టి మొదలు అయి,కొనసాగుతుంది.మళ్ళీ రాత్రి అయింది అనుకో సృష్టి మొత్తమూ లయము అవుతుంది.అలా తిరిగి అవ్యక్తములోకి జారుకుంటుంది. Avyakthaa dvyakthaya ssarvaah prabhavam thyaharaagame/ Raathyaagame praleeyanthe thathraivaavyaktha sanjnake//18//8// Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu... Sri Krishna is explaining Arjuna regarding what happens during day time of Brahma and during night time of Brahma.Arjuna!hey Kireeti!I just told you that a single day and night of Brahma make up for thousans of ages for the mankind.Are you interested to learn about what Brahma does during his day and night?I will tell you.During day time creation of universe and life starts from unmanifested primordial nature and prospers.During Brahmas night,all the creation gets destroyed or nullified.Then automatically,it again disintegrates into oblivion and becomes one with unmaifested primordial nature.

Wednesday, 14 October 2026

సహస్ర యుగ పర్యంతం …. Sahasra yuga

సహస్ర యుగ పర్యంత మహర్యద్బ్రహ్మణో విదుః। రాత్రిం యుగ సహస్రాంతాం తేఽహోరాత్ర విదో జనాః॥17॥8॥ శ్రీమద్భగవద్గీత....అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడిని అన్ని విద్యలలో నిష్ణాతుడిని చేయాలనుకుంటున్నాడు.అందుకే ఓపికగా ప్రతి ఒక్క విషయమూ సమూలాగ్రంగా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ బావా!బ్రహ్మ,బ్రహ్మలోకము అనే పదాలు నేను వాడుతున్నాను కదా!వాటి గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా?ఊహూ?సరే,నేనే చెబుతాను,విను.మనకు పగలు పన్నెండు గంటలు,రాత్రి పన్నెండు గంటలు.రోజుకు ఇరవై నాలుగు గంటలు.అంతేగా?కానీ బ్రహ్మకు మన వేయి యుగాలు ఒక పగలు.అట్లా ఇంకో వేయి యుగాలు ఒక రాత్రి.ఈ సత్యము తెలుసుకున్న నాడు మానవుడు కాలవేత్త అయిపోయినట్లే!అంటే జ్ఞాన సముపార్జనలో ఒక అడుగు ముందుకు వేసినట్లే. ॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥ Sahasra yuga paryantha maharyadbramhano viduh/ Raathrim yugasahasraanthaam theaho raathra vido janaah//17//8// Sri madbhagavadgeetha....Aksharaparabrahma yogamu.... Sri Krishna is telling Arjuna so many new things.Arjuna!hey brother!do you know that thousand ages(yuga)make a day for Brahma?Similarly,another thousand ages make one night for Brahma?Person who realises this and acknowledges it becomes a saint and a scholar.

Tuesday, 13 October 2026

ఆ బ్రహ్మ భువనా…Aa Brahma bhuvanaa

ఆ బ్రహ్మభువనా ల్లోకాః పునరావర్తి నోఽర్జున। మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే॥16॥8॥ శ్రీమద్ భగవద్గీత..।।అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి భలే సులభంగా అర్థం అయ్యేటట్లు చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయ!నేను నీకు ఇప్పుడే చెప్పాను కదా!నన్ను నమ్మినవాడు చెడిపోడు.వాడికి పరమపదం దక్కడం తథ్యము అని.ఇంకో విషయం కూడా చెబుతాను,విను.బ్రహ్మలోక పర్యంతమూ జీవకోటికి పునర్జన్మలు ఉన్నాయి.కానీ...నన్నే నమ్ముకుని,నన్ను చేరినవారికి పునర్జన్మ అంటూ ఉండదు.కేవలము కైవల్యమే! Aa brahmabhuvanaa llokaah punaraavarthi noarjuna/ Maamupethya thu kountheya punarjanma na vidyathe//16//8// Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu... Sri Krishna is explaining Arjuna in an understandable way.Arjuna!hey Kountheya!I just told you now that no one suffers any loss once he comes under my protection.Up to the highest celestial realm,Brahmaloka,every living being passes through repeated births and deaths.But...one who comes under My protection and reaches Me with his devotion and dedication need not pass through many births and deaths because he attains Moksha.

Monday, 12 October 2026

మాముపేత్య ….Maamupethya

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్। నాప్నువంతి మహాత్మాన స్సంసిద్ధిం పరమాం గతాః॥15॥8॥ శ్రీమద్భగవద్గీత ...అక్షర పరబ్రహ్మయోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తనను నమ్ముకుంటే చేకూరే లాభాలు చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నీకు అనిపిస్తుంది కదా!ఈయనను నమ్ముకుంటే ఏంది లాభం అని.అది కూడా చెబుతాను,విను.ఈ లోకము అంతా ఏంది చెప్పు?అంతా దుఃఖ భూయిష్టమే కదా!ఏదీ శాశ్వతము కాదు కదా!అంతా అశాశ్వతమే కదా!నన్ను నమ్ముకున్నవాడు తిరిగి ఈ భూమి పైన జన్మించకుండా మోక్షము దక్కేలా చేస్తాను. Maamupethya punarjanma duhkhaalaya masaaswatham/ Naapnuvanthi mahaathmaana ssamsiddhim paramaam gathaah//15//8// Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu... Sri Krishna is explaining Arjuna,the benefits of believing in Him.Arjuna!hey Kireeti!you might be thinking that what is the use in believng Me.Right?I will tell you.Arjuna!you know that this world is full of misery and hardships.This is just temporary and nothing is permanent here.But I bless my devotee,who has immense faith in Me,not to be born here again.I let him achieve Paramapadam or Salvation.

Sunday, 11 October 2026

అనన్యచేతా…Ananya chethaa

అనన్య చేతా స్సతతం యో మాం స్మరతి నిత్యశః। తస్యాహం సులభః పార్థ నిత్య యుక్తస్య యోగినః॥14॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను చెప్పిన దాన్ని బట్టి నీకేమి అర్థం అయింది?నన్ను నమ్ముకోవాలి.నేను తప్ప ఇంక వేరే ఇతర ఆలోచనలు ఉండకూడదు బుర్రలో అని కదా!నిత్యం నన్నే స్మరించాలి.అట్లాంటి వారికే నేను సులభంగా దక్కుతాను. Ananya chethaa ssathatham yo maam smarathi nithyasah/ Thasyaaham sulabhah paardha nithya yukthasya yoginah//14//8// Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu.. Sri Krishna is explaining Arjuna.Arjuna!hey Pardha!what did you understand and assimilate from my preachings till now?One has to have belief in Me.I should be in his mind all the time.He should keep away all other thoughts except Me.He should give his entire life to Me...thinking,devoting and appealing and believing Me all the time.I am easily accessible to those devotees.