Saturday, 6 June 2026
యథైధాంసి సమిద్ధోఽగ్ని
యథైధాంసి సమిద్ధోఽగ్ని ర్భస్మసా త్కురుతేఽర్జున।
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా॥37॥4॥శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తున్నాడు.ఓ అర్జునా!హే పాండవ మథ్యమా!నీకు ఇంకా సులభంగా అర్థం అయ్యేటట్లు చెబుతాను.అగ్ని,అదే నిప్పు కట్టెలకంటుకుంటే ఏమవుతుంది?కట్టెలన్నీ కాలిపోతాయి కదా!ఒట్టి బూడిద మిగులుతుంది.అంతే కదా!ఇక్కడ కూడా అచ్ఛం అలాగే జరుగుతుంది.మనం చేసే కర్మలు,పాప కర్మలు అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో కాలి,భస్మం అయిపోతాయి.మనం స్వచ్ఛంగా బయటపడగలతాము.ఆ జ్ఞానాన్ని మనం వజ్రాయుథం లాగా మలుచుకుని జీవన సమరంలో విజయం పొంది,ముక్తి పొందగలము.
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete