Monday, 15 June 2026
జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ
జ్ఞేయ స్స నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి।
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధా త్ప్రముచ్యతే॥3॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా విఫులంగా వివరిస్తున్నాడు.అర్జునా!పార్థా!సన్న్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది?రాగ ద్వేషాలకు దూరంగా ఉండడమే కదా!అడవులకు వెళ్ళి,ముక్కు మూసుకుని,ఘోర తపస్సు చేస్తేనే సన్న్యాసం కాదు.ఎవడైతే కోప తాపాలకు,రాగ ద్వేషాలకు దూరంగా ఉంటాడో వాడే నిజమయిన సన్న్యాసి.
ముందు మనలో ఉండే ప్రేమ-ద్వేషం,ధైర్యం-భయం,సంతోషం-దుఃఖం...ఇలాంటి ద్వంద్వ భావాలకు స్వస్థి చెప్పాలి.అన్నిటినీ ఒకే రకంగా చూడగలగాలి,సమన్వయం చేసుకోగలగాలి.అలా అయితేనే మానవుడు కర్మ బంధాల నుంచి విముక్తి పొందగలడు,ముక్తి కి చేరువయి భవసాగరాన్ని సులభంగా దాటగలడు.
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete