Friday, 19 June 2026
యోగయుక్తో విశుద్థాత్మా
యోగయుక్తో విశుద్థాత్మా విజితాత్మా జితేంద్రియః।
సర్వ భూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే॥7॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బుజ్జగించినట్లు చెబుతున్నాడు.అర్జునా!సమవర్తిగా ఉండడం చాలా ముఖ్యము.సమస్త ప్రాణికోటిని ఒకే లాగ చూడగలగాలి.ఒకరు ఎక్కవ,ఒకరు తక్కువ కాదు.ప్రతి ఒక్క జీవిలో ఉండేది ఆ పరమాత్మ అంశమే!మనము ఎవరికంటే ఎక్కువ కాము,ఎవరి కంటే తక్కువ కాదు.కానీ నిష్కామంగా కర్మలు ఆచరించగలగాలి.శుద్థమయిన మనసు,ఆత్మ కలిగి ఉండాలి.ఇంద్రియాలను జయించి జితేంద్రియుడు కాగలగాలి.అలాంటి జ్ఞానము,జ్ఞానోదయము మనకు కలిగితే,అప్పుడు మనము ఆచరించే ఏ కర్మలూ మనలను కట్టి పడేయ లేవు.మనమూ,మన ఆత్మ స్వతంత్రులము అవుతాము.మోక్షానికి సోపానాలు వేసుకోవచ్చు,భేషుగ్గా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment