Wednesday, 3 June 2026
యద్ జ్ఞాత్వా న పునర్మోహం
యద్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ।
యేన భూతాన్య శేషేణ ద్రక్శ్య స్యాత్మ న్యథో మయి॥35॥4॥
శ్రీమద్భగవద్గీత...జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాన సముపార్జన ఎంత లాభదాయకమో చెబుతున్నాడు.అర్జునా!హే పాండవా!నేను ఇదంతా నీకు అనవసరంగా చెప్పడం లేదు.ఒక మనిషి జ్ఞానం సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమయిన విషయం.ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడు మోహంలో పడడు.మోహం,లోభం,కామం...ఇలా తప్పుదారిలో నడవడు.నీవు నా లాగానే సమస్తాన్నీ నీలోనే చూసుకుంటావు.ఎందుకో చెప్పనా!మన ఆత్మ ఆ పరమాత్మలో భాగమే!అంటే నీవే దేవుడు,నీలోనే దేవుడు,నీ చుట్టూరా దేవుడు.అంటే అంతా అవినాభావ సంబంథం.అంతా ఒక్కటే!మనం గ్రహించాలి అంతే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment