Thursday, 1 October 2026

అక్షరం బ్రహ్మ పరమం…Aksharam Brahma paramam

శ్రీ భగవానువాచ... అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మ ముచ్యతే। భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః॥3॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము.. శ్రీ కృష్ణుడు అర్జునుడి భయాలు,అనుమానాలూ పోగొట్టేదానికి నడుము బిగించాడు.చిద్విలాసంగా,చిరునవ్వుతో సమాథానం చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను చెప్పేదాంట్లో అర్థం కానిదానికీ,భయపడేదానికీ ఏమీ లేదు.నీకు చిన్నగా వివరిస్తాను,విను.బ్రహ్మము అంటే భయపడేదానికి ఏమీ లేదు.నాశనము లేనిది,అన్నిటికంటే ఉత్కృష్టము అయినది అని అర్థము.అధ్యాత్మం అంటే ఏందో అని తల పట్టుకుని కూర్చున్నావా?ప్రకృతి సంబంధమయిన స్వభావాలనే అధ్యాత్మము అని అంటారు.సృష్టి మొదట్లో పంచభూతాలు ఏర్పడ్డాయి కదా!అలానే సమస్త జీవ సృష్టి కూడా జరిగింది కదా!ఈ భూతోత్పత్తికి అయిన ఘటనమే కర్మము అని అంటాము.అంతకంటే ఇంకేమీ లేదు.సరేనా? Sri Bhagavaanuvaacha... Aksharam brahmaparamam swabhaavoadhyaathma muchyathe/ Bhoothabhaavodbhavakaro visargah karma samjnithah//3//8// Sri madbhagavadgeetha..Akshara parabrahma yogamu... Sri Krishna listened to Arjunas confusion reagarding His teachings.With pleasant smile on his face,he started replying.Arjuna!hey Kireeti!there is nothing to be stressed out.You need neither be confused nor frightened about the particular words I am using.I am ready to explain them to you in a simpler fashion.Brahmamu is the One which is the best in all fashions and which can not be destroyed.Adhyaathmam means natural instincts and reactions intertwined in human relations.You know the creation of five elements...air,water,sky,fire and earth.And there is this progeny or creation of entire living beings.This is called Bhoothothpaththi.This is called as Karmamu.