Monday, 1 June 2026
శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞాత్
శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప।
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే॥33॥4॥
శ్రీమద్భగవద్గీత....జ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!యజ్ఞాలు ద్రవ్యపరమయినవి,జ్ఞానపరమయ్నవి ఉన్నాయి కదా!నేను చెబుతున్నాను విను.ఓ పరంతపా!ఎప్పుడూ ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమయినది.ఎందుకంటావా?ఎందుకంటే అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తిపొందుతాయి.ప్రతి ప్రశ్నకూ ఒక పరిష్కారము ఉంటుంది.ఆ పరిష్కారానికి మార్గము చూపేదే జ్ఞానము.అంటే జ్ఞానము లేకపోతే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది.లేక పోతే అసలు ప్రశ్నే పుట్టదు.మనలో సత్యం తెలుసుకోవాలనే పిపాస ఉంటేనే కదా ప్రశ్న మొదలయ్యేది.ప్రశ్న మదిలో మెదిలితేనే కదా పరిష్కారం కోసం తపన మొదలయ్యేది.ఆ అన్వేషణకు ముగింపు జ్ఞానోదయంతోనే కదా మనకు దక్కేది.కాబట్టి జ్ఞాన సముపార్జన చాలా ముఖ్యము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment