Tuesday, 16 June 2026
సాంఖ్య యోగౌ పృథగ్బాలాః
సాంఖ్య యోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః।
ఏక మప్యాస్థిత స్సమ్య గుభయో ర్విందతే ఫలమ్॥4॥5॥
శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.అర్జునా!భరతశ్రేష్ఠా!నీకు అనుమానం వచ్చింది కదా కర్మ త్యాగం మంచిదా?కర్మానుష్ఠానం మంచిదా?అని.నాకు తెలుసు.చెబుతాను,విను.ఏ పండితుడూ జ్ఞాన యోగము మంచిది,కర్మయోగము కాదు అనిగానీ..।లేకపోతే కర్మ యోగమే మంచిది జ్ఞాన యోగము దేనికీ పనికి రాదని చెప్పడు.అవి అసలు వేరు వేరు అని కూడా చెప్పడు.ఎందుకంటే అవి ముక్తిని పొందేదానికి రెండు మార్గాలు..।అంతే!మనము ఒక దారిని ఎంచుకుంటే ఇంకొకటి తక్కువది అని కాదు.ఇంకొక విషయం!ఏదైనా శుద్ధంగా,క్షుణ్ణంగా అర్థం చేసుకుని అవలంబిస్తే,మానవుడికి రెండింటి ఫలమూ లభిస్తుంది.చాలా లాభదాయకమయిన వ్యవహారం కదా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment