Saturday, 18 July 2026

జితాత్మనః ప్రశాంతస్య

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః। శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావ మానయోః॥7॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను నిగ్రహము అని చెప్పాను కదా!నిగ్రహము అంటే ఏమనుకుంటున్నావు?ఉదాహరణగా కొన్ని చెబుతాను,విను.అబ్బ చలి!అబ్బో ఎండ!అబ్బబ్బో ఉక్క!అనుకోకూడదు.బయట పరిస్థితి ఎలా ఉన్నా సహించడము నేర్చుకోవాలి.విసుకులు,అలకలు మానాలి.సుఖాలు వస్తే ఎగిరెగిరి పడడం..।అదే దుఃఖాలు,కష్టాలు వస్తే మూలన కూర్చొని కుమిలి కుమిలి ఏడవడం మానేయాలి.గుండెను దిటవు పరుచుకుని,ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనగలగాలి.ఎవరైనా మనలను ఆహా!ఓహో!అంటూ అందలం ఎక్కించితే ఆకాశపుటంచులను తాకడం,అదే ఎవరి చేత అయినా అవమాన పరంపరలు ఎదురైతే అథఃపాతాళానికి కూరుకు పోవడం మానాలి.ఇదంతా ఎప్పుడు జరుగుతుందో చెప్పేదా?మన పైన ,మన నడవడిక పైన,మన నిగ్రహం పైన మనకు నమ్మకం ఉన్నప్పుడు జరుగుతుంది.మనము ప్రతిఫలాపేక్ష లేకుండా,లోక హితము కోసరము ఉంటే ఇవేవీ పట్టించుకోము. ఈ బాహ్యపరమయిన విషయాలకు చలించకుండా మనిషి ఉండగలగాలి.ఆత్మ నిగ్రహము అలవరుచుకోవాలి.శాంత చిత్తముతో ఉండాలి.అప్పుడు మానవుడు పరమాత్మానుభవము పొందగలుగుతాడు.

No comments:

Post a Comment