Saturday, 4 July 2026

బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా

బాహ్య స్పర్శే ష్వసక్తాత్మా విందత్యాత్మని య స్సుఖమ్। స బ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే॥21॥5॥ శ్రీమద్భగవద్గీత..।కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మతృప్తి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇప్పుడే మనము బ్రహ్మవేత్త,పండితుడు గురించి తెలుసుకున్నాము కదా!అలాంటివాడికి బాహ్య ప్రపంచంతో సంబంథం లేదు.ప్రతిదీ ఆత్మ సాక్షిగానే స్వీకరిస్తాడు.అతను అలౌకికమయిన ఆనందాన్ని,బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శిస్తాడు.మోక్షము అంటే దుఃఖానికి తావు లేనిది.అదే కదా ఆనంద నిలయం అంటే.ఇలాంటి బ్రహ్మవేత్తలు శాశ్వత ఆనందాన్ని,బాహ్య ప్రపంచంతో సంబంథం లేకుండా పొందగలతారు.ఆస్వాదించగలతారు.

No comments:

Post a Comment