Tuesday, 14 July 2026

యం సన్న్యాస మితి ప్రాహుః

యం సన్న్యాస మితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ। న హ్య సన్న్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన॥2॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము.... శ్రీకృృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్దునా!ఓ పాండవా!సన్న్యాసి అన్నా,యోగి అన్నా ఒకటే!సన్న్యాసము,యోగము అంటే దీక్ష అనే కదా!ఒక ప్రక్క లోకంలో ఉండేవన్నీ మనకే కావాలనుకుంటాము...ఇంకో ప్రక్క సన్న్యాసులలో కలసిపోతాము,యోగీశ్వరులము అయిపోతాము అని డంబాలు చెబుతే ఎట్లా కుదురుతుంది,చెప్పు?సంకల్పాలను వదలలేనివాడు,సన్న్యసించలేని వాడు ఎప్పటికీ యోగి కాలేడు,కానేరడు.

No comments:

Post a Comment