Wednesday, 15 July 2026

యదా హి నేంద్రియార్థేషు

యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే। సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్త దోచ్యతే॥4॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు...ఫలాపేక్ష వీడకుండా యోగములో మనము ముందుకు పోలేము.నిజానికి అదే మొదటి మెట్టు.అర్జునా!ఓ పార్థా!సంకల్పము అంటే ఒక పని చేయాలనే బలమయిన కోరిక.ముందర ఆ తపన మనము వదల గొట్టుకోవాలి.ఇంద్రియ విషయాలకు సంబంథించి మోహము పనికిరాదు.వాటి పరమయిన కర్మలను చేయాలి అనే ఆవేశము విడనాడాలి.అలా అన్ని కోరికలనూ,సంకల్పాలను వదిలి వేయగలిగిన నాడే మనము యోగారూఢులము అని చెప్పబడతాము.

No comments:

Post a Comment