Friday, 10 July 2026

స్పర్శాన్ కృత్వా

స్పర్శాన్ కృత్వా బహి ర్బాహ్యాం శ్తక్షుశ్చైవాంతరే భ్రువోః। ప్రాణా పానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ॥27॥ యతేంద్రియ మనోబుద్ధి ర్మునిర్మోక్ష పరాయణః। విగతేచ్ఛా భయక్రోధో య స్సదా ముక్త ఏవ సః॥28॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి నిత్యముక్తుడు ఎలా ఉంటాడు,ఎప్పుడు అవుతాడు అనేది వివరిస్తున్నాడు.అర్జునా!కౌంతేయా!మోక్షము కావాలంటే మనం ఏమి చేయాలి చెప్పు?మనం నిత్య ముక్తులం ఎప్పుడు అవుతాము?జ్ఞాన మార్గంలో గమ్యం ఎలా,ఎప్పుడు చేరతాము?వీటన్నిటికీ సమాథానం చెబుతా, విను.మొదట ప్రపంచిక విషయాల పైన మోజు వదిలెయ్యాలి.వాటి జోలికి పోకూడదు.వాటి ఊసే వదిలెయ్యాలి.మన దృష్టిని భ్రూమధ్యమందు ఏకాగ్రం చేసి,కేంద్రీకరించాలి.అటు పైన ముక్కున సంచరించే ప్రాణాపానాది వాయువులను సమబద్దీకరణ చేయాలి.ఇప్పుడు ఇంక అసలు కథ మొదలవుతుంది.కనుబొమల మధ్యన దృష్టి సారించడం,ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు క్రమబద్ధీకరించడం ఒక ఎత్తు.మనసును,బుద్ధిని,ఇంద్రియాలను మన పట్టులో పెట్టుకోవాలి.స్వాథీన పరుచుకోవాలి,మన నియంత్రణలో పెట్టుకోవాలి.కనిపించిందంతా కావాలి అనే కోరికలను,భయం,కోపం,తాపం,తామసం లాంటి వాటిని అన్నిటినీ విడిచి పెట్టి,నిర్మలంగా తయారు కావాలి.అట్లా మోక్షాసక్తుడు అయిన జ్ఞాని నిత్యముక్తుడు అవుతాడు.అర్థమయిందా,అర్జునా!

No comments:

Post a Comment