Thursday, 23 July 2026

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిర మాసన మాత్మనః। నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్॥11॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి చిన్న చిన్న మెళకువలు,పాటించాల్సిన విషయాలు కూడా ఓపికగా,విసుగు లేకుండా చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను నీకు యోగాభ్యాసం చేయాలి అని చెప్పాను కదా!దానికి ఎలా అన్నీ సరి చూసుకోవాలో కూడా చెబుతాను,విను.మంచి శుభ్రమయిన ప్రదేశం ఎంచుకోవాలి.మరీ అంత ఎత్తు,మరీ అంత కురచగా లేని పీఠం ఎన్నుకోవాలి.దాని పైన దర్భలు వేయాలి.ఆ పైన జింక లేక పులి చర్మము పరవాలి.దాని పైన శుభ్రమయిన వస్త్రము పరవాలి.ఆసనమును ఇలా ఏర్పరుచుకోవాలి.

No comments:

Post a Comment