Friday, 21 August 2026

అయతి శ్రద్ధయోపేతో

అర్జున ఉవాచ... అయతి శ్రద్ధయోపేతో యోగా చ్చలితమానసః। అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి॥37॥6॥ శ్రీమద్భగవద్గీత...।ఆత్మ సంయమ యోగము... అర్జునుడికి అసలు సిసలైన అనుమానం వచ్చింది.నిజమే కదా!శ్రీకృష్ణుడు చాలా కష్టం అంటున్నాడు.కానీ సాధించాలంటున్నాడు.నిజంగా ఎంత మంది సాధించగలరు?ఎంత మంది మొదలు పెట్టి,చేయలేక,చేతకాక మధ్యలోనే అస్త్ర సన్న్యాసం చేస్తారు?ఎంత మంది అసలు ఈ కోణంలో ఆలోచించరు? అదే అడుగుతున్నాడు.కృష్ణా!ఓ బావా!నీవు చెప్పేదంతా చాలా బాగుంది.స్పూర్తిదాయకంగా ఉంది.కానీ బావా!శ్రద్ధ ఉన్నా ప్రయత్నించని వాడు ఏమవుతాడు?మొదలు పెట్టినా,ఏ కారణాల వల్లనైనా మనసు చలించి,సిద్ధి పొందలేని మానవుడి గతి ఏంది?ఇలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంది?

No comments:

Post a Comment