Friday, 7 August 2026
సంకల్ప ప్రభవాన్ కామాన్
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః।
మనసై వేంద్రియగ్రామం వినియమ్య సమంతతః॥24॥6॥
శ్రీమద్భగవద్గీత.।।ఆత్మ సంయమ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!మనం ఈ భూమి పైన పుట్టాము కదా!కాబట్టి ప్రాపంచిక విషయాల పైన రక్తి,అనురక్తి,మోహము,లాలస,తపన సహజంగా ఉంటాయి.ఆ యా సంకల్పాల వల్ల పుట్టే కోరికలు ఒకటో రెండో ఉండవు.తేనె తుట్టె కదిలిస్తే తేనెటీగలు ఎన్ని మన పైకి దాడి చేస్తాయి,మూకుమ్మడిగా?చెప్పు?అంతకంటే పదింతలు కోరికలు మనల్ని చుట్టుముట్టుతాయి.అనుమానమే లేదు.మనం ఎంత గింజుకున్నా వాటి నుంచి తప్పించుకోలేము,వాటి ముళ్ళ నుంచీ తప్పించుకోలేము.కానీ,ఆ కోరికలను మనము నిగ్రహించగలగాలి.వాటి నుంచి దూరంగా వచ్చేయాలి.విషయాలను ఇంద్రియాలనుంచి మరల్చగలగాలి.అంటే ఉంద్రియ నిగ్రహము పాటించాలి.ఓ యమ్మో!ఇదంతా మన వల్ల అవుతుందా?అని మొదట్లోనే అస్త్ర సన్న్యాసం చేయకూడదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment