Thursday, 27 August 2026

తత్ర తం బుద్ధి సంయోగం

తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికమ్। యతతే చ తతో భూయ స్సంసిద్ధౌ కురునందన॥43॥6॥శ్రీమద్భగవద్గీత.....ఆత్మ సంయమ యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి చిన్న విషయమూ పూర్వాపరాలతో సహా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!సగంలోనే ముగింపు పలికిన యోగి తరువాత జన్మ సుకృతమయిన కుటుంబంలో,మంచి వారి మధ్య జరుగుతుందని చెప్పాను కదా!దీనికి కారణం ఏందంటే మనం చేసే మంచి ఎక్కడికీ పోదు.మనం కోరుకోక పోయినా దాని మంచి ఫలితాలు మనకు దక్కుతాయి.అతను తరువాతి జన్మలో అసంపూర్తిగా వదిలేసిన యోగాన్ని సంపూర్ణం చేయాలనుకుంటాడు.దానికి అనువుగా ఉండే పరిస్థితులు భగవంతుడే కల్పిస్తాడు,తన వంతు సహాయంగా.లేకపోతే రెడ్డొచ్చె మొదలొచ్చె లాగ మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాలి కదా వ్యవహారం అంతా.ఎంతో కొంత పూర్వ జన్మ వాసనలు ఉంటాయి,పరిసరాలు,మనుష్యులు అనుకూలంగా ఉంటాయి.కాబట్టి రెండో ఆలోచన లేకుండా యోగి రంగంలోకి దిగవచ్చు.తను అనుకున్న కార్యాచరణకు శ్రీకారం చుట్టవచ్చు.ఈ జన్మలోనైనా తను అనుకున్నది సాథించి మోక్షం సంప్రాప్తమయ్యేలా విజయం సాథించవచ్చు.

No comments:

Post a Comment