Monday, 10 August 2026

ప్రశాంత మనసం హ్యేనం

ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్। ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్॥27॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇందాకటి నుంచీ ఇంద్రియ నిగ్రహము గురించి చెబుతున్నాను కదా!అంతే ముఖ్యమయినది ఇంకొకటి ఉంది.అది ఏందో నువ్వు చెప్పగలతావా?ఆలోచించు.సరే!నేనే చెబుతాను,విను.మనసును నిష్కల్మషంగా,ప్రశాంతంగా పెట్టుకోగలగడం.ఎందుకంటావా?మనము ఏదో సాధించాము అనే భావన వచ్చింది,అనుకో.మనకు తెలియకుండానే గర్వం పొడచూపుతుంది.ఆ విషయం మనకు కూడా తెలియదు.మిగిలిన విషయాలు చాలా తృణప్రాయంగా,లెఖ్ఖలోనికి రానివిగా తీసేస్తాము.ఆ చులకన భావము,ఆ విసుగు,ఆ ఛీదర,ఆ ఛీత్కారము మనము పక్కన పెట్టాలి.ఎదుటి వారి మనసు నొప్పించ కూడదు...తెలిసి గానీ,తెలియక గానీ.ఆ స్పృహ మనకు ఖచ్ఛితంగా ఉండాలి.అది ఉండాలంటే మొదట మన మనసు ప్రశాంతంగా ఉండాలి,ఉంచుకోగలగాలి.మనిషికి తెలివి తేటలు ,జ్ఞానము ఎంత ముఖ్యమో..।మంచి మనసు,సమభావము,దయ,దాక్షిణ్యం కూడా అంతే ముఖ్యము.అలా ఉన్నప్పుడే బ్రహ్మానందానుభూతి తనకు తానై వచ్చి మన ఒడిలో వాలుతుంది.మన కైవసము అవుతుంది.

No comments:

Post a Comment