Saturday, 15 August 2026

సర్వభూతస్థితం యో మాం

సర్వభూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః। సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే॥31॥6॥ శ్రీమద్భగవద్గీత..।।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సమదృష్టి ఉండడం ఎంత ముఖ్యమయిన ప్రక్రియో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఇందాకటి నుంచీ నీకు చెబుతున్నాను కదా నేను సర్వాంతర్యామిని అని.నేను నీలో ఉంటాను,నీ చుట్టూ ఉంటాను.అలానే సర్వభూతాలలోను ఉపస్థితమై ఉంటాను.ఆ విషయం మనకు అర్థం అయింది అనుకో,అప్పుడు ఎవరినీ చులకన భావంతో చూడము.అందరికీ గౌరవము ఇస్తాము.ఎందుకంటే నేను నేను కాదు,నాలో పరమాత్మ ఉన్నాడు.నీవు నీవు కాదు.ఎందుకంటే నీలోనూ పరమాత్మ ఉన్నాడు.అంటే అర్థం ఏంది?మన ఇద్దరమూ ఒకటే,సమానమే అని కదా అర్థము.అందుకే చెబుతున్నాను మిత్రమా.భేదభావం లేకుండా అన్ని ప్రాణులలో అంతర్హితంగా ఉన్న నన్ను ధ్యానించాలి.అప్పుడు ఆ ధ్యాని ఎవరైనా,ఏ స్థితిలో ఉన్నా నా యందే ఉంటాడు.

No comments:

Post a Comment