Friday, 14 August 2026

యో మాం పశ్యతి సర్వత్ర

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి। తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి॥30॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడే చెప్పాడు కదా యోగి తనలో అందరినీ,అందరిలో తనను చూసుకుంటాడు అని.ఆఁ!చూస్తే ఏమవుతుంది?అని కదా మనందరి అనుమానం.దానికి సమాథానం భగవంతుడే చెబుతున్నాడు.శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!నీకు ఇప్పుడు అసలు రహస్యం చెబుతాను.ఎవడైతే అన్ని ప్రాణుల యందు నన్నూ,నా యందు సమస్త ప్రాణులనూ చూస్తాడో వాడే యోగి.ఎందుకంటే యోగి తనలో ఉన్న దైవాన్నీ,పరమాత్మనీ చూడగలుగుతాడు.అలాగే అన్ని ప్రాణులలోనూ అదే దైవాన్ని చూడగలుగుతాడు.అందుకే అతనికి అందరూ సమానమే అనిపిస్తుంది.అంతే కాదు,సఖా.అలాంటి వాడి యందే నా దృష్టి అన్ని వేళలా ఉంటుంది.వాడి దృష్టీ నా యందే సతతం ఉంటుంది.అంత కంటే మోక్షం,పరమార్థం ఇంక ఏమి ఉంటుంది చెప్పు,మానవుడికి?

No comments:

Post a Comment