Wednesday, 5 August 2026

యం లబ్ధ్వా చాపరం లాభం

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః। యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే॥22॥6॥ఆత్మ సంయమ యోగము...భగవద్గీత.. భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు మానవుడు అయిన అర్జునుడికి ఆత్మతృప్తి,అత్యంత ఆనందకరమయిన స్థితి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!మనకు ఎప్పుడు ఇంక చాలు అనిపిస్తుంది?ఇంతకంటే గొప్పగా ఇంకొకటి ఉండదు అనినప్పుడు కదా!ఆ సచ్చిదానందము స్థిరమయినప్పుడు మనసు అచంచలమవుతుంది.ఆ స్థితిలో ఎన్ని కష్టసుఖాలు,దుఃఖాలు అయినా తృణప్రాయమవుతుంది.అసలు చలించము.చలించడం వ్యర్థము అనే భావనకు వస్తాము.ఆ అత్యంత ఆకర్షణీయమయిన ఆత్మానందమే మోక్షానికి మొదటి మెట్టు.మనం మనం ఎన్నుకున్న మార్గానికి అర్హులు అయినట్లు లెఖ్ఖ.

No comments:

Post a Comment