Thursday, 20 August 2026

అసంశయం మహాబాహో

శ్రీ భగవానువాచ... అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్। అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే॥35॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము...శ్రీకృష్ణుడికి అర్జునుడి అనుమానాలు విని సంతోషం వేసింది.ఎందుకు?ఎందుకంటే ఒక శిష్యుడు మనసు పెట్టి వింటున్నాడు అని అర్థం కనుక.అర్థం చేసుకునేదానికి శాయశక్తులా తపిస్తున్నాడు అని గుర్తు.ఇంక పరవాలేదు బండి దారిలోకి వస్తున్నది అని ఊపిరి తీసుకున్నాడు.చిన్నగా చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నీ అనుమానాలలో తప్పు లేదు.ఎవరైనా అలానే అనుకుంటారు.కానీ నేను ఒక విషయం చెబుతాను.వేప ఎలా ఉంటుంది,చెప్పు?చేదుగా ఉంటుంది కదా!నోట్లో పెట్టుకోని,ఆహా!ఓహో!అంటూ తన్మయత్వంగా ఆస్వాదించగలమా?లేదు కదా!దానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి,కానీ మనకు రుచి కూడా చూడబుద్ధి కాదు.నాలుక కొనకు కూడా తాకించ బుద్ధి కాదు.కానీ చిన్నగా రోజూ కొంచెం కొంచెం తినడం మొదలు పెట్టాము,అనుకో!కొన్ని రోజులకు కష్టం అనిపించదు కదా!బాగా అలవాటు అయేటప్పచికి దాంట్లో కూడా మంచి కనిపిస్తుంది కదా!ఇది కూడా అలాగే!మనసు చంచలమైనదే!నిగ్రహించడము ఇంకా కష్టమే?కానీ..।అభ్యాసము అనే ఒక ప్రక్రియ ఉంది చూసావూ.అది రామబాణంలా పని చేస్తుంది.దానికి తోడు వైరాగ్యం అనే సాథనం యొక్క ఆసరా తీసుకున్నావు అనుకో,అద్భుతాలు సృష్టించవచ్చు.మనశక్తి యుక్తులు మనకు తెలియడం లేదు.సానబెడితేగానీ వజ్రం మెరవదు కదా!మన మస్తిష్కం కూడా అంతే.అర్థమైందా నాన్నా!

No comments:

Post a Comment