Thursday, 6 August 2026

తం విద్యా ద్దుఃఖ సంయోగ

తం విద్యా ద్దుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితమ్। స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణ చేతసా॥23॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా విడెరచి చెబుతున్నాడు.అర్జునా!బావా!మనం ఇప్పుడు యోగం గురించి మాట్లాడుకుంటున్నాము కదా!యోగమనేది ఒక స్థితి.అది ఏమి చేస్తే మనకు దక్కుతుంది?ఎలా ఉంటే మన ఆధీనంలోకి వస్తుంది అనే విషయంగా మల్లగుల్లాలు పడుతున్నాము కదా!మనము ఏ స్థితిలో ఉంటే దుఃఖాలు మన దరికి చేరవో,ఆ స్థితి.అంటే అవి కూడా ఇక్కడ మన పని అయ్యేటట్లు లేదని తోక ముడిచి,పారిపోవాలి.అంటే వాటికి అర్థమయిపోతుంది అన్న మాట.మనం వాడి దగ్గర ఉన్నా,ఆ చెట్టు పుట్ట మీద ఉన్నా ఒకటే.వీడు స్పందించడు.వీడి దగ్గర మన శక్తి యుక్తులు ప్రదర్శించడం వృథా అని.యోగము అంటే ఆ స్థితి రా,బావా!ఆ స్థితిని మనము స్థిర మానస బుద్ధి సాథించి,సహనంతో సమన్వయం చేసుకుని సాథించాలి.మనసా వాచా కర్మణా అదే ధ్యాసలో ఉండాలి.

No comments:

Post a Comment