Monday, 24 August 2026

పార్థ నై వేహ నాముత్ర

శ్రీ భగవానువాచ...। పార్థ నై వేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే। న హి కళ్యాణ కృత్ కశ్చి ద్దుర్గతిం తాత గచ్ఛతి॥40॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడి అనుమానాలు అన్నీ ఓపికగా విన్నాడు.మందహాసంతో జవాబిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీ అనుమానాలు అన్నీ సహేతుకమైనవే.కాదనను.కానీ నేను ఒక విషయం చెబుతాను.శుభకర్మలు,అదే మంచి పనులు చేసేవాడికి ఎప్పుడూ చెడు జరగదు.అయ్యో!ఇంత మంచిగా జీవిత ప్రమాణాలని పాటిస్తున్నాము.ఎందుకు నాకు ఈ దుర్దశ అని చింతించాల్సిన తరుణం ఎదురవదు.అలాంటి వ్యక్తికి ఈ లోకములోనే కాదు,పరలోకంలో కూడా ఎలాంటి వినాశనమూ కలుగదు.సన్మార్గం ఎంచుకని,ఆ దారిలో పయనించడమే మనము చేయాల్సినది.

No comments:

Post a Comment