Friday, 28 August 2026

పూర్వాభ్యాసేన తేనైవ

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో పి సః। జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే॥44॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!మనకు తీపి ఇష్టమనుకో.ఏమి చేస్తాము?అది ఎక్కడ ఉన్నా కనిపెడతాము.ఒక ముక్క త్రుంచి నోట్లో వేసుకుంటే కానీ ఆ యావ,దుగ్థ తీరదు.ఇక్కడ ఏ కారణం వల్ల నైనా యోగాభ్యాసాన్ని మధ్యలో వదలి పెట్టిన వాడి మనో స్థితి కూడా అలానే ఉంటుంది.జన్మ మారినా ఆశ మారదు.కాబట్టి అతను ఈ జన్మలో కూడా పాత వాసనల ప్రభావం వలన యోగానికే ఆకర్షింప బడతాడు.ఎత్తుకోవడం ఎత్తుకోవడం యుక్త కర్మ ఫలాలను మించి పోతాడు.యోగ సాథనలో ముణిగి పోతాడు. యుక్త కర్మల వలన లాభాలు చెబుతాను.బంధాలలో చిక్కుకోకుండా ఉండడము.పాప పుణ్యాల బేరీజులతో సంబంథాలు లేకపోవడము.మనశ్శాంతితో మసలుకోవడము.మోక్ష ప్రాప్తి.భగవంతునితో అనుసంథానం కావడం.

No comments:

Post a Comment