Monday, 17 August 2026

యోఽయం యోగస్త్వయా ప్రోక్త

అర్జున ఉవాచ... యోఽయం యోగస్త్వయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన। ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరామ్॥33॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... అర్జునుడు ఇందాకటి నుంచి ఉగ్గబట్టి కూర్చుని,శ్రీకృష్ణుడు చెప్పేదంతా వింటున్నాడు.కొంచెం అర్థమవుతూ,కొంచెం గజిబిజిగా అనిపిస్తున్నట్లు ఉంది.మనసులో సంశయాలు పెట్టుకోకూడదు కదా!అందుకని గొంతు సవరించుకుని తన నేస్తాన్ని అడుగుతున్నాడు.కృష్ణా!ఓ బావా!నీవు చెప్పిందంతా శ్రద్ధగా వింటూ ఉన్నాను.నీవు ఇప్పుడు ఏమి చెప్పావు?ముందర మనసును స్థిర పరుచుకోవాలి,సమదృష్టి పెంపొందించుకోవాలి అని చెప్పావు కదా!అట్లా చేస్తే కానీ యోగి కాలేము అని అంటున్నావు కదా!మనసు సహజగుణమే చంచలంగా ఉండడము.మరి అలాంటప్పుడు నీవు చెప్పేదంతా ఎలా ఆచరించగలను?ఆ యోగ స్థితి ఎలా చేజిక్కించుకోగలను?దిక్కుతోచడం లేదు.

No comments:

Post a Comment