Sunday, 16 August 2026

ఆత్మౌపమ్యేన సర్వత్ర

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున। సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః॥32॥6॥ శ్రీమద్భగవద్గీత..।ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి భావజాలము ఏ రీతిలో ఉండాలి అనే విషయము చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నన్ను కొడితే నాకు నొప్పి అనిపిస్తుంది కదా!మరి నిన్ను కొడితే వింజామరలు వీచినట్లు ఉంటుందా?ఉండదు కదా!నీకు కూడా నొప్పే అనిపిస్తుంది కదా!ముందర మనము అది గ్రహించాలి.ప్రతి ప్రాణి స్పందన ఒక విషయానికి ఒకేలాగ ఉంటుంది అని.కాబట్టి ఎదుటి వారి సుఖ దుఃఖాలను మనవి లాగ మనము స్పందించగలగాలి.అందరి కష్టము మన కష్టము,అందరి సుఖము మన సుఖము.ఈ సత్యము మనం తెలుసుకున్న నాడు మనమే యోగులము,యోగిశ్రేష్టులము అవుతాము.ఎందుకంటావా?అందరి నొప్పి మనకు నొప్పి అంటే ఎదుటి వారికి ఆ నొప్పి కలుగకుండా జాగ్రత్త పడతాము.అందరి ఆనందము మన ఆనందము అనుకుంటే సాంఘిక న్యాయము,ప్రశాంతతలకు పాటుపడతాము.

No comments:

Post a Comment