Thursday, 13 August 2026

సర్వభూతస్థ మాత్మానం

సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని। ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః॥29॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగాభ్యాసము వలన లాభాలు చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!యోగము అభ్యసించడం,మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి,తెలుసా?అతనికి సమతా భావము ఉంటుంది.మళ్ళీ అదేంది అంటావా?అంటే అన్ని ప్రాణులనూ సమదృష్టితో చూడగలుగుతాడు.నీవే నేను,నేనే నీవు లాగ అనుకో!అన్ని జీవాల యందు తనను చూసుకుంటాడు.తన యందు సర్వభూతాలనూ దర్శిస్తాడు.అంతే కదా!మనము ఎవరిని సమ ఉజ్జీలు అనుకుంటాము?మనకు ఉన్న శక్తియుక్తులు ఎదుటి వాడిలో ఉన్నప్పుడే కదా!సర్వ ప్రాణులను సమంగా చూడడమంటే?చిన్న అయినా పెద్ద అయినా,బలవంతుడు అయినా బలహీనుడు అయినా..।అలా ప్రతి ప్రవృత్తిలో మనలను మనం ఎదుటి జీవిలో చూసుకోగలగాలి.

No comments:

Post a Comment