Saturday, 5 September 2026

అపరేయ మితస్త్వన్యాం

అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్। జీవ భూతాం మహాబాహో య యేదం ధార్యతే జగత్॥5॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి పర అపర ప్రకృతుల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ మహాబాహో!ప్రకృతి రెండు రకాలు.అవే పర మరియు అపర.అపర ప్రకృతి అంటే పంచ భూతాలు మరియు మనసు,బుద్ధి,అహంకారము కలగలిసినది.పర ప్రకృతి అంటే శరీరము తన ప్రాణము తెలుసుకో గలిగిన,నడిపించే సూక్ష్మమయిన శ్రేష్టమయిన,సత్యమయిన,శాశ్వతమయిన చైతన్యము. మనిషి అపర ప్రకృతి కంటే ఉన్నతమయినది పర ప్రకృతి అని తెలుసుకోవాలి.ఎందుకంటే పర ప్రకృతి ఈ సమస్త విశ్వాన్నీ ధరించింది.నా ప్రకృతినే పరా ప్రకృతి అని అంటారు.

No comments:

Post a Comment