Thursday, 3 September 2026

మనుష్యాణాం సహస్రేషు

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే। యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః॥3॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగము,సాథన,జ్ఞానము ఊరికినే సులభంగా సంప్రాప్తించవు.ఖఠినమయిన దీక్ష,సాథన,జిజ్ఞాసలు అవసరము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను చెప్పేది వింటుంటే అంతా చాలా సులభమూ,సునాయాసమూ అనిపిస్తుంది కదా!అంత లేదు.నిజానికి ఏ వేయి మందిలో ఏ ఒక్కడికో మోక్షానికి ప్రయత్నించాలి అని అనిపిస్తుంది.అలాగ నిజంగా ప్రయత్నించే వేయి మంది యతులలో,ఏ ఒక్కడో నన్ను నిజంగా తెలుసుకో గలుగుతున్నాడు.కాబట్టి నిర్దిష్టమయిన ప్రణాళికతో ఇవి సాథన చేయాలి.

No comments:

Post a Comment