Tuesday, 1 September 2026

మయ్యా సక్త మనాః పార్థ

శ్రీమద్భగవద్గీత... సప్తమోఽధ్యాయః...విజ్ఞాన యోగః... శ్రీ భగవానువాచ... మయ్యా సక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః। అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు॥1॥ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇందాక చెప్పిన మాటే మళ్ళీ నొక్కి నొక్కి చెబుతున్నాడు.ఈ ప్రయత్నం అంతా తను చెప్పేది బుర్రలోకి గట్టిగా పాతుకు పోవాలనే!అర్జునా!ఓ పార్థా!ఇందాకటి మాటే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను.నా యందే మనస్సు నిలుపు.నన్నే ఆశ్రయించు.యోగరతుడవు కా!అంటే యోగమును ప్రీతితో ఆశ్రయించి,దానిలోనే మునిగి తేలడము.ఇలా చేస్తే నువ్వే కాదు ఎవరైనా సరే సరి అయిన మార్గములోకి వచ్చినట్లు లెక్క.అలాంటివాడు నిశ్శంకగానూ,సంపూర్ణంగానూ నవ్ను ఎలా తెలుసుకోవాలో చెబుతాను విను.

No comments:

Post a Comment