Saturday, 12 September 2026

బలం బలవాతాం చాహం

బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్। ధర్మా విరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ॥11॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తన్ను ఇంకొన్ని విథాలుగా ప్రస్ఫుటమవుతాడో చెబుతున్నాడు.అర్జునుడిని సంబోథించడంలో కూడా అర్జునుడిపైన తనకున్న మక్కువ,అర్జునుడి గురించి తను ఏమనుకుంటున్నాడో తెలియకనే తెలుస్తుంది.భరత అంటే భరత వంశము.ఋషభ అంటే ఎద్దు.అది శక్తికి,గొప్పతనానికీ ప్రతీక.శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడు భరతవంశంలో ఋషభం లాగ శ్రేష్టుడు,గొప్పవాడు అని పొగుడుతున్నాడు.అర్జునా!ఓ భరతర్షభ!బలవంతులలో ఉండే కామరాగాలు లేని బలాన్ని నేను.ఈ సమస్త సృష్టిలో ఉండే ప్రతి జీవి లోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.అనుభూతి పరంగా నేనే ఉంటాను,అవ్యయ పరంగా నేనే ఉన్నాను.అంటే గర్వము,అహంకారము లేకుండా ధర్మబద్ధమయిన శక్తి సామర్ధ్యాలకు ప్రతీక నేను.అలాగే సృష్టి కార్యంగా భావించి,పవిత్రంగా ఆచరించే కామాన్ని నేను.

No comments:

Post a Comment