Friday, 25 September 2026

నాహం ప్రకాశ….Naaham prakaasa

నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః। మూఢోఽయం నాభిజానాతి లోకో మా మజ మవ్యయమ్॥25॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియ పరుస్తున్నాడు తనను మామూలు మనుష్యులు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు అనే విషయాన్ని.అర్జునా!ఓ బావా!నేను యోగమాయతో కూడిన వాడిని.నాకు చావు పుట్టుకలు లేవు.అరిషడ్వర్గాలకు అతీతుడిని.నేను శాశ్వతుడను.ఇవి,ఇలాంటివి మామూలు వాళ్ళ మేథస్సుకు అందని విషయాలు.వాళ్ళు భౌతిక ప్రపంచానికి,విషయాలకే ప్రాథాన్యం ఇస్తారు.అవే అర్థం అవుతాయి.కాబట్టి అజ్ఞానులు నన్ను తెలుసుకోలేరు. Naaham prakaasa ssarvasya yogamaayaa samaavruthah/ Moodoam naabhijaanaathi loko maa maja mavyayam//25//7// Sri madbhagavad geetha...Vijnaana yogamu... Sri Krishna is telling Arjuna as to why common man is unable to understand Him.Arjuna!hey brother!Ajnaani,the ignorant fails to understand me.The main reason behind it is this.I am covered by yogamaaya.I am above birth and death.I am permanent.I am eternal.All these facts and factors are above the imagination of common man.Because he is busy solving his material problems his entire life.He has neither the interest nor the time to think of things or know about Me.

No comments:

Post a Comment