Tuesday, 22 September 2026

స తయా శ్రద్ధయా…Sa thayaa sradhdhayaa

స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే। లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తామ్॥22/7// శ్రీమద్ భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి తానే కర్త కర్మ క్రియ అనే విషయం ఇంకొక్క సారి చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను నీకు ముందుగానే చెప్పాను కదా నేనే మూల పురుషుడిని అని.అణువణువులోన నేనే ఉంటాను.ప్రతి క్రియ ముందూ వెనకా కూడా నేనే ఉంటాను.దానికి ఇది కూడా ఒక ఉదాహరణే!మామూలు ప్రజలు ఏమనుకుంటారు?మనము ఫలానా దేవుడు లేక దేవతలను పూజిస్తున్నాము.వాళ్ళు మన పూజలకు తృప్తి పడి మన కోరికలు తీరుస్తున్నారు అనే కదా!కానీ నిజానికి ఆ మానవులలో కోరికలు కలిగించేదీ నేనే! ఆయా దేవతల రూపములో నెరవేర్చేది కూడా నేనే. Sa thayaa sraddhayaa yuktha sthasyaaraadhana meehathe/ Labhathe cha thathah kaamaan mayaiva vihithaan hi thaam//22//7// Sri madbhagavadgeetha...Vijnaana yogamu... Sri Krishna is telling once and again to Arjuna that he is centre point for everything that happens in this world.Arjuna!hey friend!what does a common man generally think?He thinks that he is praying particular deity for fulfilling his wants or desires.Concerned deity is pleased and sanctioning boons to him or her.Reality is different.I am the One who instills the desires or wishes in people.I am the One who fulfills their wishes.So,be reminded and remember that I am the central point for every act and its result.

No comments:

Post a Comment