Wednesday, 16 September 2026

చతుర్విధా భజంతే ॥॥॥chathurvidhaa bhajanthe

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున। ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియపరుస్తున్నాడు.ఏమని?ఎవరెవరు తనను సేవిస్తారు అని.అర్జునా!భరతర్షభ!నన్ను నాలుగు రకాల మనుష్యులు సేవిస్తారు.వాళ్ళు ఎవరో వివరిస్తాను.ఆపదలలో చిక్కుకున్నవాడు అమ్మా!అని అరుస్తాడు.భగవంతుడే తనకు తల్లి,తండ్రి,గురువు,దైవము అని నమ్ముతాడు.ఏదో ఒక రూపంలో చేయూతను ఇస్తానని ఆశిస్తాడు.జ్ఞాని నన్ను సేవిస్తాడు.ఎందుకంటే తన జ్ఞాన నేత్రముతో నన్ను గుర్తిస్తాడు.నేను సర్వాంతర్యామిని,సర్వ వ్యాపకుడను అని తెలుసుకుంటాడు.కావున నాశరణు జొచ్చుతాడు.ఇక పోతే సంపదలు కోరుకునే వాడు నన్ను సేవిస్తాడు.తిట్టినా,పెట్టినా నేనే అనే విషయం వాడికి బాగా క్షుణ్ణంగా తెలుసు.జిజ్ఞాసువు జ్ఞాన పిపాసి.జ్ఞానం పూర్తిగా తెలుసుకోవాలనే అన్వేషణలో నిత్యం ఉంటాడు.జ్ఞాన సముపార్జన కోసం నన్ను సేవిస్తాడు.///// Chathurvidhaa bhajanthe maam janaa ssukruthinoarjuna/ Aartho jijnaasu rardhaardhee jnaanee cha bharatharshabha//16//7// Sreemadbhagavadgeetha...vijnaana yogamu... Sree Krishna is telling Arjuna what types of people worship him and want to be protected by Him.Arjuna!hey Bharatharshabha!people who are facing hardships in their lives come to me seeking help.Persons who are in search of knowledge that is profound seek my blessings.peole who want riches and wealth pray to me for fulfilment of their desires.An intelect and knowledgeable person knows and understands that I am the Supreme force behind everything.So,I am always in his prayers.These four categeries of people seek my blessings and proctection.

No comments:

Post a Comment