Monday, 14 September 2026

త్రిభి ర్గుణమయై ర్భావైః

త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్సర్వ మిదం జగత్। మోహితం నాభి జానాతి మామేభ్యః పర మవ్యయమ్॥13॥7॥ శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు వ్యవహారం చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!త్రిగుణాలు ఉన్నాయి అని చెప్పాను కదా!అవి నా సృజనే అని కూడా చెప్పాను కదా!ప్రపంచం మొత్తమూ ఈ సత్త్వరజస్తమో గుణాల భావాలతో సమ్మోహనము కాబడుతుంది.దాని పర్యవసానం ఎలా ఉంటుంది?ఏమి ఉంటుంది చెప్పు?అంతా గలబా గలబా!గందరగోళం!అంతే కదా!ఈ పరిస్థితులలో సర్వాతీతుడను,శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోవడమే గగనమవుతున్నది.అందరూ దిక్కులు చూస్తున్నారు.ఏ దిక్కు మొక్కాలో తెలియక!

No comments:

Post a Comment