Thursday, 22 October 2026
యత్ర కాలే…Yathra kaale
యత్ర కాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః।
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ॥23॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎక్కడా తక్కువ అంచనా వేయడం లేదు.నేను చెబుతున్నాను,అర్జునుడు వింటున్నాడు,తల ఊపుతున్నాడు కాబట్టి అతను తక్కువ అని అనుకోవడం లేదు.అతను అర్జునుడికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు.స్నేహితుడి దగ్గర తీసుకునే చనువు తీసుకుంటున్నాడు.అర్జునుడిని భరతర్షభ అని పిలవడం లోనే అర్జునుడిని ఎంత గొప్పగా ఊహించుకుంటున్నాడో మనకు అవగతమవుతుంది.అర్జునా!ఓ భరతశ్రేష్టా!నేను ఇప్పుడు పునర్జన్మ,ముక్తి అనే పదాలు వాడాను కదా!ఏ ఏ కాలాలలో మరణిస్తే జీవికి ముక్తి లేక పునర్జన్మ లభిస్తుంది అనే దానికి కూడా నిర్దిష్టమయిన లెఖ్ఖలు ఉన్నాయి.అవి వివరిస్తాను.ధ్యాస పెట్టి విను.
॥॥॥॥॥॥॥॥॥
Yathra kaale thvanaavruththi maavruththim chaiva yoginah/
Prayaathaa yaanthi tham kaalam vakshyaami bharatharshabha//23//8//
Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu...
Sri Krishna has a very high regard about Arjuna.He gives him proper respect and takes friendly digs when needed too.You can never ignore his acknowledgement of Arjunas valour and achievements.Arjuna!hey Bharatharshabha!you have just heard me utter the words salvation and rebirths.Right?Do you know that these also have certain specifications of the time of ones death or mortality?It largely depends on the time and season when ones soul leaves the body.I will explain that in detail to you.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment