Tuesday, 6 October 2026

అభ్యాస యోగ…Abhyaasa yoga

అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా। పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్॥8॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తనను ఎలా పొందవచ్చే కూడా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!పరమాత్మను ఎలా పొందవచ్చో...ఆ కిటుకు కూడా నేనే చెబుతాను.ఇతర విషయాలపైకి మనసు వెంపర్లాడకూడదు అంటే అభ్యాస యోగము చేతనే వీలవుతుంది.ముందర ఇంద్రియాలనూ,మనసును అదుపు ఆజ్ఞలలో పెట్టుకోవటం నేర్చుకోవాలి.అప్పుడు బాసింపట్లు వేసుకుని ఆ పరంథాముడు,పరాత్పరుడు,సర్వాతీతుడు అయిన పరమ పురుషుని ధ్యానం చేయాలి.అట్లా నిమగ్నమయి,నియమ నిష్ఠలతో భగవంతుడి ధ్యానంలో మునిగి తేలేవాడు మటుకే ఆ పరమ పురుషుని పొందుతాడు. Abhyaasa yogayukthena chethasaa naanyagaaminaa/ Paramam purusham divyam yaathi paardhaanuchinthayan//8//8// Sri madbhagavadgeetha..,Akshara parabrahma yogamu... Sri Krishna is revealing the way out to Arjuna,as how to achieve God or attain salvation.Hey Pardha!really it is very difficult to gain control over materialistic cravings.It can only be achieved through strict discipline and meditation.Only after obtaining sdhithaprajnatha or wisdom only,devotee has to sit in lotus pose and meditate for Almighty.Unless you do this with strict procedures,intent and interest and sincerity and dedication,you can not achieve your goal of salvation and blessings of God.

No comments:

Post a Comment