Tuesday, 20 October 2026

పురుష స్స…Purusha ssa

పురుష స్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా। యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్॥22॥8॥ శ్రీమద్భగవద్గీత..।అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి లేని పోని భయాలు పెట్టుకోవద్దని చెబుతున్నాడుఅర్జునా!ఓ పార్థా!నేను పరమాత్మ,పరంథాముడు,మోక్షము,పునర్జన్మ లేకపోవడము..ఇలా అంతా మాట్లాడుతుంటే భయపడుతున్నావా?అదంతా అందని ద్రాక్షేలే అని డీలా పడుతున్నావా?అంత అనుమానము అఖ్ఖర లేదు.అన్ని ప్రాణులూ ఎవనిలో ఉన్నాయి?ఎవడు ఈ జగత్తు మొత్తమూ వ్యాపిండి ఉన్నాడు?ఆ పరమాత్మ,ఆ జగద్వ్యాపకుడు భక్త సులభుడు.నిజంగా,మనస్పూర్తిగా అతనిని నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడు.వాళ్ళకు పలుకుతాడు.వాళ్ళ గోడు వింటాడు.పరిష్కారము చూపిస్తాడు.ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు.ఇది నిజము. Purusha ssa parah paardha bhakthyaa labhyasthvananyayaa/ Yasyaanthasdhaani bhoothaani yena sarvamidam thatham//22//8// Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu... Sri Keishna is telling Arjuna not to freak out.Arjuna!hey Pardha!I was just mentioning about Almighty,Salvation and rebirths.Were you stressed thinking that it was all unreachable and unattainable?No need to worry.Who is the One that has entire creation in Himself?Who is spread over even in each nook and corner in this entire universe?He is the All pervading Omniscient,Paramathma.Do you know that it is very easy to please Him and attain Him?You just have to have faith in Him and submit to Him whileheartedly.The next minute He is there to hera you,understand you and sort out your problems.He is ready to have you with Him if you surrender to Him absolutely.

No comments:

Post a Comment