Sunday, 18 October 2026

అవ్యక్తోఽక్షర….Avyakthoakshara

అవ్యక్తోఽక్షర ఇత్యుక్త స్తమాహుః పరమాం గతిమ్। యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ॥21॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము ...శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా చెబుతున్నాడంటే...అమ్మ బిడ్డకు గోరు ముద్దలు తినిపించే దానికి శ్రమ పడినట్లు ఉంది.అమ్మకు చంటి బిడ్డకు అన్నం పెట్టేటప్పుడు ఎంత శ్రమ,ప్రేమ,ఇంకెంత సహనము కావాలి?అన్నం మరీ పలుకుగా ఉండకూడదు.బిడ్డకు కడుపు నొప్పి వస్తుంది.మరీ గంథంలా ఉండకూడదు.రుచీ,పచీ తెలియదు.మరీ వేడిగా ఉండకూడదు.బిడ్డకు నోరు కాలుతుంది.మరీ చల్లగా ఉంటే బిడ్డకు ఏమి తిన బుద్ధి అవుతుంది.వాడు తినే రెండు ముద్దల్లో బలము ఉండాలి,బలవర్థకాలు ఉండాలి.రుచి ఉండాలి.అన్నీ సరిగ్గా ఉన్నా ఒక్క ముద్ద బుల్లి పొట్టలోకి పోవాలంటే అమ్మను మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు.కానీ అమ్మ ఓపికగా పెడుతుంది కదా! అర్జునా!బావా!నీకు తెలుసా?పరమ పదము నా నివాసము.అది మామూలుగా మనకు కనిపించదు.ఇంద్రియాలతో దానిని తెలుసుకోలేరు ఎవరూ.దానిని ఎవరూ మట్టుపెట్టలేరు.ఎందుకంటే అది నాశరహితము.ఒకసారి అక్కడకు చేరుకుంటే ఇంక పునర్జన్మ అంటూ ప్రాణికి ఉండదు.ఎందుకంటే ఆ జీవికి మోక్షము దక్కేసింది కదా! Avyakthoakshara ithyuktha sthamaahuh paramaam gathim/ Yam praapya na nivarthanthe thaddhaama paramam mama//21//8// Sri madbhagavadgeetha...Akshara parabrahna yogamu... Sri Krishna is explaining Arjuna in a very beautiful manner.In a way,one is reminded of mother who tries to make her child eat something.The strain,the patience,the love and the meticulous manner she handles the child is simply magnanimous.She checks if the food too dry or less cooked.Because such food causes stomach pain during digestion.Food should not be over cooked because then it would lose its taste.Salt should neither be too less nor too much.Because in both the cases,child will not even taste the food.In the two or three spoons he eats,the child should get all the enrichment.Added attraction is that it takes so much of time,patience and endearing manner to make the child eat atleast a bit.Arjuna!hey brother!Paramapadam is my abode.Do you know that?You can not see it or feel it with your sensory organs.It is undestructable.Once a devotee reacches Kaivalyam,he need not go through repeated births.Because he become one with God.

No comments:

Post a Comment