Saturday, 10 October 2026

సర్వద్వారాణి…Sarva dvaaraani

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ। మూర్థ్న్యాధాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్॥12॥8॥ ఓమిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మరన్। యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్॥13॥8॥ శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమి చేస్తే పరమ పదాన్ని పొందవచ్చో చెప్పాడు.ఇప్పుడు ఎలా చేయాలి అని పద్ధతి వివరిస్తున్నాడు.అంటే ఏదీ సగం సగంలో ఆపటం లేదు.ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తున్నాడు.ఎందుకంటే అర్జునుడి మనసులో ఎలాంటి అనుమానానికీ తావు ఉండకూడదని.అర్జునా!ఓ సఖా!నేను ఎలా ధ్యానము చేయాలో కూడా చెబుతాను విను.మొదట మనిషి నవద్వారాలనూ బంధించాలి.ఇంద్రియాలను నిగ్రహించాలి.చిత్తవృత్తులు నిరోధించాలి.ప్రాణాన్ని సహస్రార చక్రములో నిలపాలి.బ్రహ్మపరమయిన ఏకాక్షరము ఓం అనే మంత్రాన్ని ధ్యానిస్తూ,నన్నే స్మరించాలి.ఈ స్థితిలో ఏకాగ్ర మనస్కుడు అయి దేహాన్ని త్యజించేవాడు మటుకే పరమ పదాన్ని పొందుతాడు.అంతే కానీ తూ తూ మంత్రాలు చదువుతూ,నలుగురు చూస్తుంటే ఒక రకంగా,ఎవరూ చూడకపోతే ఇంకో రకంగా ధ్యానము చేసేవాడు కాదు. Sarvadvaaraani samyamya mano hrudi nirudhya cha/ Moordhnyaadhaayaathmanah praana maasdhitho yogadhaaranam//12//8// Omithye kaaksharam brahma vyaaharan maamanusmaran/ Yah prayaathi thyajan deham sa yaathi paramaam gathim//13//8// Sri madbhagavadgeetha...Akshara para brahma yogamu... Sri Krishna has told Arjuna about what one should do to achieve Moksha.Now,he is explaining the actual procedure involved in doing dhyaana or meditation.He is not leaving any stone unturned in explaining and giving even the minutest details to Arjuna.His intention is that Arjuna should not feel unfulfilled in gaining knowledge.Arjuna!Hey friend!I will explain to you in detail as to how one should do meditation.You have to take grip over your navadwaaraas ie nine outlets in our body.You should gain control over your senses.You should command your mind not to waver or wander. You should take your life or praana and keep it in Sahasraara chakram.Then,you have to start chanting pious OM continuously.Being in that state and with unwavering mind you have to let go your life and leave the body.That devotee only is eligible to attain Moksha and he would definitely achieve his goal.Those who do it without devotion and behave in a certain way when others are watching and behave entirely opposite when no one is observing them do not qualify for achieving this precious goal.

No comments:

Post a Comment