Friday, 6 November 2026
అశ్రద్ధధానాః….Asraddhadhaanaah
అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప।
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసార వర్త్మని॥3॥9॥
శ్రీమద్భగవద్గీత...రాజ విద్యా రాజ గుహ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మాన్ని శ్రద్ధగా పాటించాల్సిన అవసరము చాలా ఉంది అని చెబుతున్నాడు.అర్జునుడు అంటే శ్రీకృష్ణుడుకి చాలా మంచి అభిప్రాయం ఉంది.అందుకనే పరంతపా అని పిలుస్తున్నాడు.పరంతపా అంటే శత్రు సంహారం చేసేవాడు అని అర్థము.అర్జునా!ఓ పరంతపా!నేను ఇప్పుడు చెప్పబోయే ధర్మాన్ని మంచిగా పాటిస్తే ఉత్తమము.ఎందుకంటావా?ఏమీ లేదు,అర్జునా.ఇది పాటించని వాళ్ళు నా దరిదాపుల్లోకి కూడా రాలేరు.ఇంక కైవల్యం ఎక్కడ దక్కుతుంది, చెప్పు.సాలెగూడులో చిక్కుకున్న ఈగ లాగే ఉంటుంది వాళ్ళ పరిస్థితి.పుడుతూ,చస్తూ ఉంటారు.ఆ చక్రం నుంచి బయట పడలేరు.
Asraddhadhaanaah purushaa dharma syaasya paranthapa/
Apraapya maam nivarthanthe mruthyusamsaara varthmani//3//9//
Sri mad bhagavadgeetha...Raja vidyaa raaja guhya yogamu...
Sri Krishna is advising Arjuna to follow the right path always.It is necessary also in a way.Krishna has a very high regard about Arjuna.That is why he is addressing him as Paranthapa meaning slayer of enemies.Arjuna!hey Paranthapa!if a person does not follow the righteous path,he can never dream of coming near me.When he can not even come near me,how can anyone think of salvation?In a way,he is like a fly stuck in the spider web.He can never come out of it.He is bound to the wheel of life and death and going round and round all the time.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment