Friday, 27 November 2026

అవజానంతి మాం…Avajaananthi maam

అవజానంతి మాం మూఢా మానుషీం తను మాశ్రితమ్। పరం భావ మజానంతో మమ భూతమహేశ్వరమ్॥11॥9॥ శ్రీమద్భగవద్గీత..।రాజవిద్యా రాజగుహ్య యోగము... శ్రీకృష్ణుడు సగటు మానవుడి మనసు ఎలా ఉంటుందో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను నీకు చెప్పాను కదా నేను సర్వవ్యాపకుడినీ,సర్వాంతర్యామినీ అని.అయినా దేంట్లో తల దూర్చను అనవసరంగా అని కూడా చెప్పాను కదా!నిర్వికారంగా,తటస్థంగా ఉంటాను అని కూడా చెప్పాను కదా!కానీ మామూలు మానవులు నా తత్త్వాన్ని అంత సులభంగా తెలుసుకోలేరు.ఒకటో తరగతి 35% మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే కన్నూ మిన్నూ కానకుండా ఉంటారు.అలాంటిది సర్వప్రాణికోటికీ సర్వాధికారిని ఎలా ఊహించుకుంటారు చెప్పు?కానీ అసలు పరమాత్మ అనేవాడు తామరాకు మీద నీటి బొట్టులాగ ఉంటాడు,ఉండగలతాడు అనే సత్యము జీర్ణించుకోలేరు.నా తత్త్వాన్ని అసలు తెలుసుకోలేరు.కాబట్టి నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు. ॥॥॥॥॥॥...॥॥॥॥ Sri Krishna is explaining the mindset of common man.Arjuna!hey Paardha!I told you that I am the Almighty!But I never get involved in day today life of living beings.I am unattached,a mere spectator!So,people generally fail to understand my intentions and my nature.Generally,people are egoistic even for achieving meagre and minor goals in their lives.Then how do they expect the all pervading Paramathma to behave?They can not digest the fact that He can be simple,non egoistic inspite of being the Creator!So,they fail to accept Me as Supreme.They treat Me as a commoner.Main hurdle is that they do not understand either my stand or my standing.So,they reject Me in totality. Avajaananthi maam moodaa maanysheem thanu maasritham/ Param bhaava majaanantho mama bhootha maheswaram//11//9// Sri madbhagavadgeetha...Raaja vidyaa raaja guhya yogamu...

No comments:

Post a Comment