Wednesday, 4 September 2013

raaja vidyaa raaja guhyam

raaja vidyaa raaja guhyam pavithra midamuththamam/

prathyakshaavagamam dharmyam susukham karthumavyayam//2//

ఈ రాజ విద్యా రాజ గుహ్యం అనే విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకంటే చాలా గొప్పది . ఒక రకంగా చెప్పాలంటే అన్ని విద్యలకు తలమానికం లాంటిది .ఇది చాలా పవిత్రమయిన జ్ఞానము. అన్నిటికంటే ఉత్తమం అయినది. అన్ని రకాల రహస్యం అయిన విద్యలకు శిరోభూషణం అయినది. దీంట్లో డొంక తిరుగుడు వ్యవహారం ఏమి లేదు . నేరుగా ఫలితాలను ఇస్తుంది . ఈ మార్గం ధర్మ బధ్ధమయినది . సాధన చేసేదానికి వీలు అయిన ప్రక్రియ . దీనికోసం మనం ఆచరించే మార్గం చాలా సులువు అయినది . కష్టం అంటూ ఏమి లేదు . మనసు లగ్నం చెయ్యాలి అంతే . ఇది శాస్వతం అయినది . దీని ఫలితం కూడా శాశ్వతం అయినది .
గుహ్యం అంటే గోప్యం అని అర్ధం . రాజ విద్య అంటే అన్ని విద్య లలోకి రాజు లాంటిది అని అర్ధం . 

No comments:

Post a Comment