Tuesday, 18 March 2025
న రూప మస్యేహ తథోపలభ్యతే
న రూప మస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ ధృఢేన ఛిత్వా॥3॥
శ్రీమద్భగవద్గీత ...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో సాధ్యాఽసాధ్యాల గురించి చెబుతున్నాడు.అర్జునా!మామూలుగా ఈ సంసారంలో వుండే ప్రాణులు అశ్వత్థవృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఎందుకంటే ఈ వృక్షం ఆది,మధ్య,అంతాలు లేకుండా వుంటుంది.దీని వ్రేళ్ళు ఎక్కడికక్కడ బాగా నాటుకోని వుంటాయి.ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యం తోటే మానవుడు ఛేదించగలడు.వేరే ఉపాయం,దారి లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment