Sunday 1 September 2024
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
పశ్యామి దేవాంస్తవ దేవదేహే
సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్॥15-11
విశ్వరూప సందర్శన యోగము
కృష్ణుడు తన విశ్వరూపం చూపించగానే మొదట అర్జునుడు అవాక్కైనాడు.నోట మాట రాలేదు.గొంతు గద్గదమైపోయింది.శరీరం పైనరోమాలు నిక్కబొడుచుకువ్నాయి.శరీరం పులకించింది.ఆశ్చర్యం,ఆనందం ముప్పిరిగొన్నాయి.మౌనంగా రెండు చేతులు జోడించి,మనస్పూర్తిగా నమస్కారం చేసుకున్నాడు.ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది?
కొంచెం సేపటికి తనకు తానే తేరుకుని ఇలా అంటున్నాడు.హే భగవాన్!నీ ఈ రూపం దివ్యమైనది.అతి మానుషంగా వుంది.దీనికి ఆది అంతం చెప్పనలవి కాకుండా వుంది.నీ విశ్వరూపంలో నాకు చాలా చాలా కనిపిస్తున్నాయి.ఇక్కడ నాకు సమస్త దేవ గణాలు కనిపిస్తున్నాయి.భూతగణాలు కనిపిస్తున్నాయి.పద్మంలో కూర్చుని వున్న చతుర్ముఖుడైన,సృష్టికర్త బ్రహ్మ కనిపిస్తున్నాడు.మహర్షులు కనిపిస్తున్నారు.పన్నగులు కనిపిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
అనేక విభూతి శక్తులు కలిగిన సర్వశక్తిమంతుడగు శ్రీమన్నారాయణుడు అర్జునునుద్దేశించి చేసిన బోధయే భగవద్గీత అర్జునుడు నరుడు. అంటే నరులందరికి శిరోధార్యము.
ReplyDelete